Home News ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. పాక్లో తీవ్ర ఉద్రిక్తత

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. పాక్లో తీవ్ర ఉద్రిక్తత

0
57
Imran Khan's arrest

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. పాక్లో తీవ్ర ఉద్రిక్తత

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పోలీసుులు అరెస్ట్ చేశారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పాక్ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసుల వరకూ ఉన్నాయి. జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కార్యకర్తలు గుమిగూడారు. ఇమ్రాన్ను అరెస్ట్ చేయొద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించలేదని ఆరోపణలు నమోదయ్యాయి. ఆ గిఫ్ట్స్ను ఆయన తన వద్దే ఉంచుకున్నారని చెబుతారు.