Friday, June 9, 2023

‘జాన్ విక్-4’ రివ్యూ.. ఈ మూవీ ఎలా ఉందంటే!

Must Read

‘జాన్ విక్-4’ రివ్యూ.. ఈ మూవీ ఎలా ఉందంటే!

మూవీ: జాన్ విక్-4

రిలీజ్ డేట్ : మార్చి 23, 2023

తారాగణం: కీను రీవ్స్, డోనీ యెన్, బిల్ స్కార్స్‌గార్డ్, లారెన్స్ ఫిష్‌బర్న్, హిరోయుకి సనాడ, షామియర్ ఆండర్సన్, లాన్స్ రెడ్డిక్, రినా సవయామా, స్కాట్ అడ్కిన్స్, ఇయాన్ మెక్‌షేన్

డైరెక్టర్: చాడ్ స్టాహెల్స్కీ

ప్రొడ్యూసర్స్: బాసిల్ ఇవానిక్, ఎరికా లీ, చాడ్ స్టాహెల్స్కీ

మ్యూజిక్ డైరెక్టర్: టైలర్ బేట్స్, జోయెల్ జే రిచర్డ్

సినిమాటోగ్రఫీ: డాన్ లాస్ట్‌సెన్

ఎడిటర్: నాథన్ ఓర్లోఫ్

హాలీవుడ్ సిరీస్ ల్లో బాగా పాపులర్ అయింది ‘జాన్ విక్’. ఈ మూవీ నుంచి వచ్చిన మూడు పార్టులు ఇప్పటికే సూపర్ హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో తదుపరి పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురు చూశారు. తాజాగా జాన్ విక్ నాలుగో భాగం థియేటర్లలోకి వచ్చింది. చాడ్ స్టాహెల్స్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే మంచి బజ్‌ వచ్చింది. ‘జాన్ విక్: ఛాప్టర్-4’ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది తెలుసుకుందాం..

కథ:

రిటైర్డ్ హిట్‌ మ్యాన్ జోనాథన్ అయిన జాన్ విక్ (కీను రీవ్స్) ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. హంతకుల ముఠా అయిన హై టేబుల్ నుంచి అతడు స్వేచ్ఛను కోరుకుంటాడు. జాన్ విక్ తీసుకున్న నిర్ణయం వల్ల హంతకుల ముఠా అయిన హై టేబుల్ అతడ్ని చంపాలని డిసైడ్ అవుతుంది. హై టేబుల్‌ లోని సీనియర్ సభ్యుల్లో ఒకరైన మార్క్విస్ డి గ్రామోంట్ (బిల్ స్కార్స్‌గార్డ్) ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అతడు విన్స్టన్ స్కాట్ (ఇయాన్ మెక్‌షేన్)ను న్యూయార్క్ కాంటినెంటల్ మేనేజర్‌ పదవి నుంచి తొలగిస్తాడు.

జాన్ విక్‌ను చంపడానికి రిటైర్డ్ హై టేబుల్ హంతకుడు కైన్ (డోనీ యెన్)ను మార్క్విస్ డి గ్రామోంట్ నియమిస్తాడు. కెయిన్ ది మాక్విస్‌తో కలసి అతడు ఎందుకు చేతులు కలిపాడు? తనను చంపాలనుకునే హై టేబుల్ సభ్యుడ్ని జాన్ విక్ చంపాడా? లేదా? తాను కోరుకున్న స్వేచ్ఛ అతనికి లభించిందా? లేదా? ఆ తర్వాత ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సినిమాలో సమాధానాలు లభిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

హంతకుల ముఠాను చంపేందుకు వివిధ పాతకాలపు గన్స్ తో పాటు అధునాతనమైన గన్స్ నూ జాన్ విక్ ఉపయోగిస్తాడు. జాన్ విక్ మూడో పార్ట్ ముగిసిన చోటునుంచే ఈ మూవీ మొదలవుతుంది. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా సూపర్బ్ గా ఉన్నాయి. జాన్ విక్‌గా కీను రీవ్స్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను అందించాడు. ముందు పార్ట్ లలో మాదిరిగానే ఇందులోనూ అతడి పాత్ర తక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువగా చంపుతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో రీవ్స్ ఎంతో ఇంటెన్స్ గా కనిపించాడు.

డోనీ యెన్ పోషించిన కెయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఆ పాత్రలో అతడి నటనను మెచ్చుకోకుండా ఉండలేం. జాన్ విక్ ఇతరులతో పోరాడటానికి పన్నే వ్యూహాలు ఆడియెన్స్ను విశేషంగా అలరిస్తాయి. జాన్ విక్‌ పాత్ర చెప్పే సంభాషణలు, అతడికి సంబంధించిన సీన్స్ ను డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు.

స్టైలిష్ గా కనిపించే క్రూరమైన విలన్ పాత్రగా మార్క్విస్ డి గ్రామోంట్ ను చెప్పొచ్చు. హై టేబుల్‌ సీనియర్‌ మెంబర్‌గా, జాన్‌ మరణాన్ని కోరుకొనే వ్యక్తిగా ఈ క్యారెక్టర్ లో బిల్ స్కార్స్‌గార్డ్ నటనకు ప్రశంసలు దక్కుతాయి. జాన్‌తో మార్క్విస్ తలపడే సీన్స్ సినిమాకే స్పెషల్ హైలైట్. మిగతా యాక్టర్స్ అందరూ తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు బాగానే నటించారు.

జాన్ విక్ అంటేనే యాక్షన్ సీన్స్ కు పెట్టింది పేరు. అందుకు తగ్గట్లే ఈ మూవీ మొదటి నుంచి ఆఖరి వరకు పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ లవర్స్ కి ఈ మూవీ మంచి ట్రీట్ అనే చెప్పాలి. జాన్ విక్ ఫ్రాంచైజీని ఇష్టపడే వారికి, యాక్షన్ మూవీ లవర్స్ కు.. ఈ సినిమాలోని చివరి గంట సేపు ఫెంటాస్టిక్ ఫీస్ట్ అనే చెప్పాలి. సినిమా ఆఖరి గంటసేపు నాన్‌స్టాప్ యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండి ఉంటుంది. పారిస్, న్యూయార్క్ తోపాటు బెర్లిన్‌లలో చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్ కన్నులపండువగా ఉంటాయి.

మైనస్ పాయింట్స్:

జాన్ విక్-4 మూవీ తీసిన విధానం బాగుంది. అయితే ఇందులో పాత్రల సంఖ్య అధికంగా ఉంది. వాటి బ్యాగ్రౌండ్ చూపించి ఉంటే బాగుండేది. ఉదాహరణకు కెయిన్, జాన్ విక్ కు మధ్య ఉన్న సోదరత్వం, స్నేహంపై కొన్ని సీన్స్ డిజైన్ చేసి ఉంటే ఎమోషన్ బలంగా పండేది.

ఫ్యాన్స్ కు నిరాశే
ఈ చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా బాగా ప్లాన్ చేసుకుని ఉంటే మరింత టెన్షన్ క్రియేట్ అయ్యేది. జాన్ విక్ పాత్రపై డైరెక్టర్, రైటర్స్ బాగా దృష్టి పెట్టారు. అయితే జాన్ విక్, కెయిన్ విన్‌స్టన్ మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలను ఇంజెక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. ఈ మూవీ క్లైమాక్స్ జాన్ విక్ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి.

అందుకోసమైనా మూవీ చూడాలి
సాంకేతిక విభాగాల పనితీరును చూసుకుంటే.. దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, కెమెరావర్క్, ఎడిటింగ్, మ్యూజిక్‌ చాలా బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేసిన ఫైట్ సీన్స్.. ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. యాక్షన్ సీక్వెన్స్‌లను మరింత మెరుగ్గా చూపించడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. ఎడిటింగ్ కూడా బాగుంది. చిత్రం నిడివి దాదాపు 3 గంటలు ఉన్నప్పటికీ.. మూవీ మొత్తం మీద ఒక్క డల్ మూమెంట్ కూడా లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. హాలీవుడ్ సినిమాలు ఇంత నిడివితో ఉండవనేది అందరికీ తెలిసిందే.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

- Advertisement -
Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -