TT Review: రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..!
ఇప్పుడు అంతటా వెబ్‌సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ జోరందుకుంటోంది. బిగ్ హీరోలు కూడా ఈ దిశగా అడుగులేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, హ్యాండ్సమ్ హంక్ నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందో ఉందంటే..
కథ:
రానా దగ్గుపాటి ఈ సిరీస్ లో రానా నాయుడు గా నటించారు. ముంబైలోని సెలబ్రిటీల సమస్యల్ని పరిష్కరించే వ్యక్తిగా నటించాడు. బాలీవుడ్ స్టార్స్ నుంచి క్రికెటర్ల వరకు ఎవరైనా, ఏ సెలబ్రిటీ అయినా సమస్యలో చిక్కుకుంటే, దాన్ని పరిష్కరించేందుకు వారు రానా నాయుడును కాంటాక్ట్ అవుతారు. రానా నాయుడు తన భార్యా పిల్లలతో విడిగా ఉంటాడు. అతడి సోదరులైన తేజ్ నాయుడు (సుశాంత్ సింగ్), పవన్ నాయుడు (అభిషేక్ బెనర్జీ) కూడా ముంబైలోనే ఉంటారు. రానా నాయుడు తండ్రైన నాగా నాయుడు (వెంకటేష్) 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. రానా నాయుడు తన ఫాదర్‌ను బాగా ద్వేషిస్తాడు. రానా నాయుడు తన తండ్రిని ఎందుకు ద్వేషిస్తాడు? నాగా నాయుడు రాకతో రానా నాయుడు లైఫ్ ఎలా మారిపోయింది? నాగ నాయుడు జైలుకు వెళ్లడానికి గల కారణాలు ఏంటి? వీటికి జవాబులు దొరకాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్ హైలైట్‌గా వెంకీ-రానాల నటననే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సూపర్బ్‌గా ఆకట్టుకుంటాయి. రానా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అంతేగాక భావోద్వేగ సన్నివేశాల్లోనూ చాలా బాగా నటించాడు. ఇక విక్టరీ వెంకటేష్ ఇందులో సరికొత్తగా కనిపించాడు. ఇంతకుముందు చూడని వెంకీని ఈ సిరీస్ లో చూస్తాం. నోటి దూకుడుగా వ్యవహారించే సరికొత్త యాక్టర్‌గా ఆయన్ను చూస్తాం. తన నటనాపటిమేంటో ఈ సిరీస్ తో వెంకీ మరోసారి నిరూపించుకున్నాడు. మిగిలిన నటుల్లో రానా భార్యగా నటించిన సుర్వీన్ చావ్లా చక్కగా నటించింది. అభిషేక్ బెనర్జీ పోషించిన జఫ్ఫా క్యారెక్టర్‌ను బాగా రాసారు. అతడి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. చివరి నాలుగు ఎపిసోడ్‌లు ఇంట్రెస్టింగ్గా సాగుతాయి.
మైనస్ పాయింట్స్:
వెంకటేష్ లాంటి స్టార్ హీరో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అది కూడా పాన్ ఇండియా యాక్టర్ రానా దగ్గుబాటితో కలసి నటిస్తుండడంతో ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ ను మరో రేంజ్లో కోరుకుంటారు. కానీ ఈ సిరీస్ ఆ హైప్‌కు తగినట్లుగా లేదనే చెప్పాలి. ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకోవడంలో కొంతమేర ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. మొత్తం మీద రానా నాయుడు క్రైమ్ యాక్షన్ డ్రామా ఫర్వాలేదనిపిస్తుంది. ఆఖర్లో వచ్చే కొన్ని ఎపిసోడ్‌లు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా, లాంగ్ రన్ టైమ్ ను విస్మరిస్తే ఈ షోను ఒకసారి చూడొచ్చు.