Friday, June 9, 2023

రాజ‌కీయాల్లో ఆడ‌బిడ్డ‌లు!

Must Read

రాజ‌కీయాల్లో ఆడ‌బిడ్డ‌లు!

వనిత భువిపై నడయాడే దేవత, మహిళ మహిలో మహిమాన్విత, మగువలు మమతలకు మణిదీపాలు, బుద్ధి కుశలతలో విశారదులు. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు, జీవం లేదు, ఆఖరికి ఈ సృష్టే లేదు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించటం అసాధ్యమని మనసా వాచా కర్మణా నమ్మే వారిలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అందరికన్నా ముందున్నారు. త‌న పాల‌న‌లో అన్నింటా ఆడబిడ్డలకే అగ్రాసనం వేశారు. దాదాపు ప్రతి పథకం రూపకల్పన, అమలు మహిళాభ్యున్నతే లక్ష్యంగా, సాధికారతే ధ్యేయంగా, వారి సంక్షేమమే పరమావధిగా వైఎస్ఆర్‌ పాలన సాగించారు. మహానేత అకాల మ‌ర‌ణంతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రం విడిపోయి ఏర్పాటైన ప్ర‌త్యేక తెలంగాణ‌కు రెండుసార్లు ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఎన్నిక‌య్యారు. అయితే రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతి, అస‌మ‌ర్ధ‌త పాల‌న‌కు వైఎస్ ష‌ర్మిల ఎదురుతిరిగారు. నాన్న ఆశ‌య సాధ‌న‌కు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌కు ఆశాదీపంగా మారారు.

తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ని వైెెఎస్ ష‌ర్మిల ఏర్పాటు చేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ నాయకత్వాన్ని నిలబెడతానని, తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలన తీసుకొస్తానని ప్ర‌తీన బూనారు. నాన్న మాట ఇస్తే.. బంగారు మూట ఇచ్చినట్టేనని ఆమె ఆవిర్భావ స‌భ‌లో వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్సార్ క‌ల‌ల సాకారం కోసం త‌న‌ జీవితాన్ని అం కితం చేశారు. అధికార పార్టీ, విప‌క్ష పార్టీలు ఆమెను ఎన్ని మాట‌లు అన్నా..ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నాన్న చెప్పిన మాట ఒక‌టే నాకు స్ఫూర్తి రాజ‌కీయాల‌కు మించిన వేదిక లేదు. ఆ మాటే న‌న్ను ప్ర‌జా సే వ వైపు న డిపింద‌ని ష‌ర్మిల చెబుతుంటారు. తెలంగాణ‌లో పార్టీ ఎందుకు పెడుతున్నారు అని అడిగేవారికి ఆమె ఒక్కటే స‌మాధానం వైఎస్సార్ అమలు చే సిన సంక్షేమం, అ భివృద్ధిని స‌జీవంగా ఉంచ‌డ‌మే త‌న ల‌క్ష్యమంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ‌లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌నను తీసుకువ‌స్తాను అన్న‌దే ఆమె ఆశ‌యంగా ముందుకు వెళ్తోంది. మ‌హిళా దినోత్స‌వం రోజున వైఎస్ ష‌ర్మిల‌మ్మ పోరాటాల‌ను తెలంగాణ మ‌హిళ‌లు కొనియాడుతున్నారు.

రాజకీయాల్లో యువ మహిళామణులు

ప్రియాంక గాంధీ..ఆమె కుటుంబ నేఫథ్యం గురించి కొత్త గా వివరించనక్కర్లేదు. కేవలం అలాంటి నేపథ్యంతోనే కాదు.. సొంతంగా కూడా చాకచక్యంగా వ్యవహరించగల మహిళగా ప్రియాంక నిరూపించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లో ప్రియాంక మంత్రాంగంతోనే కాంగ్రెస్- ఎస్పీల పొత్తు కుదిరింది. కొత్త సమీకరణానికి కారణం అయ్యింది.

శ్రుతి చౌదరి

హర్యానాలోని ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శ్రుతి చౌదరి.. విదేశాల్లో చదువుకున్నారు. కుటుంబ నేపథ్యంతో ఈమె రాజకీయంగా రాణించడానికి అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 2009 లో భివానీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించింది ఈమె.

షాజియా ఇల్మీ

టీవీ జర్నలిస్టుగా పని చేసి… అన్నా హజారే ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక పోరులో భాగస్వామి అయ్యారీమె. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావంతో అందులో చేరారు. అయితే అనంతరం ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.

రోజా

పట్టువదలకుండా పోటీ చేసి.. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆర్కే రోజా సెల్వమణి. తెలుగునాట ఒకనాడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన రోజా ప్రస్తుతం ఏపీ మంత్రిగా కొన‌సాగుతున్నారు.

రమ్య

గతం లో కర్ణాటకలోని మాండ్య నుంచి 30 యేళ్ల వయసులో ఎంపీగా ఎన్నికై గత లోక్ సభలో పర్యాయంలో యంగెస్ట్ ఎంపీగా నిలిచిన రమ్య ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాల్లో తనమునకలై ఉన్నారు. భవిష్యత్తులో తిరిగి గెలవగల ధీమాతో ఉన్నారు.

పంకజా ముండే

దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే వారసురాలిగా మరాఠా రాజకీయాల్లోకి వచ్చారు పంకజ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ఆ వెంటనే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రాణిస్తున్నారీమె.

నగ్మా

ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం లేదు కానీ.. సినీ నటిగానే కాకుండా రాజకీయ వేత్త గా కూడా నగ్మా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చాలా సంవత్సరాల కిందటే కాంగ్రెస్ పార్టీలో చేరిన నగ్మా.. ఆ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగుతున్నారు.

కుష్బూ

తమిళ సినీ తారగా.. తమిళుల ఆరాధ్య హీరోయిన్ గా వెలిగిన కుష్బూ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. కొంతకాలం డీఎంకేలో పని చేసిన కుష్బూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తమిళ రాజకీయ, సామాజిక అంశాలతో పాటు వివిధ వ్యవహారాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా చెబుతుంటారు.

డింపుల్ యాదవ్

యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ- కాంగ్రెస్ పార్టీల కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్ గా పరిచయం చేయాలి డింపుల్ యాదవ్ ను. ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్ భార్య గా, రాజకీయ భీష్ముడు ములాయం కోడలిగా దేశవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుందీమె. ఎంపీ హోదాలో లోక్ సభలో తన ప్రసంగాలతో కూడా డింపుల్ ప్రత్యేకతను చాటుకుంది.

చహవీ రజవత్

యువ మహిళా రాజకీయ నేతలంటే.. వాళ్లు జాతీయ రాజీకీయాల్లోనో, రాష్ట్ర ప్రభుత్వాల్లోనో కీలక పాత్ర పోషించనక్కర్లేదు. స్వశక్తితో సర్పంచ్ పాత్రను పోషించినా అది ప్రత్యేకమే. అలాంటి యువతే చహవీ రజవత్. జైపూర్ కు అరవై కిలోమీటర్ల దూరంలోని సోదా అనే గ్రామ సర్పంచ్ ఈ యువతి. పుణే లో ఎంబీయే చదివి.. ఎమ్ఎన్సీల్లో ఉద్యోగం వైపు కాకుండా.. సొంతూరికి వెళ్లి సర్పంచ్ గా సేవలందిస్తోంది చహవీ.

అంగూర్ లత

29 యేళ్ల వయసుకే అస్సామీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అంగూర్ లత. సినీ నేఫథ్యం నుంచి వచ్చింది ఈమె. పలు అస్సామీ సినిమాల్లో నటించాకా, భారతీయ జనతా పార్టీలో చేరి విజయం సాధించారీమె. అందమైన ప్రజాప్రతినిధి అని అందరూ కీర్తిస్తుంటే, బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతను ఇవ్వనక్కర్లేదని ఈమె స్పష్టం చేస్తారు.

అల్కా లంబా

ఢిల్లీ వేదికగా ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన దీక్షపై విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని… ప్రగతి భవన్ ముందు అంటూ హితవు పలికారు.


YS Sharmila On MLC Kavitha Strike:

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షను చేపట్టనున్నారు. ఢిల్లీ వేదికగా మార్చి 10వ తేదీన నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే కవిత దీక్షపై ట్విట్టర్ వేదికగా స్పందించారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.

దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు అంటూ హితవు పలికారు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు.. మహిళలకే తలవంపు తెచ్చారంటూ కవితను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

- Advertisement -
Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -