నా పేరు రాజేష్. నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు. అప్పుడప్పుడే స్కూల్ కు వెలుతున్న రోజులవి. టీచర్ లు అ..ఆ..అని పలక మీద దిద్దిస్తే వాటిని బలపంతో చదువుతూ దిద్దుతున్నాను. వెంటనే నా పక్కన ఉన్న రాము గాడు బయటికి వెల్దంరా అన్నాడు. మరి టీచర్ పంపించదు కదరా అంటే టాయిలెట్ అర్జెంట్ అని...
అప్పుడే అమ్మ పొయ్యి దగ్గర రొట్టెలు చేస్తోంది. నేను నా బుల్లి బుల్లి నడకతో అమ్మదగ్గరకు వెలుతున్నాను. వెంటనే అన్నయ్య సూరి వచ్చి అమ్మదగ్గరకు వెల్లకుండా ఎత్తుకున్నాడు. అమ్మ అన్నయ్యతో తమ్ముడిని కాసేపు ఆడించురా నేను రొట్టెలు అయిపోగానే తీసుకుంటాను అని చెప్పింది. అన్నయ్య అమ్మకు సరే అని చెప్పి నన్ను ఆడిస్తూ బయటకు...