100 మంది ‘కామన్ మెన్’ సెలబ్రిటీలుగా విడుదల కానున్న ‘బాయ్స్’ చిత్ర ట్రైలర్..

100 మంది ‘కామన్ మెన్’ సెలబ్రిటీలుగా విడు...
శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే సన్నీలియోన్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్పటి వరకు విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విభిన్నమైన పద్దతిలో విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనికోసం కొత్త కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నారు. కామన్ మ్యాన్‌ను సెలబ్రిటీస్‌గా మారుస్తూ.. ట్రైలర్ విడుదల చేయబోతున్నారు బాయ్స్ దర్శక నిర్మాతలు. దీనికోసం ఆంధ్ర, తెలంగాణ నుంచి 100 మంది కామన్ పీపుల్‌ను ఎంపిక చేసి.. వాళ్లకు రోజూ 10 వేలు, 5 వేలు, 3 వేలు చొప్పున క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు బాయ్స్ చిత్ర యూనిట్. కామన్ మ్యాన్‌ను సెలబ్రిటీగా మార్చేస్తున్న ఈ కాన్సెప్టుకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఏ సిటీకి వెళ్లినా కూడా బాయ్స్ చిత్ర యూనిట్‌కు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. కామన్ మ్యాన్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి సిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయి. విజయవాడ నుంచి గ్రాండ్‌గా కామన్ మ్యాన్ ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 10 పెద్ద సిటీస్ చిత్రయూనిట్ తిరిగి ‘Common Man is Our Celebrity’ కాన్సెప్టును మరింత విస్తృతం చేయనున్నారు. మొత్తంగా 100 మంది కామన్ మెన్‌ను ఎంపిక చేసి.. వాళ్లతోనే ఓ భారీ వేదికపై బాయ్స్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయించబోతున్నారు దర్శక నిర్మాతలు. దర్శకుడు దయానంద్‌తో పాటు చిత్ర యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయానికి మంచి స్పందన వస్తుంది. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు. 

PostedOn: 04 Sep 2021 Total Views: 124




వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ‘ది ట్...

వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ‘ది ట్రిప్’ సిని...

ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో VDR ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న సినిమా ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ది ట్రిప్ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ చూస్తుంటే రొటీ...

26 Oct 2021

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మ...

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎట‌ర్న...

దీపావ‌ళీ కానుక‌గా న‌వంబ‌ర్ 4న‌ డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎటర్నెల్స్ విడుద‌ల కానుంది. ఎవెంజ‌ర్స్ సిరీస్ ఎండ్ అవ్వ‌డంతో హాలీవుడ్ మూవీ ల‌వ‌ర్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి మార్వెల్ వారు ఎట‌ర్నెల్స్ అనే కొత్త సూప‌ర్ హీరోల్ని సృష్టించారు, భార‌త‌దేశంలో ఉన్న అన్ని ముఖ్య‌మైన భాష‌ల్లో ఈ చిత్ర...

25 Oct 2021

చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పా...

చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పాట‌కు అనూహ్...

అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా రాబోతున్న మూవీ చిల్ బ్రో. మొద‌టి సినిమా అయినప్ప‌టికీ నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ సినిమాను ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన...

23 Oct 2021

లవ్ & ఎమోషన్స్ "మధుర వైన్స్" మూవీ రివ్యూ

లవ్ & ఎమోషన్స్ "మధుర వైన్స్" మూవీ రివ్యూ

ఆర్.కె.సినీ టాకీస్,ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు ,సృజన్ యారబోలు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం "మధుర వైన్స్". ఈ చిత్రం అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని...

22 Oct 2021

అల్ట్రా స్టైలిష్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న ...

అల్ట్రా స్టైలిష్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న ప్ర‌భాస్‌!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. డార్లింగ్ కామన్ డీపీతో నెట్టింట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల నుంచి వచ...

22 Oct 2021

'సర్కారు వారి పాట' ఫ‌స్ట్ సాంగ్ పై థ‌మ‌న...

'సర్కారు వారి పాట' ఫ‌స్ట్ సాంగ్ పై థ‌మ‌న్ అప్‌డేట్...

పరశురాం పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెకుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో మహేశ్ ఎంత స్టైలిష్‌గా ఉన్నాడో అందరూ చూశారు. ఇందులో ఆయనను ఎలివేట్ ...

22 Oct 2021

సీనియ‌ర్ న‌టుడిపై అన‌సూయ షాకింగ్ కామెంట్...

సీనియ‌ర్ న‌టుడిపై అన‌సూయ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయపై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే! ఆమె మంచి నటి అనీ, అందంగా ఉంటుందనీ, కానీ ఆమె వస్త్రధారణ తనకు నచ్చదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై పేరు చెప్పకుండా ఫైర్‌ అయ్యారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు ధరిస్తారు. అది వ్యక్తిగతమని అనసూయ ...

19 Oct 2021

"మధుర వైన్స్" ప్రి రిలీజ్ ఈవెంట్

"మధుర వైన్స్" ప్రి రిలీజ్ ఈవెంట్

ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు నిర్మిస్తున్న చిత్రం "మధుర వైన్స్". గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోల...

18 Oct 2021