బై-సెక్సువల్‌ గా వివాదాస్పద పాత్రలో సమంత!

బై-సెక్సువల్‌ గా వివాదాస్పద పాత్రలో సమంత...
విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా దూసుకుపోతోంది. వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకాలు చేస్తూ సరికొత్తగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లి తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌కు సంతకం చేసినట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ అనే చిత్రంతో సామ్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది సమంత. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇది భారతీయ రచయిత ఎన్‌ మురారి రాసిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ కంటే మించిన వివాస్పద పాత్రలో సమంత నటించబోతోంది. బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోందట. అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర ఇది. అంతేగాక ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారట. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో కూడా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో బోల్డ్‌ సీన్స్‌లో నటించి విమర్శలు ఎదుర్కొన్న సామ్‌ ఇప్పుడు దీనికంటే వివాదస్పద పాత్రం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చెప్పాలంటే చైతో విడిపోవడానికి ఈ సినిమాలో రాజీ పాత్ర కూడా ఒక కారణమని వార్తలు వచ్చిన విషయం విధితమే. ఇక ఇటీవల శాకుంతలం మూవీని పూర్తి చేసుకున్న సమంత తమిళలో​ కాతువాకుల రెండు కాదల్‌లో నటిస్తోంది. దీనితో పాటు డ్రీమ్‌ వారియర్‌ బ్యానర్లో ఓ ద్విభాసా చిత్రంతో పాటు శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాణంలో సమంత మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక ఈ ప్రాజెక్ట్స్‌కు సమంత భారీగా పారితోషికం అందుకుంటోందని కూడా వినికిడి. ఇదిలా ఉంటే పుష్పలో ఐటెం సాంగ్‌ చేయడానికి కూడా సామ్‌ సిద్ధమైన సంగతి తెలిసిందే.

PostedOn: 26 Nov 2021 Total Views: 136
సౌత్ స్టార్స్ పై కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ...

సౌత్ స్టార్స్ పై కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు కాంట్రవర్సరీలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సౌత్‌ స్టార్స్‌పై కంగనా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ కల్చర్‌, నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కంగనా తాజాగా మరోసారి తనదైన స...

25 Jan 2022

BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ : బైక్ ధ...

BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ : బైక్ ధ‌ర‌ ఎంతో త...

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో బోలెడంత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది. సోషల్‌ మీడియాలోనూ యాక్...

25 Jan 2022

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

సునీత భర్త రామ్ సొంత యూ ట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గౌడ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఆ ఛానల్ లో వీడియోలు పెట్టారని శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు ముట్టడించారు. గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఛానల్ అధినేత...

25 Jan 2022

ఓవర్సీస్‌లో భీమ్లానాయ‌క్‌ భారీ రిలీజ్‌కు...

ఓవర్సీస్‌లో భీమ్లానాయ‌క్‌ భారీ రిలీజ్‌కు సర్వం సిద...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని. ఫిబ్రవరి 25న విడుదల తేదీ లాక్ చేస...

25 Jan 2022

మెగాస్టార్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన త...

మెగాస్టార్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన త్రిష‌

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ‘ఆచార్య’ విడుదలకు సిద్ధం కాగా, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ ఏడాదే చిత్రం సెట్స్ పైకి వెళ్ళబో...

25 Jan 2022

సింపుల్‌గా దివంగత నిర్మాత బీఏ రాజు కుమార...

సింపుల్‌గా దివంగత నిర్మాత బీఏ రాజు కుమారుడి పెళ్లి

దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్‌ శివకుమార్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. క...

25 Jan 2022

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రే...

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్...

'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్​ స్టార్​ అల్లు అర్జున్​ స్టార్ మారిపోయింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అ‍ల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం...

25 Jan 2022

వాళ్ల వ‌ల్లే ఇంత బాధ ప‌డుతున్నా : సోష‌ల్...

వాళ్ల వ‌ల్లే ఇంత బాధ ప‌డుతున్నా : సోష‌ల్ మీడియాలో ...

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన వర్ష బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్‌ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తాజాగా భావోద్వేనికి ల...

24 Jan 2022