RRRలో ఆలియాభ‌ట్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌!

RRRలో ఆలియాభ‌ట్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న...
దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం.. రణం.. రుథిరం). యంగ్‌ టైగర​ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్‌ వరుస అప్‌డేట్స్‌ వదులుతూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలై ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్‌ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీలో అలియా భట్‌ రెమ్యునరేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు అలియా మొత్తం 10 రోజుల కాల్‌షీట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆమె నిడివి దాదాపు 15 నిమిషాలు ఉంటుందట. దీనికే ఆమె సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ మార్కెట్ మన సినిమాకు రావాలంటే ఆలియా భట్ ఉండాల్సిందేనని జక్కన్న కోరడంతో నిర్మాతలు ఒకే అన్నారంట. ఆమె అడిగిన పారితోషికం ఇచ్చి ఆమెను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. దీంతో ఆమె రెమ్యునరేషన్‌ ఎంతో తెలిసి నెటిజన్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలియాకు అంత పారితోషికం ఇవ్వడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరూ అలియా భట్‌ అంటే ఆ మాత్రం రేంజ్‌ ఉండాలంటూ మరికొందరూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో అలియా ఒక్క సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల తీసుకుంటుదట. రెండు మూడు నెలల కాల్‌షిట్స్‌కు 10 కోట్లు తీసుకునే ఆమె కేవలం 10 రోజులకు 5 కోట్లు వసూలు చేయడం సరికాదంటున్నారు. హిందీ సినిమా కంటే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకే ఆమె ఎక్కువ పారితోషికం అందుకుందంటున్నారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషిస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లిష్ నటి ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.

PostedOn: 29 Nov 2021 Total Views: 140




సౌత్ స్టార్స్ పై కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ...

సౌత్ స్టార్స్ పై కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు కాంట్రవర్సరీలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సౌత్‌ స్టార్స్‌పై కంగనా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ కల్చర్‌, నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కంగనా తాజాగా మరోసారి తనదైన స...

25 Jan 2022

BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ : బైక్ ధ...

BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ : బైక్ ధ‌ర‌ ఎంతో త...

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో బోలెడంత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది. సోషల్‌ మీడియాలోనూ యాక్...

25 Jan 2022

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

సునీత భర్త రామ్ సొంత యూ ట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గౌడ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఆ ఛానల్ లో వీడియోలు పెట్టారని శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు ముట్టడించారు. గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఛానల్ అధినేత...

25 Jan 2022

ఓవర్సీస్‌లో భీమ్లానాయ‌క్‌ భారీ రిలీజ్‌కు...

ఓవర్సీస్‌లో భీమ్లానాయ‌క్‌ భారీ రిలీజ్‌కు సర్వం సిద...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని. ఫిబ్రవరి 25న విడుదల తేదీ లాక్ చేస...

25 Jan 2022

మెగాస్టార్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన త...

మెగాస్టార్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన త్రిష‌

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ‘ఆచార్య’ విడుదలకు సిద్ధం కాగా, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ ఏడాదే చిత్రం సెట్స్ పైకి వెళ్ళబో...

25 Jan 2022

సింపుల్‌గా దివంగత నిర్మాత బీఏ రాజు కుమార...

సింపుల్‌గా దివంగత నిర్మాత బీఏ రాజు కుమారుడి పెళ్లి

దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్‌ శివకుమార్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. క...

25 Jan 2022

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రే...

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్...

'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్​ స్టార్​ అల్లు అర్జున్​ స్టార్ మారిపోయింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అ‍ల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం...

25 Jan 2022

వాళ్ల వ‌ల్లే ఇంత బాధ ప‌డుతున్నా : సోష‌ల్...

వాళ్ల వ‌ల్లే ఇంత బాధ ప‌డుతున్నా : సోష‌ల్ మీడియాలో ...

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన వర్ష బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్‌ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తాజాగా భావోద్వేనికి ల...

24 Jan 2022