అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్‌!

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రే...
'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్​ స్టార్​ అల్లు అర్జున్​ స్టార్ మారిపోయింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అ‍ల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత డిమాండ్​ ఉన్న నటుడిగా మారాడు. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్​ 'ది రూల్'​ సినిమా షూటింగ్​ ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్స్​ ఏంటా అని ఆసక్తి నెలకొంది. అయితే తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్​ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్​ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్​కు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్​ ఆఫర్​ చేసినట్లు సమాచారం. ఇందుకోసం అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు భోగట్టా. అయితే ఈ చర్చలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ లైకా ప్రొడక్షన్​ బన్నీకి రూ. 100 కోట్ల పారితోషికం ఆఫర్​ చేసి అల్లు అర్జున్​ ఒప్పుకుంటే పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ సరసన నిలుస్తాడు. ప్రభాస్​ కూడా తన సినిమాలకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్​ తీసుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా ఇలా ఉంటే అట్లీ ప్రస్తుతం బాలీవుడ్​ బాద్​షా షారుఖ్​ ఖాన్​, నయనతారలతో 'లయన్'​ సినిమా షూటింగ్​ పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్​ 'పుష్ప: ది రూల్'​తో పాటు వేణు శ్రీరామ్​తో ఒక సినిమా​, కొరటాల శివతో రివేంజ్​ డ్రామా మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఏఆర్​ మురుగదాస్​, ప్రశాంత్​ నీల్​, బోయపాటి శ్రీనులతో కూడా సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

PostedOn: 25 Jan 2022 Total Views: 140




మ‌హేశ్ సినిమా కోసం సీక్రెట్‌గా థియేట‌ర్‌...

మ‌హేశ్ సినిమా కోసం సీక్రెట్‌గా థియేట‌ర్‌కు వెళ్లిన...

మహేష్ బాబు(Mahesh Babu) నటించిన మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). రీసెంట్‌గా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో భారీ కలెక్షన్లతో ఈసినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఇటీవలే మహేష్(Mahesh) సతీమణి నమ్రత సైతం... హైదరాబాద్‌(Hyderabad)లోని సుదర్శన్ థియేటర్లో ఈ చిత్రాన్ని చూశార...

16 May 2022

రాజ‌మౌళి RRR టీంపై మ‌హేశ్ ఫ్యాన్స్ ట్రోల...

రాజ‌మౌళి RRR టీంపై మ‌హేశ్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌

రాజమౌళి RRR టీమ్‌పై మహేష్ బాబు ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. జక్కన్నపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం RRR టీమ్ చేసిన ఓ ట్వీట్. గత రెండు మూడు రోజులుగా నెట్టింట్లో తీవ్ర అసహనంతో ఉన్న మహేష్ ఫ్యాన్స్‌ని RRR టీమ్ చేసిన ట్వీట్ ఇంకాస్త ఇబ్బంది పెట్టింది. దీంతో రాజమౌళి సహా RRR యూనిట్ మొత్తాన్ని...

16 May 2022

స‌ర్కారు వారి పాట కోసం మ‌హేశ్‌బాబు షాకిం...

స‌ర్కారు వారి పాట కోసం మ‌హేశ్‌బాబు షాకింగ్ రెమ్యున...

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమా వస్తోందంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది మాస్‌ మసాలా మూవీతో వచ్చాడంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. తాజాగా మహేశ్‌బాబు నటించిన సర్కారువారి పాట థియేటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతోం...

16 May 2022

సమంత పాట ఫేవ‌రెట్ అంటున్న బాలీవుడ్ హీరో

సమంత పాట ఫేవ‌రెట్ అంటున్న బాలీవుడ్ హీరో

బాలీవుడ్‌ హీరోల్లో విలక్షణ శైలి ఉన్న హీరో రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer singh). ఆయన ఎంచుకునే పాత్రల నుంచి డ్రెసింగ్‌ వరకూ అంతా డిఫరెంట్‌గానే ఉంటుంది. తాజాగా ఆయన ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ (jayesh bhai jordar)చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగులో నచ్చిన పాట గురించి ప్రస్త...

11 May 2022

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ గు...

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌...

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR)సినిమా కోసం తెలిసిందే. ఈ సినిమా విడుదలై నెలరోజులకు పైగా అవుతున్నా.. ఆర్ఆర్ఆర్ మ్యానియా మాత్రం తగ్గడం లేదు. నేటికి సినిమా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫెక్ట్ పిల్లలు రాసే పరీక్షల మీద కూడా పడింది. తాజాగా ఓ ఎగ్జామ్ పేపర్‌లో ఆర్...

10 May 2022

బాలీవుడ్‌లో సినిమాలు తీసి నా టైం వేస్ట్ ...

బాలీవుడ్‌లో సినిమాలు తీసి నా టైం వేస్ట్ చేసుకోను :...

బాలీవుడ్‌ పరిశ్రమపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. సోమవారం జరిగిన మేజర్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మహేశ్‌కు బాలీవుడ్‌ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌ తనని భరించలేదని, అక్కడ సినిమాలు చేసి టైం వెస్ట్‌ చేయనంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. సౌ...

10 May 2022

విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై బండ్ల గ‌ణేష్ ఆస‌క్త...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై బండ్ల గ‌ణేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ...

స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ బర్త్‌డే సందర్బంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సోమవారం(మే 9) విజయ్‌ పుట్టిన రోజున సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా అతడి విషస్‌ తెలిపారు. అలాగే బండ్ల గణేశ్‌ కూడా విజయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ...

10 May 2022

త‌ల్లి కాబోతున్న హీరోయిన్... సోష‌ల్ మీడి...

త‌ల్లి కాబోతున్న హీరోయిన్... సోష‌ల్ మీడియాలో ఫొటోల...

ఇటీవల కాలంలో సినీ తారలు తాము తల్లి కాబోతున్నామనే విషయాన్ని బహిరంగానే ప్రకటిస్తున్నారు. అంతేకాదు బేబి బంప్ ఫొటోల‌ను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ అగ్రహీరోయిన్‌ కాజల్‌ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. హీరోయిన్‌ ప్రణీత, సంజన గల్రాని తాము ప్రెగ్నెంట్‌ అనే విషయాన...

10 May 2022