రాధేశ్యామ్ టాప్ సీక్రెట్ లీక్ అయిందిగా..

రాధేశ్యామ్ టాప్ సీక్రెట్ లీక్ అయిందిగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా.. పూజా హెగ్దే నాయికగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు- హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదో పీరియాడికల్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. అలాగే నాటి కాలమానం ప్రకారం సెట్లలో యాక్షన్ సన్నివేశాలు అంతే ఆసక్తికరంగాను సాగనున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించి చిత్రీకరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ విజువల్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ కూడా చాలా వరకూ పూర్తయింది. కరోనా తొలి .. రెండవ వేవ్ సమయంలో సైతం రాధేశ్యామ్ యూనిట్ షూటింగ్ కి పెద్దగా బ్రేక్ వేయలేదు. నిబంధనలు ఉన్నా కరోనా అంతగా అధికంగా లేని దేశంలోకి వెళ్లి మరీ షూటింగ్ చేసారు. సెకెండ్ వేవ్ సమయంలో కొంచెం విశ్రాంతి తీసుకున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం కేటాయించి వీలైనంత వరకూ ఆ పనులు పూర్తి చేసారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ని పూజాహెగ్దే అందించింది. షూటింగ్ దాదాపు పూర్తయిందని ఇంకా కేవలం 10 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపింది. ఇదొక మంచి లవ్ స్టోరీ..ఇలాంటి పాత్రలో నటించి చాలా కాలమైందని...కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని పేర్కొంది. అయితే తన పాత్ర రొమాంటిక్ గా ఉంటుందని..ఇతర విషయాలు మాత్రం ఇప్పుడే చెప్పలేనని చెప్పుకొచ్చింది. ఇక పూజాహెగ్దే మిగతా సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `ఆచార్య`లో నీలాంబరి పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `సర్కస్`.. `భాయిజాన్` చిత్రాల్లో.. తమిళ్ లో విజయ్ సరసన `బీస్ట్` అనే చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే పూజా హెగ్దే ఆల్ అబౌట్ లవ్ అనే ఓ స్వచ్ఛంగా సంస్థ ద్వారా సామాజికి సేవ చేస్తోంది. తన సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపింది. ఏడాది కాలంగా సంస్థ బాగా నడుస్తుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్ని అందరూ ప్రోత్సహించాలని కోరారు.

PostedOn: 23 Jul 2021 Total Views: 98
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటున్న ...

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటున్న ‘నీతో’ టీజ...

అభిరామ్ వర్మ, సాత్విక రాజ్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ నీతో. ఏవిఆర్ స్వామి, ఎమ్ఆర్ కీర్తన, స్నేహాల్ జంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలు శర్మ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. లవ్ లైఫ్ డ్రామాగా నీతో టీజర్ ఆకట్టుకుంటుంది. యూత్ ఫుల్ అంశాలతో ఈ టీజర్ కట్ చేసారు...

26 Sep 2021

జంగిల్ క్రూస్ మూవీ రివ్యూ

జంగిల్ క్రూస్ మూవీ రివ్యూ

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్ర నిర్మాణ సంస్థ వాల్డ్ డిస్నీ పిక్చర్స్. ఆ సంస్థ నిర్మించిన ఫాంటసీ అడ్వంచరస్ మూవీ ‘జంగిల్ క్రూస్’. వరల్డ్ ఫేమస్ రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాక్ అలియాస్ డ్వేన్ జాక్సన్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24, శుక్రవారం విడుదల అవుతోంది. ఇప్పటికే ‘ది స్కార్పియన్ కింగ్,...

23 Sep 2021

అభిమానులను ఆశ్చర్యపరిచిన నేచురల్ స్టార్ ...

అభిమానులను ఆశ్చర్యపరిచిన నేచురల్ స్టార్ నాని

టక్ జగదీష్, ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది మరియు చలనచిత్ర సోదరులు మరియు ప్రేక్షకుల నుండి చాలా ప్రేమ మరియు ప్రశంసలు అందుకున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా రెగ్యులర్ పోస్టర్‌ని ఇన్‌స్టాల్ చేయాలనే ఆశతో మాల్‌లోకి వెళ్లినప్పుడు నాని అభిమానులు ప్రత్యేక ఆశ్చర్యం వ్యక్తం చేశారు, అయినప్పటికీ, ఇది సాధార...

16 Sep 2021

‘చకోరి’ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన...

‘చకోరి’ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన నా చెలివే...

నోయల్ సీన్, మెహబూబ్, సుమీత బజాజ్ ప్రధాన పాత్రల్లో ఆష్టా సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సత్య ధానేకుల దర్శకత్వంలో దేవు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా చకోరి. ఈ చిత్రం నుంచి తాజాగా నా చెలివే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా.. నోయల్ సీన్, మెహబూబ్ అం...

13 Sep 2021

అక్షయ్‌ 'ఓ మై గాడ్‌' సీక్వెల్‌ ప్రారంభం

అక్షయ్‌ 'ఓ మై గాడ్‌' సీక్వెల్‌ ప్రారంభం

2012లో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న హిందీ చిత్రం 'ఓ మై గాడ్‌'. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ఓ మై గాడ్‌ 2' తెరకెక్కుతోంది. పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యామి గౌతమ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ముంబయిలో ఈ సిన...

04 Sep 2021

100 మంది ‘కామన్ మెన్’ సెలబ్రిటీలుగా విడు...

100 మంది ‘కామన్ మెన్’ సెలబ్రిటీలుగా విడుదల కానున్న...

శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే సన్నీలియోన్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్పటి వరకు విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విభిన్నమైన పద...

04 Sep 2021

20 కోట్లకు 'కార్తికేయ‌ 2' రైట్స్ సొంతం చ...

20 కోట్లకు 'కార్తికేయ‌ 2' రైట్స్ సొంతం చేసుకున్న జ...

వరస విజయాలు, విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. యూత్ ఐకాన్‌గా మారిపోయారు యంగ్ హీరో నిఖిల్. కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త కథలు ప్రయత్నిస్తూనే ఉంటారు ఆయన. అలా నిఖిల్ ప్ర‌తిష్టాత్మ‌క థ్రిల్ల‌ర్ కార్తికేయ. ఎనిమ‌ల్ హిప్న‌టిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రంతో తెలుగు తెరకి ప‌రిచ‌యం...

04 Sep 2021

లేడీ ఓరియెంటెడ్ "అశ్మీ" మూవీ రివ్యూ

లేడీ ఓరియెంటెడ్ "అశ్మీ" మూవీ రివ్యూ

న‌టీన‌టులు: రుషికా రాజ్, రాజా న‌రేంద్ర‌, కేశవ్ దీప‌క్ సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్ - సాచీ క్రియేష‌న్స్ నిర్మాత - స్నేహా రాకేశ్ ర‌చ‌న - ద‌ర్శ‌కత్వం, సినిమాటోగ్ర‌ఫి - శేష్ కార్తీకేయ‌ ఎడిటింగ్ - ప్ర‌వీణ్ పూడి మ్యూజిక్ - శాండీ అద్దంకి పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్ సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాక...

04 Sep 2021