లేడీ ఓరియెంటెడ్ "అశ్మీ" మూవీ రివ్యూ

లేడీ ఓరియెంటెడ్ "అశ్మీ" మూవీ రివ్యూ
న‌టీన‌టులు: రుషికా రాజ్, రాజా న‌రేంద్ర‌, కేశవ్ దీప‌క్ సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్ - సాచీ క్రియేష‌న్స్ నిర్మాత - స్నేహా రాకేశ్ ర‌చ‌న - ద‌ర్శ‌కత్వం, సినిమాటోగ్ర‌ఫి - శేష్ కార్తీకేయ‌ ఎడిటింగ్ - ప్ర‌వీణ్ పూడి మ్యూజిక్ - శాండీ అద్దంకి పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్ సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్ర "అశ్మీ." పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 3 న థియేటర్లలో విడుదలైన ఫీమేల్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ “అష్మీ”.  చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి. కథ : అష్మీ (రుషిక రాజ్) ఓ గదిలో కొన్ని సంవత్సరాలుగా నిర్బంధించబడి ఉంటుంది. ఆమెకు కనీస అవసరాలైన ఇవ్వకుండా తినడానికి సరైన ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేసి మానసికంగా, శారీరకంగా తను ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. అయితే ఆ గది నుంచి బయటపడ్డాక తనను చిత్రహింసలకు గురిచేసింది రాజేశ్ మిశ్రా (కేశవ్ దీపక్) అని నమ్మి అతడిని  చంపేస్తుంది అష్మీ. ఆ తర్వాత తనను చిత్రహింసలకు గురిచేసింది శివ (రాజ నరేంద్ర) అని తెలుసుకుంటుంది. అయితే అసలు అష్మీకి, శివకు మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? ఎందుకోసం శివ అష్మీనీ బంధించి చిత్రహింసలకు గురిచేశాడు? చివరకు అష్మీ శివపై ఏ విధమైన రివేంజ్ తీర్చుకుంది అనే  తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…!!! నటీనటుల పనితీరు: నటీనటుల పర్మార్మెన్స్ విషయానికొస్తే..అష్మీ ను కొన్ని సంవత్సరాలుగా ఒక గదిలో బందిస్తే ఆ అమ్మాయి ఎన్ని బాధలు పడింది. అక్కడ ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత తనను బందీగా ఉంచిన వారిపై ఎలాంటి పగ తీర్చుకుంది అనే  సస్పెన్స్ థ్రిల్లర్ కథలో అష్మీ  (రుషిక రాజ్) చాలా చక్కగా నటించింది. ఆమె నటనకు కొత్త అయినస కూడా  చాలా చక్కటి అభినయమైన నటనను కనబరచింది. ఇక రాజ నరేంద్ర, కేశవ్ దీపక్ కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు.అంతా తమ పాత్రల పరిధి మేరకు కన్విన్సింగ్ గా నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు శేష్ కార్తికేయ ఓ మంచి కాన్సెప్టును కథగా రాసుకుని  ఒక మంచి ప్రయత్నం తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసును గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడనే  చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్‌కి చేరుకునే వరకు చూస్తున్న ప్రేక్షకులకు బోరింగ్‌గా లేకుండా  అనిపించేలా చక్కగా తీశాడు. కేవలం ముగ్గురు క్యారెక్టర్లతోనే సినిమా  తీసిన దర్శకుడిని కచ్చితంగా అభినందించాల్సిందే.యూత్ కు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. శాండీ అద్దంకి అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి .ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు .ప్రవిన్ పూడి ఎడిటింగ్  బాగుంది. నిర్మాత  స్నేహా రాకేశ్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. ఇందులో నటించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.లేడీ ఓరియంటెడ్ రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి “అష్మీ” సినిమా కచ్చితంగా నచ్చుతుంది. రేటింగ్ : 3/5

PostedOn: 04 Sep 2021 Total Views: 129
వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ‘ది ట్...

వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ‘ది ట్రిప్’ సిని...

ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో VDR ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న సినిమా ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ది ట్రిప్ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ చూస్తుంటే రొటీ...

26 Oct 2021

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మ...

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎట‌ర్న...

దీపావ‌ళీ కానుక‌గా న‌వంబ‌ర్ 4న‌ డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎటర్నెల్స్ విడుద‌ల కానుంది. ఎవెంజ‌ర్స్ సిరీస్ ఎండ్ అవ్వ‌డంతో హాలీవుడ్ మూవీ ల‌వ‌ర్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి మార్వెల్ వారు ఎట‌ర్నెల్స్ అనే కొత్త సూప‌ర్ హీరోల్ని సృష్టించారు, భార‌త‌దేశంలో ఉన్న అన్ని ముఖ్య‌మైన భాష‌ల్లో ఈ చిత్ర...

25 Oct 2021

చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పా...

చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పాట‌కు అనూహ్...

అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా రాబోతున్న మూవీ చిల్ బ్రో. మొద‌టి సినిమా అయినప్ప‌టికీ నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ సినిమాను ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన...

23 Oct 2021

లవ్ & ఎమోషన్స్ "మధుర వైన్స్" మూవీ రివ్యూ

లవ్ & ఎమోషన్స్ "మధుర వైన్స్" మూవీ రివ్యూ

ఆర్.కె.సినీ టాకీస్,ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు ,సృజన్ యారబోలు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం "మధుర వైన్స్". ఈ చిత్రం అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని...

22 Oct 2021

అల్ట్రా స్టైలిష్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న ...

అల్ట్రా స్టైలిష్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న ప్ర‌భాస్‌!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. డార్లింగ్ కామన్ డీపీతో నెట్టింట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల నుంచి వచ...

22 Oct 2021

'సర్కారు వారి పాట' ఫ‌స్ట్ సాంగ్ పై థ‌మ‌న...

'సర్కారు వారి పాట' ఫ‌స్ట్ సాంగ్ పై థ‌మ‌న్ అప్‌డేట్...

పరశురాం పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెకుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో మహేశ్ ఎంత స్టైలిష్‌గా ఉన్నాడో అందరూ చూశారు. ఇందులో ఆయనను ఎలివేట్ ...

22 Oct 2021

సీనియ‌ర్ న‌టుడిపై అన‌సూయ షాకింగ్ కామెంట్...

సీనియ‌ర్ న‌టుడిపై అన‌సూయ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయపై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే! ఆమె మంచి నటి అనీ, అందంగా ఉంటుందనీ, కానీ ఆమె వస్త్రధారణ తనకు నచ్చదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై పేరు చెప్పకుండా ఫైర్‌ అయ్యారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు ధరిస్తారు. అది వ్యక్తిగతమని అనసూయ ...

19 Oct 2021

"మధుర వైన్స్" ప్రి రిలీజ్ ఈవెంట్

"మధుర వైన్స్" ప్రి రిలీజ్ ఈవెంట్

ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు నిర్మిస్తున్న చిత్రం "మధుర వైన్స్". గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోల...

18 Oct 2021