మా ఎన్నికలు చాలా దౌర్జన్యంగా జరిగాయి: నటుడు చరణ్ తేజ ఎమోషనల్ లెటర్

మా ఎన్నికలు చాలా దౌర్జన్యంగా జరిగాయి: నట...
మా ఎన్నికలు జరిగిన తీరుపై మా అసోసియేషన్ సభ్యులు కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు తాజాగా ఇదే విషయంపై నటుడు చరణ్ తేజ తన ఆవేదన వ్యక్తం చేశారు అన్యాయంగా జరిగిన ఎన్నికలను రద్దు చేసి రీ ఎలక్షన్స్ పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఆయన ఏమన్నారో చరణ్ తేజ మాటల్లోనే.. " నా పేరు చరణ్ తేజ.. నేను మా మెంబర్.. ఆ రోజు మా ఎలక్షన్స్ జరిగిన తీరు చాలా అన్యాయంగా ఉంది.. దౌర్జన్యంగా ఉంది.. పోలింగ్ రోజు కుర్చీలు వేసుకుని దౌర్జన్యంగా మాకు ఓటేయండి అంటూ అన్ పార్లమెంటరీ భాష మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించారు. మోహన్ బాబు గారు అక్కడే ఉండి ఇవన్నీ చూశారు. ఈ విషయం ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ గారికి కూడా తెలుసు. ఎన్నికలు జరిగిన తీరు చాలా అసంతృప్తికరంగా ఉంది. మా ఎన్నికలు పూర్తయిన తర్వాత 11 మంది సభ్యులు రాజీనామా చేసిన తర్వాత కూడా.. విష్ణు గారు అవేవి పట్టించుకోకుండా.. వాళ్లని ఏమీ అడగకుండా.. సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా ప్రమాణస్వీకారం చేశారు. అది మా అసోసియేషన్.. అంటే మన అందరి అసోసియేషన్.. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను కృష్ణ మోహన్ గారికి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన కంప్లైంట్ తీసుకుంటానని చెప్పారు. కానీ ఆ తర్వాత రోజు ఫోన్ చేస్తే విష్ణు గారు చార్జ్ తీసుకున్నారు.. నేనేం చేయలేను అని అన్నారు. నేను ఫోన్ చేసిన రెండు గంటల తర్వాత విష్ణు గారు చార్జ్ తీసుకున్నారు. ఇది నిజం కాదా అని కృష్ణ మోహన్ గారిని నేను అడుగుతున్నాను. మీలాంటి పెద్ద వాళ్లే ఇలా చేస్తే.. మాలాంటి కొత్త నటులు, హీరోలు ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలి.. ఎవరికి చెప్పుకోవాలి.. ఒకసారి మీరే ఆలోచించుకోవాలి.. నేను ప్రకాష్ రాజ్ గారిని కూడా అడుగుతున్నాను.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు రాజీనామా చేసి బయటకు వెళ్లి.. అక్కడి నుంచి ప్రశ్నిస్తామని చెప్పారు. నేను మిమ్మల్ని కూడా డిమాండ్ చేస్తున్నాను.. మా సభ్యుడిగా నా తరఫున మీరు అసోసియేషన్ ప్రెసిడెంటును ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. జరిగిన అన్యాయంపై మీరు కూడా స్పందించాలి. ఈ విషయం తేలేవరకు నేను వదిలిపెట్టను. క్రమశిక్షణ అంటే ఏ గొడవ జరగకుండా చూసుకోవడం.. అందరినీ ఎదురు మాట్లాడనీయకుండా చేయడం కాదు. క్రమశిక్షణ అనే దానికి అసలు అర్థం కూడా తెలియదు మోహన్ బాబు గారికి. ప్రకాష్ రాజ్ గారు నా తరఫున ప్రశ్నించాలి అని కోరుకుంటున్నాను.. ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారిని అడుగుతున్నాను.. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న మీరు జరిగిన ఎన్నికలు పూర్తిగా అసంబద్ద పద్ధతిలో జరిగాయని తెలుసుకొని.. దాని మీద ఒక కమిటీ వేసి అక్కడ సి సి ఫుటేజ్ పరిశీలించి.. రీ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాను.. ఇది జరిగే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను" అని తెలిపారు చరణ్ తేజ.

PostedOn: 17 Oct 2021 Total Views: 190




సౌత్ స్టార్స్ పై కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ...

సౌత్ స్టార్స్ పై కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు కాంట్రవర్సరీలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సౌత్‌ స్టార్స్‌పై కంగనా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ కల్చర్‌, నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కంగనా తాజాగా మరోసారి తనదైన స...

25 Jan 2022

BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ : బైక్ ధ...

BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ : బైక్ ధ‌ర‌ ఎంతో త...

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో బోలెడంత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది. సోషల్‌ మీడియాలోనూ యాక్...

25 Jan 2022

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

సునీత భర్త రామ్ సొంత యూ ట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గౌడ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఆ ఛానల్ లో వీడియోలు పెట్టారని శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు ముట్టడించారు. గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఛానల్ అధినేత...

25 Jan 2022

ఓవర్సీస్‌లో భీమ్లానాయ‌క్‌ భారీ రిలీజ్‌కు...

ఓవర్సీస్‌లో భీమ్లానాయ‌క్‌ భారీ రిలీజ్‌కు సర్వం సిద...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని. ఫిబ్రవరి 25న విడుదల తేదీ లాక్ చేస...

25 Jan 2022

మెగాస్టార్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన త...

మెగాస్టార్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన త్రిష‌

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ‘ఆచార్య’ విడుదలకు సిద్ధం కాగా, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ ఏడాదే చిత్రం సెట్స్ పైకి వెళ్ళబో...

25 Jan 2022

సింపుల్‌గా దివంగత నిర్మాత బీఏ రాజు కుమార...

సింపుల్‌గా దివంగత నిర్మాత బీఏ రాజు కుమారుడి పెళ్లి

దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్‌ శివకుమార్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. క...

25 Jan 2022

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రే...

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్...

'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్​ స్టార్​ అల్లు అర్జున్​ స్టార్ మారిపోయింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అ‍ల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం...

25 Jan 2022

వాళ్ల వ‌ల్లే ఇంత బాధ ప‌డుతున్నా : సోష‌ల్...

వాళ్ల వ‌ల్లే ఇంత బాధ ప‌డుతున్నా : సోష‌ల్ మీడియాలో ...

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన వర్ష బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్‌ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తాజాగా భావోద్వేనికి ల...

24 Jan 2022