లవ్ & ఎమోషన్స్ "మధుర వైన్స్" మూవీ రివ్యూ

లవ్ & ఎమోషన్స్ "మధుర వైన్స్" మూవీ రివ్యూ
ఆర్.కె.సినీ టాకీస్,ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు ,సృజన్ యారబోలు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం "మధుర వైన్స్". ఈ చిత్రం అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా   ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి. కథ కాలేజీ డేస్ లో ఎంతో ఘాడంగా ప్రేమించిన మధుర తనకి దూరమవ్వడంతో తాగుడుకి బానిసగా మరతాడు అజయ్(సన్నీ నవీన్). ఈ క్రమంలో అజయ్ కిసీమా చౌదరి (అంజలి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అజయ్ గతం తెలుసుకునే క్రమంలో అతనితో ప్రేమలో పడుతుంది అంజలి. పరిచయమైన కొన్ని రోజులకే మధుర ని  మర్చిపోయి అంజలితో ప్రేమలో పడతాడు అజయ్. రియల్ ఇస్టేట్ వ్యాపారంలో నష్టపోయిన ఆనందరావు (సమ్మోహిత్ తూములూరి) ఫైనల్ గా మధుర వైన్స్ పెట్టి మధ్యం అమ్ముతుంటాడు. రోజు తన వైన్స్ లో మందు తాగుతూ కెరీర్ నాశనం చేసుకుంటున్న అజయ్ ని చూస్తూ తట్టుకోలేకపోతాడు ఆనంద రావు. ఇంతకీ అంజలి ఆనంద్ రావు కి ఏమైవుతుంది ?అజయ్ తాగుడుగు ఎందుకు బానిస అయ్యాడు? ఫైనల్ గా అజయ్ , అంజలి ల ప్రేమకు ఆనందరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ? లేదా అనేది మిగతా కథ. నటీనటుల పనితీరు షార్ట్ ఫిల్మ్ లో నటించిన సన్నీ నవీన్ హీరోగా వెండితెరపై మొదటి సారిగా నటించినా చాలా చలాకీగా కనిపించాడు. మంచి ఎనర్జీతో నటన,డాన్స్, యాక్షన్ అన్ని అంశాలు చక్కగా చేసాడు.ఇక హీరోయిన్ సీమా చౌదరి అంజలి గా  తను ఎంతో అందంగా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో తన నటనతో  ప్రేక్షకుల మనసు దోచుకుందనే చెప్పాలి.అలాగే హీరో , హీరోయిన్స్ ల రొమాన్స్ కిస్ సీన్స్ బాగా పండింది. మరియు ఆనందరావు మధుర వైన్స్ ను మెయింటైన్ చేస్తూ చెల్లెలను ప్రేమగా చూసుకుంటూ మధుర వైన్స్ లో ఏ కల్తీ లేకుండా నిజాయితీగా అమ్మే పాత్రలో నటించిన సమ్మోహిత్ తూములూరి తనకిచ్చిన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు.హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన లీల,  మిగతా నటీనటులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు దర్శకుడు జయకిషోర్.బి మధుర వైన్స్ చుట్టుపక్కల జరిగే  పాత్రలతో  ఓ సరికొత్త  ప్రేమ కథను ఎంపిక చేసుకుని తాను అనుకున్న కథ, కథనాలను చాలా చక్కగా తెరకెక్కించాడు.ఇలాంటి కథకు స్క్రిన్ ప్లే అండ్ కనెక్టెడ్ లాజిక్కులు చాలా అవసరం.వాటిని ఎక్కడా మిస్ అవ్వకుండా బాగా డైరెక్ట్ చేసి ముందు ముందు మంచి సినిమాలు ఇండస్ట్రీ కి అందించగల దర్శకుడిగా తన స్టామినా ఏంటో చూపించారు. అలాగే ఇందులో డైలాగ్స్ అక్కడక్కడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్న సినిమా అంటే వల్గర్ మాటలు, డబుల్ మీనింగ్ మాటలు ప్రస్తుతం వస్తున్న సినిమాలలో వుంటాయనే ముద్రపడ్డ ప్రస్తుత టైం లో అవేవి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "మధుర వైన్స్" సినిమా మాత్రం యూత్ కు  బాగా నచ్చేస్తుంది. తండ్రీ,కొడుకుల ఎమోషన్, అన్న, చెల్లెలు ఎమోషన్ ను దర్శకుడు బాగా క్యారీ చేశాడు. యూత్ కు, ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయి. దానితో పాటు హీరో తాగుడుకు బానిస అయినా.. నీ ప్రేమలో నిజాయతి ఉంటే మరొకరి ద్వారా నీకు కావలసిన ప్రేమను  దగ్గర చేస్తుందనే అంశాన్ని క్లుప్తంగా చెప్పారు. ఈ సినిమాకు కార్తిక్ rodriguez, జయ్ క్రిష్  అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి .ఇందులో వచ్చే రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ చాలా బాగుంది. ఈ సినిమాకు మోహన్ చారి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు.  వర ప్రసాద్. ఎడిటింగ్ పనితీరు అద్భుతంగా ఉంది. ఈ చిత్ర నిర్మాతలు రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు ఖర్చుకు వెనకాడకుండా తీసిన నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు బాగా నచ్చే ప్రేక్షకులు వెళ్లి హ్యాపీ గా సినిమా చూసి ఒక మంచి కంటెంట్ అండ్ హానెస్ట్ సినిమా చూసాము అన్న ఫీలింగ్ తో బయటకు వస్తారు. అలాగే  ఈ సినిమా చూసిన  ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది. మూవీ రేటింగ్ ..3/5

PostedOn: 22 Oct 2021 Total Views: 89
పుష్ప ట్రైల‌ర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

పుష్ప ట్రైల‌ర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప : ది రైజ్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ థ్రిల్లర్. రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోన్న ఈ సిని...

29 Nov 2021

RRRలో ఆలియాభ‌ట్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న...

RRRలో ఆలియాభ‌ట్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌!

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం.. రణం.. రుథిరం). యంగ్‌ టైగర​ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్‌ వరుస అప్‌డేట్స్‌ వద...

29 Nov 2021

బిగ్‌బాస్ హౌస్‌లోకి అల్లు అర్జున్‌!

బిగ్‌బాస్ హౌస్‌లోకి అల్లు అర్జున్‌!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్‌తో మరింత బిజీ అవనున్నాడు. పాన్‌ ఇండియా లెవల్లో సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఇక హిందీలో ఈ మూవీని ప్రమోట్‌ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి ...

29 Nov 2021

ప్ర‌భాస్ సినిమాలో న‌టించే గోల్డెన్ ఛాన్స...

ప్ర‌భాస్ సినిమాలో న‌టించే గోల్డెన్ ఛాన్స్!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రంలో నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ని సొంతం చేసుకోవచ్చంటూ కాస్టింగ్‌ కాల్‌ను అనౌన్స్‌ చేశారు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ తన నెక్స్ట్‌ ఫిల్మ్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేయనున్న సం...

27 Nov 2021

బిగ్‌బాస్ హోస్ట్‌గా ర‌మ్య‌కృష్ణ‌!

బిగ్‌బాస్ హోస్ట్‌గా ర‌మ్య‌కృష్ణ‌!

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌.. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో ప్రస్తుతం ఐదో సీజన్‌ నడుస్తోంది. తెలుగు షోకి కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా ఉన్నారు. అయితే ఇటీవల కరోనా బారిన ఆయన.. ప్రస్తుతం ఆస్పత్రిలో...

27 Nov 2021

బాల‌య్య సినిమా ప్రీ రిలీజ్‌కు బ‌న్నీ, రా...

బాల‌య్య సినిమా ప్రీ రిలీజ్‌కు బ‌న్నీ, రాజ‌మౌళి!

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా.. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్...

27 Nov 2021

శివశంకర్‌ మాస్టర్‌కు ధనుష్‌ సాయం..టాలీవు...

శివశంకర్‌ మాస్టర్‌కు ధనుష్‌ సాయం..టాలీవుడ్‌ స్టార్...

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఆయన పరిస్థితి తెలుసుకొని నటుడు సోనూసూద్‌ సాయం చేసేందకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్‌ ...

26 Nov 2021

బై-సెక్సువల్‌ గా వివాదాస్పద పాత్రలో సమంత...

బై-సెక్సువల్‌ గా వివాదాస్పద పాత్రలో సమంత!

విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా దూసుకుపోతోంది. వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకాలు చేస్తూ సరికొత్తగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లి తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యం...

26 Nov 2021