యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటున్న ‘నీతో’ టీజర్..

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటున్న ...
అభిరామ్ వర్మ, సాత్విక రాజ్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ నీతో. ఏవిఆర్ స్వామి, ఎమ్ఆర్ కీర్తన, స్నేహాల్ జంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలు శర్మ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. లవ్ లైఫ్ డ్రామాగా నీతో టీజర్ ఆకట్టుకుంటుంది. యూత్ ఫుల్ అంశాలతో ఈ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది. టీజర్‌లో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న నీతో సినిమాకు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సుందర్ రామ్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల అవుతుంది. నీతో మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్. -ప్రొడ్యూసర్ ఏ వి ఆర్ స్వామి గారు మాట్లాడుతూ ఇక్కడకి వచ్చిన పెద్దలు అందరికి, మీడియా మిత్రులకి నా నమస్కారములు, నేను రాహు అనే మూవీ తో నా ప్రయాణం స్టార్ట్ చేశాను, బాలు గారి తో ఒక సినిమా చేశాను, ఇప్పుడు నీతో చేస్తున్నాను, ఈ సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుంది అని మాట్లాడారు. -హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ కి రావటానికి కారణం టీజర్ నాకు చాలా చాలా నచ్చింది, సినిమా ఆటోగ్రాఫేర్ సుందర్ అమేజింగ్ వర్క్, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అమేజింగ్, బాలు ఈ నగరానికి ఏమైంది కి వర్క్ చేసాడు, పవిత్రలోకేష్ గారు దియా లో తన నటనకి నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి, రవివర్మ వెన్నల చూసినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను, డైరెక్టర్ చెపుతున్నాడు మాది చిన్న సినిమా అని అంటున్నాడు సినిమా రిలీజ్ అయ్యాక చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి, మొదట్లో అభిరామ్ నేను కలిసి అవకాశాలు కోసం ట్రావెల్ చేసాం, మా గ్రూప్ లోనే ఉంటేవాడు, అల్ ది బెస్ట్ అభిరామ్,ప్రొడ్యూసర్స్ థాంక్స్ యు సార్,నన్ను ఈ ఈవెంట్ కి పిలిచినందుకు అని చెప్పి ఈ సినిమా మంచి విజయం సాదించాలి అని కోరుకున్నాడు. -పవిత్ర లోకేష్ మాట్లాడుతూ అందరికి నమస్కారం, ఇక్కడ అందరు యంగ్ స్టార్స్ వున్నారు, వీళ్ళు అందరిని కలవటం చాలా ఆనందం గా వుంది, ప్రొడ్యూసర్స్ సినిమా తీయటం అనేది ఒక వ్యాపారం లాంటిది,చాలా సీరియస్ గా సినిమాలు నిర్మించాలి, బాలు శర్మ గురించి చెప్పాలి అంటె చాలా మంచివాడు, ఫస్ట్ డైరెక్టర్ అంటె ఏమో అనుకున్నాను కాని సెట్ లో తన వర్క్ చూసిన తరువాత అంత క్లియర్ అయ్యింది, విశ్వక్ ని కలవటం చాలా హ్యాపీ గా వుంది, అభిరామ్ చాలా పెద్ద హీరో అవుతాడు, ఇప్పుడు మంచి సినిమాలు చేసుకుంటూ పొతే స్మాల్ బడ్జెట్ అనేది నో మేటర్ మేటర్, థాంక్ యు పప్రొడ్యూసర్స్ అలాగే అల్ ది బెస్ట్ చెప్పారు. -స్నేహాల్ గారు మాట్లాడుతూ నీతో ఒక మెట్రో సెక్షన్ లవ్ స్టోరీ, మెట్యూర్డ్ లవ్ స్టోరీ, దీనిలో అన్ని ఎమోషషన్స్ ఉంటాయి, ఇది నాకు, మా వైఫ్ కీర్తన కి ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది రొటీన్ గా వుండే సినిమా కాదు మీ అందరికి సినిమా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. -సినిమాటోగ్రఫేర్ సుందర్ మాట్లాడుతూ ఇది నాకు మొదటి సినిమా, మాది ప్రొపెర్ అంత తమిళనాడు,నాకు ఈ సినిమా లో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. -డైరెక్టర్ బాలు గారు మాట్లాడుతూ అందరి కి నమస్కారం, విశ్వక్ సేన్ చాలా థాంక్స్ పిలవగానే వచ్చినందుకు, ఈ రోజుల్లో అవకాశాలు రావటం లేదు అనుకుంటాం కాని అవకాశాలు వెతుకుతూ ప్రయత్నం చేయాలి, అభిరామ్ గారు ద్వారా ఏవి ఏస్ స్వామి గారిని కలిఫించటం జరిగింది, మా ప్రొడ్యూసర్స్ కధ వినటం జరిగింది, అభిరామ్ గారు, సాత్విక్ గారికి నాకు థాంక్స్, వివేక్ సాగర్ సంగీతం, కాని, పవిత్ర లోకేష్ గారు కాని, TNR గారు ఆయన మన మధ్య లేరు ఆయనతో కలిసి గడిపిన టైం చాలా విలువైనది, మా సినిమా ఆటోగ్రాఫేర్ సుందర్ అందరికి థాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పారు. -అభివర్మ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్ గారు మూడు సినిమాలు తీశారు కోవిద్ టైం లో మీకు పెద్ద సక్సెస్ రావాలి, విశ్వక్ సేన్ ని ఫలక్ నామ దాస్ లో చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యాను, అభి నువ్వు కూడా విశ్వక్ లాగా ట్రాన్స్ఫార్మర్ అవుతుంది రావాలి, నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, సినిమా మంచి విజయం సాధిస్తుంది అని చెప్పారు. -సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ, టీజర్ వెరీ ఫ్రెష్ గా వుంది, నాలుగు సంవత్సరాలనుండి బాలు తెలుసు,ఈ స్టోరీ నేను చాలా బాగా నమ్ముతున్నాను అని చెప్పి, ఈ సినిమా టీమ్ అందరికి అల్ ది బెస్ట్ చెప్పింది. -సంజిత్ మాట్లాడుతూ, విశ్వక్ థాంక్స్ మమ్మల్ని విష్ చేయటానికి వచ్చినందుకు,బాలు,అభిరామ్, నాలుగు సంవత్సరాలు నుంచి ఫ్రెండ్స్, బాలు నీతో గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను, రియల్లీ ఫన్ వర్కింగ్ పర్సన్, స్నేహాల్ గారు ఒక్కరోజు కూడా సెట్ కి రాకుండా ఉండటం నేను చూడలేదు అంత హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్ అలాగే ఇక్కడకి వచ్చిన అందరకి థాంక్స్.

PostedOn: 26 Sep 2021 Total Views: 104




వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ‘ది ట్...

వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ‘ది ట్రిప్’ సిని...

ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో VDR ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న సినిమా ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ది ట్రిప్ పేరుతో వచ్చిన ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్ చూస్తుంటే రొటీ...

26 Oct 2021

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మ...

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎట‌ర్న...

దీపావ‌ళీ కానుక‌గా న‌వంబ‌ర్ 4న‌ డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎటర్నెల్స్ విడుద‌ల కానుంది. ఎవెంజ‌ర్స్ సిరీస్ ఎండ్ అవ్వ‌డంతో హాలీవుడ్ మూవీ ల‌వ‌ర్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి మార్వెల్ వారు ఎట‌ర్నెల్స్ అనే కొత్త సూప‌ర్ హీరోల్ని సృష్టించారు, భార‌త‌దేశంలో ఉన్న అన్ని ముఖ్య‌మైన భాష‌ల్లో ఈ చిత్ర...

25 Oct 2021

చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పా...

చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పాట‌కు అనూహ్...

అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా రాబోతున్న మూవీ చిల్ బ్రో. మొద‌టి సినిమా అయినప్ప‌టికీ నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ సినిమాను ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన...

23 Oct 2021

లవ్ & ఎమోషన్స్ "మధుర వైన్స్" మూవీ రివ్యూ

లవ్ & ఎమోషన్స్ "మధుర వైన్స్" మూవీ రివ్యూ

ఆర్.కె.సినీ టాకీస్,ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు ,సృజన్ యారబోలు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం "మధుర వైన్స్". ఈ చిత్రం అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని...

22 Oct 2021

అల్ట్రా స్టైలిష్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న ...

అల్ట్రా స్టైలిష్ లుక్‌తో అద‌ర‌గొడుతున్న ప్ర‌భాస్‌!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. డార్లింగ్ కామన్ డీపీతో నెట్టింట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల నుంచి వచ...

22 Oct 2021

'సర్కారు వారి పాట' ఫ‌స్ట్ సాంగ్ పై థ‌మ‌న...

'సర్కారు వారి పాట' ఫ‌స్ట్ సాంగ్ పై థ‌మ‌న్ అప్‌డేట్...

పరశురాం పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెకుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో మహేశ్ ఎంత స్టైలిష్‌గా ఉన్నాడో అందరూ చూశారు. ఇందులో ఆయనను ఎలివేట్ ...

22 Oct 2021

సీనియ‌ర్ న‌టుడిపై అన‌సూయ షాకింగ్ కామెంట్...

సీనియ‌ర్ న‌టుడిపై అన‌సూయ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయపై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే! ఆమె మంచి నటి అనీ, అందంగా ఉంటుందనీ, కానీ ఆమె వస్త్రధారణ తనకు నచ్చదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై పేరు చెప్పకుండా ఫైర్‌ అయ్యారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు ధరిస్తారు. అది వ్యక్తిగతమని అనసూయ ...

19 Oct 2021

"మధుర వైన్స్" ప్రి రిలీజ్ ఈవెంట్

"మధుర వైన్స్" ప్రి రిలీజ్ ఈవెంట్

ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు నిర్మిస్తున్న చిత్రం "మధుర వైన్స్". గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోల...

18 Oct 2021