‘గద్దలకొండ గణేష్’ ట్విట్టర్ రివ్యూ!

‘గద్దలకొండ గణేష్’ ట్విట్టర్ రివ్యూ!

 

‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా ఫస్ట్ టాక్ బయటికి వచ్చింది. యూస్‌లో ప్రీమియర్లు చూసిన చాలా మంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

అనేక వివాదాల నడుమ 'వాల్మీకి' టైటిల్‌ను ‘గడ్డలకొండ గణేష్‌’గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమాను చూసిన కొంత మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ నటన, అతడి మేనరిజమ్స్, డైలాగ్స్ చెప్పే తీరు విపరీతంగా ఆకట్టుకుందని చెబుతున్నారు.

తెలంగాణ యాసలో మాస్ డైలాగులను వరుణ్ అవలీలగా చెప్పేశాడని.. హరీష్ శంకర్ రాసిన డైలాగులు థియేటర్‌లో బాగా పేలాయని చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్, క్లైమాక్స్ ఇలా సినిమాలో ప్రతీ అంశం ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.

మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో బలమని చెబుతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళ నటుడు అధర్వా మురళి కీలక పాత్ర పోషించారు.

 


PostedOn: 20 Sep 2019 Total Views: 123
కరోనా బారిన టీవీ నటి

కరోనా బారిన టీవీ నటి

హైదరాబాద్ : లాక్ డౌన్ అనంతరం వెండితెర, బుల్లితెర నటులు ఉత్సాహంగా షూటింగ్ లను ప్రారంభించారు. అయితే, కరోనా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో షూటింగ్స్ లో పాల్గొంటున్నవారు కరోనబారిన పడుతున్నారు. ఇటీవల ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో బుల్లి తెర స్టార్ కు క...

01 Jul 2020

ధనుష్‌ పుట్టిన రోజున అభిమానులకు సర్‌ప్రై...

ధనుష్‌ పుట్టిన రోజున అభిమానులకు సర్‌ప్రైజ్‌..

హీరో ధనుష్‌కు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. మాస్‌ హీరోగా తెలుగు అభిమానుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. అయితే ధనుష్‌ తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడు. కరోనా విజృంభిస్తున్న వేళ అన్ని సినిమాలు రిలీజ్‌ కాకుండా వాయిదా పడిన విషయం తెలిసిందే.. అయితే తమ అభిమానులన...

01 Jul 2020

ఓటిటి వైపు తెలుగు నిర్మాతల మొగ్గు...

ఓటిటి వైపు తెలుగు నిర్మాతల మొగ్గు...

కరోనా వైరస్‌ కారణంగా భవిష్యత్తు ఓటీటీలదే అని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులకు ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే వెబ్‌ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత అల్లు అరవింద్‌ ఆహా యాప్‌ బాధ్యతలు తీసుకొని సబ్‌స్క్రైబర్లు పెరిగే విధంగా అడుగులు వేస్తున్నారు. కేవలం వెబ్‌ సిరీస్‌ అనే కాకుండ...

01 Jul 2020

మాకు కరోనా సోకలేదు: నయన్‌, విఘ్నేష్‌

మాకు కరోనా సోకలేదు: నయన్‌, విఘ్నేష్‌

చెన్నై: కరోనా కాలంలో వైరస్‌ వ్యాప్తితోపాటు వదంతులు కూడా చాలా స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్నాయి. ఫలనా ప్రముఖులకు కరోనా వైరస్‌ సోకిందంటూ ఫేక్‌ వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటిదే నయనతార, ఆమె ప్రేమికుడు విఘ్నేష్‌ శివన్‌ పైన కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. నయన్‌, విఘ్నేష్‌ల...

23 Jun 2020

వర్మ...నిన్ను చూస్తే జాలేస్తోంది: అమృత

వర్మ...నిన్ను చూస్తే జాలేస్తోంది: అమృత

మిర్యాలగూడ: నిజమైన కథ పేరుతో మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణరు కథను సినిమాగా తీయబోతున్నట్లు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించడంపై ప్రణరు భార్య అమృత భగ్గుమన్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌ కింద విడుదల చేసిన పోస్టర్‌పై స్పందించారు. వర్మ విడుదల చేసిన పోస్టర్‌ చూశానని, దానికి తన జీవితానికి ఎటువంటి పోలికలు లేవని, ఇదంతా ...

22 Jun 2020

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రానా పెళ్లి

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రానా పెళ్లి

రానా దగ్గుబాటి, మహీకా బజాజ్‌ల వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు కుటుంబాల నుంచి పెళ్లి పనులు మొదలైపోయాయి. తాజాగా వివాహ వేదిక కూడా నిర్ణయించేశారు. అదే హోటల్‌ తాజ్‌ ఫలక్‌నుమా. ఇది హైదరాబాద్‌లోనే అత్యంత విలాసవంతమైన హోటల్‌. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చ...

22 Jun 2020

వచ్చే నెలలో నితిన్‌ పెళ్లి

వచ్చే నెలలో నితిన్‌ పెళ్లి

నితిన్‌, తన ప్రియురాలు శాలినీల వివాహం వచ్చే నెలలోనే ఉండనుంది. దుబాయిలో ఏప్రిల్‌లోనే వీరి విహానికి ముహూర్తం ఖరారు చేశారు. కానీ పరిస్థితులు అనుకూలించక వాయిదా వేసుకున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక మరో ముహూర్తంలో వివాహా వేడుకను నిర్వహించుకోవాలని భావించారు. కానీ లాక్‌డౌన్‌ ఎత్తేశాక కరోనా కేసుల సంఖ్య విపరీతంగ...

22 Jun 2020

Actor-producer Niharika Konidela reveals...

Actor-producer Niharika Konidela reveals fiance’s ...

Tollywood actors Anushka Shetty, Lavanya Tripathi and others congratulated the couple on social media. []=Actor-producer Niharika Konidela reveals fiance’s identity after days of teasing news Tollywood actors Anushka Shetty, Lavanya Tripathi and others congratulated the couple on social media. Actor...

19 Jun 2020