చిరుని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నాగ్!

చిరుని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నాగ...

 

ఇప్పటికే నాని, రమ్యకృష్ణ ఈ షోలో సెపరేట్ గా కనపడి ఫెరఫార్మ్ చేసారు. నాగ్ బదులుగా రమ్యకృష్ణ ఈ షోని నడిపించారు కూడా. చాలా స్పెషల్ గా ఉందీ ఎపిసోడ్. అలాగే నాని తన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ కోసం ఈ షో కు వచ్చారు.

అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేస్తోన్న 'బిగ్ బాస్' జనరంజకంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే స్మాల్ స్క్రీన్ పై అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేకపోతోందంటూ విమర్శలు వస్తున్నాయి. అందుకు కారణం డల్ కంటెంటే అనేది తెలిసిన విషయమే. వివాదాలు కన్నా గోల ఎక్కువగా ఉంటోంది. టీవి సీరియల్ లా సాగుతోందని కొందరంటున్నారు. ఈ నేపధ్యంలో షోకు బూస్ట్ ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. అందుకోసం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే నాని, రమ్యకృష్ణ ఈ షోలో సెపరేట్ గా కనపడి ఫెరఫార్మ్ చేసారు. నాగ్ బదులుగా రమ్యకృష్ణ ఈ షోని నడిపించారు కూడా. చాలా స్పెషల్ గా ఉందీ ఎపిసోడ్. అలాగే నాని తన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ కోసం ఈ షో కు వచ్చారు. ఈ రెండు సందర్బాల్లో టీఆర్పీలు బాగున్నాయి. ఈ విషయం గమనించిన షో డిజైనర్స్..మరో పెద్ద స్టార్ ని తీసుకువచ్చి ఒక్కసారిగా షోకు క్రేజ్ ని రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వారు రకరకల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

టీమ్ ప్లాన్ చేస్తున్న వారిలో ఒకరు చిరంజీవి అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కనుక బిగ్ బాస్ స్టేజీపై కనపడితే ఆ కిక్కే వేరు. ఆ రోజు టీఆర్పీలు మామూలుగా ఉండని అంటున్నారు. ఈ విషయంలో నాగార్జున ప్రయత్నాలు మొదలెట్టారట. సైరా ప్రమోషన్ కోసం చిరుని ఈ షో కు నాగ్ ఆహ్వానిస్తున్నారట. ఇక నాగ్ కు చిరంజీవికి మధ్య మంచి రిలేషన్ ఉంది. అంతేకాదు మాటీవిలో గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ని చిరంజీవి హోస్ట్ చేసారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవిని ఎలాగైనా ఈ షోకు రప్పించాలనే ప్లానింగ్ లో ఉన్నారట. మరి చిరంజీవి ఒప్పుకుంటారో లేదో చూడాలి.


PostedOn: 21 Sep 2019 Total Views: 89




ఇక అధికారికమే :

ఇక అధికారికమే :

హైదరాబాద్‌ : మిహికాతో కలిసి దిగిన మరో ఫొటోను రానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దగ్గుబాటి సురేష్‌ , బజాజ్‌ కుటుంబాల మధ్య బుధవారం గెట్‌ టుగెదర్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీలో రానా, మిహికాలు సాంప్రదాయ దుస్తులు ధరించి నవ్వుతూ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. వాటికి సంబంధించిన ఫొటోను షేర్‌చేస్తూ.. ' ఇక అఫ...

21 May 2020

ఎనిమిదేళ్ల తర్వాత..

ఎనిమిదేళ్ల తర్వాత..

బొమ్మరిల్లు సినిమాలోని హాసిని పాత్ర అందరికీ గుర్తుంటుంది కదా! అందులో జెనిలియా నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దాని తర్వాత ఆమె టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో వివాహం అయిన తర్వాత... జెనిలీయా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో రీ ...

21 May 2020

బయోపిక్‌లో నటిస్తా..కానీ...: విరాట్‌ కోహ...

బయోపిక్‌లో నటిస్తా..కానీ...: విరాట్‌ కోహ్లీ

తన జీవిత చరిత్ర ఆధారంగా ఎవరైనా బయోపిక్‌ తీస్తానంటే నటించేందుకు తాను సిద్దమని భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నారు. అయితే ఆ సినిమాలో తన భార్య అనుష్కశర్మ కూడా తప్పనిసరిగా నటించాలని షరతు పెట్టాడు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో తన భార్య అనుష్కతో కలిసి ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయ...

19 May 2020

త‌న‌యుడితో మ‌హేష్ ఫ‌న్నీ గేమ్.. వైర‌ల్ వ...

త‌న‌యుడితో మ‌హేష్ ఫ‌న్నీ గేమ్.. వైర‌ల్ వీడియో

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన మ‌హేష్ బాబు ఎక్కువ స‌మయాన్ని త‌న పిల్ల‌ల‌కే కేటాయిస్తున్నాడు. తాను చిన్న పిల్లాడిగా మారి వారితో స‌ర‌దా గేమ్స్ ఆడుతున్నాడు. రీసెంట్‌గా త‌న కూతురు సితార‌తో పాట పాడుకుంటూ సంద‌డి చేసిన మ‌హేష్ తాజాగా త‌న‌యుడు గౌత‌మ్‌తో స‌రదాగా ఫ‌న్నీ గేమ్ ఆడారు. మ‌హేష్‌, గౌత‌మ్‌ల‌కి ...

18 May 2020

సెలబ్రిటీ పెళ్ళిళ్ళు - ప్లస్సులు మైనస్సు...

సెలబ్రిటీ పెళ్ళిళ్ళు - ప్లస్సులు మైనస్సులు

లాక్ డౌన్ వల్ల షూటింగులు, ధియేటర్లే కాదు తారల వ్యక్తిగత జీవితాలు కూడా ప్రభావం చెందుతున్నాయి. ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో మంచి ముహూర్తాలు వదులుకోవడం ఇష్టం లేని యాక్టర్లు సైలెంట్ గా నిబంధనలకు లోబడి సిటీ ఔర్ స్కర్ట్స్ లోని ఫాం హౌస్ లలో చేసేసుకుంటున్నారు. నిన్న నిఖిల్ పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగిపోయింది...

15 May 2020

మూవీ లవర్స్ కు RRR షాక్ ?

మూవీ లవర్స్ కు RRR షాక్ ?

ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ ఆర్ఆర్ఆర్ కు అడ్డంకుల సుడిగుండాలు ఆగేలా కనిపించడం లేదు. షూటింగ్ ముందు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ సాధ్యపడలేదు. దాన్ని మార్చాక చెప్పిన కొత్త తేదీకి కూడా కట్టుబడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. బాలన్స్ పార్ట్ పూర్తి చేయాలంటే విదేశ...

15 May 2020

నిరాడంబరంగా జరిగిన నిఖిల్ వివాహం

నిరాడంబరంగా జరిగిన నిఖిల్ వివాహం

యువ కథానాయకుడు నిఖిల్ వివాహం డాక్టర్ పల్లవి వర్మతో కొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈరోజు ఉదయం శామీర్‌పేటలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో నిఖిల్ వివాహ వేడుక జరిగింది. గతంలో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మను ప్రేమిస్తున్నానని త్వరలో ఇరుకుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకుంటామని వెల్లడించారు. నిశ్...

14 May 2020

మా కుటుంబంలోకి మీకు స్వాగతం రానా: సోన‌మ్...

మా కుటుంబంలోకి మీకు స్వాగతం రానా: సోన‌మ్ క‌పూర్

ద‌గ్గుబాటి రానా త‌న పెళ్ళికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసాడో లేదో ఇటు అభిమానులు అటు సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిసింది. మెగాస్టార్ చిరంజీవి.. చివరికి భళ్లాల దేవుడు అంతటి ధీశాలి కూడా ప్రేయసి వలలో చిక్కుకున్నాడు అంటూ ఫన్నీ ట్వీట్ చేసి ఇద్ద‌రికి ఆశీర్వాదాలు అందించారు. ఇక ప్ర‌ముఖ బాలీ...

13 May 2020