తెలంగాణ సాగునీటి కలను సాకారంచేసిన ‘మేఘా’

తెలంగాణ సాగునీటి కలను సాకారంచేసిన ‘మేఘా’
తెలంగాణ సాగునీటి కలను సాకారంచేసిన ‘మేఘా’ ఒకప్పుడు రైల్ బౌల్ ఆఫ్ ఇండియా, ధాన్యాగారంగా ‘ఆంధప్రదేశ్’ను పిలిచేవారు. ప్రస్తుతం ఆ క్రెడిట్ తెలంగాణ రాష్ట్రానికి దక్కిందంటే అందులో మేఘా పాత్ర ఎంతో ఉంది. భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ నేడు రికార్డులకు కెక్కించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి కోసం కొట్లాడిన ప్రాంతం నేడు జలకళతో సస్యశ్యామలమైంది. నిధులు.. నీళ్లు.. ఉద్యోగాలే ఏజెండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ నీటికోసం భగీరథ ప్రయత్నం చేశారు. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నో ఇంజనీరింగ్ కంపెనీలు ముందుకొచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఆకర్షించింది మాత్రం మేఘా(MEIL). ఈ కంపెనీ గత రికార్డులను చూసిన ముగ్ధుడైన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతను మేఘాకు అప్పగించారు. ఈ కంపెనీ రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి ఔరా అనిపించింది. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘ ఇంజనీరింగ్ ఇంఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. నేడు పుష్కలంగా గోదావరి జలాలు.. ఒకప్పుడు నీటిగోసను అనుభవించిన తెలంగాణ ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు తోడు మేఘా కంపెనీ అహోరాత్రుల కృషి ఫలితంగానే నేడు ఇది సాధ్యపడింది. నీటి ప్రాజెక్టులు కట్టాలంటే దశబ్దాలు పడుతాయన్న అపఖ్యాతిని దూరంచేసేలా మేఘా కంపెనీ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం గొప్ప విషయం. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధిక పంపింగ్‌ కేంద్రాలను ఎంఈఐఎల్‌ పూర్తిచేసి తన ఇంజనీరింగ్‌ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది. మొత్తం 22పంపింగ్ కేంద్రాల్లో 96మెషిన్లు(ఒక పంపు, ఒక మోటారును కలిపితే మిషన్ అవుతుంది) 4680 సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో 15కేంద్రాల్లో 89మెషిన్లను 3840సామర్థ్యంతో నిర్మిస్తోంది. కేవలం నాలుగేళ్ళ సమయంలో దాదాపు నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్‌హౌస్‌లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్‌ ద్వారా వినియోగంలోకి(ఆపరేషన్‌, మెయిన్‌టెనెన్స్‌) తీసుకొచ్చి మేఘా మరో ఘనతను సాధించింది. రికార్డు స్థాయిలో పూర్తి.. మేఘా సంస్థ దీనిని ఓ నీటి ప్రాజెక్టుగా కాకుండా తమకు దక్కిన గౌరవంగా భావించి ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేసింది. కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోని అతి భారీనీటి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలకుతోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలం, ఏబిబి, క్రాంప్టన్‌ గ్రేవ్స్‌, వెగ్‌ లాంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా ఇక్కడ భారీస్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్‌-1, లింక్‌-2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. ఇంజనీరింగ్ చరిత్రలో అద్భుతం కాళేశ్వరం.. ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే మేఘా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా నిలిచింది. తాజాగా ప్యాకేజ్‌-14లోని పంప్‌హౌస్‌ను వినియోగంలోకి తేవడం ద్వారా 3,763మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం వినియోగంలోకి రానుంది. నీటి పారుదల రంగంలో దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌ చేసేలా భారీ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంది. సాగునీటి అవసరాల కోసం ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని గ్రేట్‌ మ్యాన్‌మేడ్‌ రివర్‌ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం పెదద్దికాగా ఆ పథకంతో పోలికలేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా కాళేశ్వరం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇంజనీరింగ్‌ నిపుణులు సైతం నివ్వేరపోయేలా రికార్డు సమయంలో పనులు పూర్తయ్యాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడా ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది లేదు. భూగర్భంలో కొత్తలోకం సృష్టించిన మేఘా.. మొత్తం పంపింగ్‌ కేంద్రాల్లో అత్యధిక భాగం భూగర్భంలో నిర్మించినవే. అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్‌ కేంద్రాలు భూగర్భంలోనివే. ఇందులో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్‌-8), అన్నపూర్ణ (ప్యాకేజ్‌-10), రంగనాయక సాగర్‌ (ప్యాకేజ్‌-11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్‌-12) భూగర్భంలో నిర్మించినవే. ప్రధానంగా గాయత్రి పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3ఘనపు మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్‌ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్‌పూల్‌, అదనపు సర్జ్‌పూల్స్‌ కూడా ప్రపంచంలోనే పెద్దవి. ఇందులో లింక్‌-1, లింక్‌-2 పంప్‌హౌస్‌లు చాలా కీలకమైనవి. లింక్‌-1లో ప్రాణహిత జలాలను గోదావరిలోకి అంటే శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి జలాశయంలోకి తీసుకురావడం. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్‌ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్‌హౌస్‌లను 28మిషన్‌లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్‌ కేంద్రాలు. వీటిన్నింటిని భూగర్భంలో నిర్మించి సరికొత్త ఆ ప్రాంతంలో సరికొత్త లోకాన్ని సృష్టించింది. భూగర్భంలో గాయత్రి నిర్మాణం.. భారీ విద్యుత్ సంస్థ ఏర్పాటు ఆ తర్వాత ప్యాకేజ్‌-8 పంపింగ్‌ కేంద్రం గాయత్రి. భూగర్భంలో మేఘా నిర్మించిన ఒక్కో పంపింగ్ కేంద్రం ఒక్కో అద్భుతాన్ని సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2టిఎంసీల నీటి పంపింగ్‌కుగాను మొత్తం 4680 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేస్తున్న 89మిషన్లు 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మేఘానే ఏర్పాటు చేస్తోంది. దీనినిబట్టి కాళేశ్వరంలో మేఘా పాత్ర ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అతిపెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. ఎంత పెద్దదంటే 33జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 15,087 మెగావాట్లు. దీనితో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మేఘా ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా తెలంగాణ విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో 25శాతం ఉంటుంది. అంతే ఇది ఎంత భారీ వ్యవస్థనో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. మేఘాకు దక్కిన గౌరవం.. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్‌ అదృష్టమని మేఘా సంస్థ ప్రతినిధి బీ.శ్రీనివారెడ్డి అంటున్నారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ సంస్థతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం తమకు దక్కిన జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో చర్చించి ప్రోత్సహించడం వల్లనే త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని బీ.శీనివాస్‌ రెడ్డి వినయంగా తెలిపారు. రైతన్నల సాగునీటి కలను నిజంచేసిన మేఘా చేసి కృషి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం.

PostedOn: 29 May 2020 Total Views: 121
పోలవరంలో మరో ముందడుగు - స్పిల్ వే గడ్డర్...

పోలవరంలో మరో ముందడుగు - స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు

పోలవరంలో మరో ముందడుగు - స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ కు సీఎంలు మారారు.. ప్రాంతాలు విడిపోయాయి. కానీ ఏపీ తలరాత మాత్రం మారలేదు. కొన్ని ఏళ్లుగా పోలవరం మొండి గోడలకే పరిమితమైంది. పోయిన చంద్రబాబు పాలనలో ఆర్భాటం, గ్రాఫిక్స్ లోకే పరిమితమైంది. కానీ సీఎం జగన్ సంకల్పించారు. ఆ కలను ఇప్పుడు పట్టుదలతో నే...

07 Jul 2020

ఒక్క నెలలోనే నాలుగు లక్షల పాజిటివ్‌ కేసు...

ఒక్క నెలలోనే నాలుగు లక్షల పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేసిన తర్వాతే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగింది. ఒక్క జూన్‌ నెలలోనే నాలుగు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీన్నిబట్టి వైరస్‌ విజృంభణ ఏ స్థాయిలో ఉందో తాజా గణాంకాలు చూస్తే అర్థమౌతుంది. కేంద్ర గణాంకాల ప్రకారం... ఏప్రిల్‌ నెలలో మొత్తం 33,248 కరోనా...

01 Jul 2020

ఏపీలో కొత్తగా 657 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 657 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తూనే వుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 657 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 7, పొరుగు రాష్ట్రాలకు సం...

01 Jul 2020

108 సిబ్బందికి జీతాలు పెంపు

108 సిబ్బందికి జీతాలు పెంపు

అమరావతి : అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్‌ సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. డ్రైవర్లకు, మెడికిల్ టెక్నీషియన్లకు భారీగా జీతాలు పెంచారు. వారి వారిసర్వీసుకు పరిగణనలోకి తీసుకొని... డ్రైవర్లకు రూ.18 నుంచి 20 వేల వరకు, మెడికల్‌ టెక్నీయన్‌లకు రూ.20 వేల నుంచి 30 వేల వరకు ...

01 Jul 2020

ఆరోగ్యశ్రీ అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రా...

ఆరోగ్యశ్రీ అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన స...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అనేకమార్పులు తీసుకొచ్చింది. రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించేందుకు ఒకేసారి 1088 వాహనాలను (108–104 కలిపి)ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సెంటర్ లో జెండా ఊపి ముఖ్యమంత...

01 Jul 2020

బొట్టు, గాజులు పెట్టుకోనందుకు విడాకులు మ...

బొట్టు, గాజులు పెట్టుకోనందుకు విడాకులు మంజూరు

గౌహతి: బట్టు, గాజులు పెట్టుకునేందుకు నిరాకరించిన ఓ వివాహిత మహిళకు గౌహతి హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. హిందూ సంప్రదాయంలో పెళ్లికి గుర్తుగా పరిగణించే బట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం నిరాకరించడమంటే పెళ్లి కాలేదని ప్రజలకు చెప్పుకునే ఉద్దేశ్యం ఉండటమేనని, భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని అర్ధమని చీ...

01 Jul 2020

పెళ్లికొడుకు మృతి, 101 మందికి కరోనా పాజి...

పెళ్లికొడుకు మృతి, 101 మందికి కరోనా పాజిటివ్‌

పాట్నా: ఒక పెళ్లికి హాజరైన వారిలో వందమందికి పైగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇది ప్రస్తుతం బీహార్‌లో కలకలం సృష్టిస్తోంది. పెళ్లికొడుక్కు కూడా కరోనా సోకగా పెళైన మరుసటిరోజు అతను చనిపోయాడు. పాట్నా జిల్లాలోని పాలిగంజి బ్లాక్‌కు చెందిన ఒక వ్యక్తి పెళ్లికి 111 మంది హాజరయ్యారు. పెళ్లి సమయంలోనే పెళ్లికొడుకు ...

01 Jul 2020

వ్యాక్సిన్‌ వస్తే మొదట వేసేది కరోనా యోధు...

వ్యాక్సిన్‌ వస్తే మొదట వేసేది కరోనా యోధులకే

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే మొదట కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న యోధులు వైద్య సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికే వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ నాలుగు సూత్ర...

01 Jul 2020