ఆపిల్ తుడిచే గుడ్డ కేవ‌లం రూ.1900 !

ఆపిల్ తుడిచే గుడ్డ కేవ‌లం రూ.1900 !
బ్రాండ్‌కి పెట్టింది పేరైన యాపిల్ కంపెనీ... ధరలు దారుణంగా పెంచుతోందా? ఆకాశాన్ని తాకుతున్నాయా... నెటిజన్ల తాజా రియాక్షన్ చూసి తీరాల్సిందే! ఇండియన్ మార్కెట్‌లో లభించే వస్తువులతో పోల్చితే... అమెరికాకి చెందిన యాపిల్ కంపెనీ అమ్మే వస్తువుల ధరలన్నీ భారీగానే ఉంటాయి. కంప్యూటర్లు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ప్రతీదీ చాలా మంది భారతీయులు కొనలేని రేంజ్‌లో ఉంటాయి. బ్రాండ్ పేరుతో ఈ కంపెనీ మరీ అతిగా ధరలు వేస్తోందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ కంపెనీ అమ్ముతున్న తుడిచే గుడ్డ (Polishing Cloth) ధర రూ.1900 పెట్టడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతూ సెటైర్లు వేస్తున్నారు. ఈ గుడ్డను మెత్తటి, గీతలు పడని పదార్థంతో తయారుచేసినట్లు యాపిల్ తెలిపింది. యాపిల్ స్టోర్‌లో దీన్ని అమ్ముతోంది. ఈ క్లాత్‌కి ఓ మూల యాపిల్ సిగ్నేచర్ ఉంటుంది. మన మార్కెట్‌లో తుడుచుకునే గుడ్డలు చాలా అమ్ముతారు. మన ఇంట్లోనే పాతవైన గుడ్డలతో కూడా తుడుచుకోవచ్చు. కానీ యాపిల్ మాత్రం దానికి ప్రత్యేక క్లాత్ అంటూ... అదిరిపోయే ధర ఫిక్స్ చేయడం నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

PostedOn: 22 Oct 2021 Total Views: 132
ఉస్మానియా యూనివ‌ర్సిటీలో స‌మాధి!

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో స‌మాధి!

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ కళాశాల వసతి గృహం వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. వారు తిరిగి వసతి గృహాలకు పరుగెత్తారు. ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఈసీహెచ్‌-1 వసతిగృహానికి దగ్గరగా చెట్ల మధ్య...

29 Nov 2021

ఓమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

ఓమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని...

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న కొత్త కరోనావైరస్ వేరియంట్ ఓమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రజలను కోరారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులను ఉద్ధేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలో ...

29 Nov 2021

హైద‌రాబాద్‌లో ఒమిక్రాన్ క‌ల‌వ‌రం!:దక్షిణ...

హైద‌రాబాద్‌లో ఒమిక్రాన్ క‌ల‌వ‌రం!:దక్షిణాఫ్రికా ను...

హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ పుట్టిన దేశం దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు రావడం మారింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వారంతా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అలాగే అదే వేరియంట్‌తో గజగజ వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. వీరితోపాటు కరోనా కొత్త వేర...

29 Nov 2021

మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్‌పై హైకోర్టు తీర్పు...

మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్‌పై హైకోర్టు తీర్పు!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇప్పటికే...

29 Nov 2021

హోట‌ల్ ఇడ్లీలో క‌ప్ప క‌లేబ‌రం!

హోట‌ల్ ఇడ్లీలో క‌ప్ప క‌లేబ‌రం!

చెన్నై/ఐసిఎఫ్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బంధు వులు తీసుకెళ్లిన ఇడ్లీలో కప్ప కళేబరం ఉండడాన్ని గుర్తించి దిగ్ర్భాంతి చెందారు. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో క్యాంటీన్‌ ఉంది. ఈ ఆస్పత్రి హృద్రోగ విభాగంలో మురుగేశన్‌ చికిత్స పొందు తున్నాడు. శనివారం క్యాంటీన్‌లో మురుగేశన్‌ బ...

29 Nov 2021

అశ్లీల ఫోటోతో విద్యార్థినిని బ్లాక్‌మెయి...

అశ్లీల ఫోటోతో విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేసిన వ...

చెన్నై: అమెరికాలో చదువుతున్న ఓ విద్యార్థినికి అశ్లీల ఫొటో పంపించి, రూ.1.8 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేసిన చెన్నై పోరూర్‌ వాసిని నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ అంశానికి సంబంధించి వివరాలిలా... స్థానిక కీల్పాక్కం ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని కుమార...

29 Nov 2021

విద్యార్థినిపై లైంగిక వేధింపులు..కరాటే మ...

విద్యార్థినిపై లైంగిక వేధింపులు..కరాటే మాస్ట‌ర్ అర...

చెన్నై: విద్యార్థినిపై నాలుగేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రైవేట్‌ స్కూలు కరాటే మాస్టర్‌ను, ఫిర్యాదు చేసినా పట్టించుకోని స్కూలు కరస్పాండెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌-2 చదువుతున్న విద్యార్థిని ఈ నెల 22న ఇంటిలో తన చేతిని బ్లేడుతో కోసుకుని, ఉరిపోసుకున...

29 Nov 2021

December 15న హైదరాబాద్‌లో ఆటోల బంద్‌!

December 15న హైదరాబాద్‌లో ఆటోల బంద్‌!

హైదరాబాద్ సిటీ/నల్లకుంట : సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 15న ఆటోల బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ హెచ్చరించారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొరుగు జిల్లాల ఆటోలు గ్రేటర్‌ హైదరాబాద్...

29 Nov 2021