ఎంజీఆర్ కు ఇస్తారు కానీ, ఎన్టీఆర్ కు ఎందుకివ్వరు?: 'భారతరత్న'పై ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు

ఎంజీఆర్ కు ఇస్తారు కానీ, ఎన్టీఆర్ కు ఎంద...
ఓ మీడియా చానల్ కు నారాయణమూర్తి ఇంటర్వ్యూ దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తారని వెల్లడి మొదటి నుంచి వివక్ష ఉందని వ్యాఖ్యలు వివక్ష పోవాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాలని స్పష్టీకరణ కేసీఆర్ నాయకత్వంలో పార్టీలు ఏకం కావాలని పిలుపు సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు తీసే అభ్యుదయవాది, నటుడు ఆర్.నారాయణమూర్తి ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. దక్షిణాది వాళ్లంటే మొదటి నుంచి వివక్ష ఉందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడడం ఇప్పటిది కాదని అన్నారు. అయితే ఎంజీఆర్ కు భారతరత్న ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ కు ఎందుకివ్వరని నారాయణమూర్తి ప్రశ్నించారు. పండిట్ భీమ్ సేన్ కు అవార్డు ఇస్తారు కానీ, మన మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఎందుకివ్వరని నిలదీశారు. ఇలాంటి వివక్ష పూరిత వైఖరి పోవాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇక, తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడుతుండడంపై స్పందిస్తూ, ఆయన రాజకీయాల్లోకి రావడం మంచిదేనని అన్నారు. ఈసారి మాత్రం రజనీ వెనుకంజ వేయకూడదని పేర్కొన్నారు. ఏపీలో జగన్ పాలన బాగుందన్న నారాయణమూర్తి, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని వెల్లడించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో నిరసనలు జరుగుతుండడం పట్ల వ్యాఖ్యానిస్తూ, కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించి వ్యవసాయ చట్టాల అమలుపై నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని హితవు పలికారు.

PostedOn: 20 Dec 2020 Total Views: 304
కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల ...

కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల నిఘా

చెన్నై: కేరళలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చటంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు జరుపుతున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవ...

04 Sep 2021

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పంద...

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పందం

న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత...

28 Aug 2021

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధ...

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధానం

న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బ...

28 Aug 2021

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక 'సిటాడెల్' సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్‌స్టాగ్...

28 Aug 2021

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అసోం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.భారీవర్షాల వల్ల బిస్వానాథ్, బోనగైగామ్ చిరాంగ్, థీమాజీ, దిబ్రూఘడ్, జోర్హత్, లఖి...

28 Aug 2021

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశ...

28 Aug 2021

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు...

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే 31,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే అందులో ఒక్క కేరళ రాష్టంలో 32,801 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు...

28 Aug 2021

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

న్యూఢిల్లీ: భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ఇంతకీ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..? సీసీ కెమెరాల ఏర్పాటులో. అవును మీరు వింటున్నది నిజమే...

28 Aug 2021