December 15న హైదరాబాద్‌లో ఆటోల బంద్‌!

December 15న హైదరాబాద్‌లో ఆటోల బంద్‌!
హైదరాబాద్ సిటీ/నల్లకుంట : సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 15న ఆటోల బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ హెచ్చరించారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొరుగు జిల్లాల ఆటోలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో అనుమతించకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు, ఆర్టీఏ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. తద్వారా నగరంలోని నిరుపేద ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా డీజిల్‌తో నడుస్తూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓలా, ఊబర్‌ క్యాబ్‌లను నగరంలో తిరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణం గా ఆటో మీటర్‌ చార్జీలను వెంటనే పెంచాలని, ప్రైవేట్‌ ఆటో ఫైనాన్షియర్ల దోపిడీని శాశ్వతంగా అరికట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ నాయకులు కె.లక్ష్మీనర్సయ్య, మిర్జా రఫతుల్లా బేగ్‌, వంశీ కృష్ణ, పాల్గొన్నారు.

PostedOn: 29 Nov 2021 Total Views: 115




పాలకులు మాట ఇచ్చాక కట్టుబడి ఉండేలా చట్టా...

పాలకులు మాట ఇచ్చాక కట్టుబడి ఉండేలా చట్టాలు రావాలి

YSR తెలంగాణ పార్టీ ఆద్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు జెండా ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ...‘‘చట్టాలు పాలకులకు ఒకలా, ప్రజలకు, ప్రతిపక్షాలకు మరోలా వర్తిస్తున్నాయి. పోలీసు వ్యవస్థను ప...

26 Jan 2022

వార్దాలో రోడ్డు ప్ర‌మాదం : బీజేపీ ఎమ్మెల...

వార్దాలో రోడ్డు ప్ర‌మాదం : బీజేపీ ఎమ్మెల్యే కొడుకు...

మహారాష్ట్రలో సోమవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు వైద్యవిద్యార్ధులు మృతి చెందారు.బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్ తోపాటు ఏడుగురు వైద్య విద్యార్థులు సెల్సురా గుండా కారులో వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిం...

25 Jan 2022

స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే బెట‌ర్‌? :...

స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే బెట‌ర్‌? : వైద్య శాఖ...

కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా మూతబడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిం చాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే వచ్చే ఇబ్బందులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు విద్యా, ఆరోగ్య శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఆయా విభాగాల అభిప్రాయాలకు అనుగుణంగా...

25 Jan 2022

ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

డిప్యూటేషన్‌ రూల్స్‌ ప్రతిపాదించిన కేంద్రం తీరుపై పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఓ లేఖరాశారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణపై లేఖలో అభ్య...

24 Jan 2022

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

కృష్ణా: టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. వివ...

24 Jan 2022

ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రార...

ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌క్రియ ప్రారంభ‌ం కాబోతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన సంగ...

24 Jan 2022

తెలంగాణలో ఇంగ్లీషు చదువులు అంతంతే..?

తెలంగాణలో ఇంగ్లీషు చదువులు అంతంతే..?

బోధన పర్యవేక్షణకు అధికారులు లేరు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోస్టుల ఖాళీలు ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకువస్తే తెలంగాణ ప్రభుత్వ విద్యావవస్థ మారుతుందని భావిస్తున్న అధికార పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీషు మీడియం చదువులను అమలు చేయాలని విద్యాశాఖకు అధికార పార్టీ ఆదేశాలు జారీ చ...

24 Jan 2022

విరాట్ కోహ్లీ ప్ర‌వ‌ర్త‌నపై మండిప‌డుతున్...

విరాట్ కోహ్లీ ప్ర‌వ‌ర్త‌నపై మండిప‌డుతున్న నెటిజ‌న్...

మూడో వన్డే ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా విరాట్‌ కోహ్లీ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. సహచరులంతా గొంతు కలుపుతుండగా.. కోహ్లీ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉండడంతో పాటు చూయింగ్‌ గమ్‌ నములుతూ ఉదాసీనంగా కనిపించాడు. దీంతో ఈ దృశ్యాలను చూసిన అభిమానులు కోహ్లీపై మండిపడుతున్నారు. జట్టుకు ఆడడం ఇష్...

24 Jan 2022