మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్‌పై హైకోర్టు తీర్పు!

మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్‌పై హైకోర్టు తీర్పు...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దొంగతనం కేసులో ఇంటరాగేషన్‌ పేరుతో మరియమ్మపై స్టేషన్‌లో థర్ఢ్‌ డిగ్రీ ప్రయోగించారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. నాడి పరిశీలించిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని, పల్స్‌ దొరకడం లేదని చెప్పడంతో హుటాహుటిన భువనగిరి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు చెప్పారు. దీనిపై వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే మరియమ్మ లాకప్ డెత్ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఎస్సై మహేశ్వర్, కానిస్టేబుల్స్ రషీద్, జానయ్యలను శాశ్వతంగా వీధుల నుండి బహిష్కరించింది. తొలగించిన పోలీసుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు గతంలో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని డ్వకేట్‌ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్టల చేత విచారణ జరిపించేలా చూడాలని కోరారు. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పు వెలువరించింది.

PostedOn: 29 Nov 2021 Total Views: 120
పాలకులు మాట ఇచ్చాక కట్టుబడి ఉండేలా చట్టా...

పాలకులు మాట ఇచ్చాక కట్టుబడి ఉండేలా చట్టాలు రావాలి

YSR తెలంగాణ పార్టీ ఆద్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు జెండా ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ...‘‘చట్టాలు పాలకులకు ఒకలా, ప్రజలకు, ప్రతిపక్షాలకు మరోలా వర్తిస్తున్నాయి. పోలీసు వ్యవస్థను ప...

26 Jan 2022

వార్దాలో రోడ్డు ప్ర‌మాదం : బీజేపీ ఎమ్మెల...

వార్దాలో రోడ్డు ప్ర‌మాదం : బీజేపీ ఎమ్మెల్యే కొడుకు...

మహారాష్ట్రలో సోమవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు వైద్యవిద్యార్ధులు మృతి చెందారు.బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్ తోపాటు ఏడుగురు వైద్య విద్యార్థులు సెల్సురా గుండా కారులో వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిం...

25 Jan 2022

స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే బెట‌ర్‌? :...

స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే బెట‌ర్‌? : వైద్య శాఖ...

కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా మూతబడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిం చాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే వచ్చే ఇబ్బందులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు విద్యా, ఆరోగ్య శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఆయా విభాగాల అభిప్రాయాలకు అనుగుణంగా...

25 Jan 2022

ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

డిప్యూటేషన్‌ రూల్స్‌ ప్రతిపాదించిన కేంద్రం తీరుపై పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఓ లేఖరాశారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణపై లేఖలో అభ్య...

24 Jan 2022

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

కృష్ణా: టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. వివ...

24 Jan 2022

ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రార...

ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌క్రియ ప్రారంభ‌ం కాబోతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన సంగ...

24 Jan 2022

తెలంగాణలో ఇంగ్లీషు చదువులు అంతంతే..?

తెలంగాణలో ఇంగ్లీషు చదువులు అంతంతే..?

బోధన పర్యవేక్షణకు అధికారులు లేరు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోస్టుల ఖాళీలు ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకువస్తే తెలంగాణ ప్రభుత్వ విద్యావవస్థ మారుతుందని భావిస్తున్న అధికార పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీషు మీడియం చదువులను అమలు చేయాలని విద్యాశాఖకు అధికార పార్టీ ఆదేశాలు జారీ చ...

24 Jan 2022

విరాట్ కోహ్లీ ప్ర‌వ‌ర్త‌నపై మండిప‌డుతున్...

విరాట్ కోహ్లీ ప్ర‌వ‌ర్త‌నపై మండిప‌డుతున్న నెటిజ‌న్...

మూడో వన్డే ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా విరాట్‌ కోహ్లీ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. సహచరులంతా గొంతు కలుపుతుండగా.. కోహ్లీ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉండడంతో పాటు చూయింగ్‌ గమ్‌ నములుతూ ఉదాసీనంగా కనిపించాడు. దీంతో ఈ దృశ్యాలను చూసిన అభిమానులు కోహ్లీపై మండిపడుతున్నారు. జట్టుకు ఆడడం ఇష్...

24 Jan 2022