పాలకులు మాట ఇచ్చాక కట్టుబడి ఉండేలా చట్టాలు రావాలి

పాలకులు మాట ఇచ్చాక కట్టుబడి ఉండేలా చట్టా...
YSR తెలంగాణ పార్టీ ఆద్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు జెండా ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ...‘‘చట్టాలు పాలకులకు ఒకలా, ప్రజలకు, ప్రతిపక్షాలకు మరోలా వర్తిస్తున్నాయి. పోలీసు వ్యవస్థను పనివాళ్లలాగా పాలకులు వాడుకుంటున్నారు. పాలకులు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఓట్లు గుంజుకున్నాక ఏమైనా చేయొచ్చా..? ఇదే కదా మన దేశంలో జరుగుతోంది..? ఎన్నికల ముందు నాయకులు ఒక మాట ఇచ్చి గెలిచాక వారు ఆ హామీకి కట్టుబడి ఉండే విధంగా చట్టం తీసుకురావాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా నిబంధనలు ఉండాలి. రాజ్యాంగం ఏర్పడి 73 సంవత్సరాలు అయినా, రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు ఇప్పటి వరకు ఎవరికీ అందలేదు. నిన్న సాగర్ అనే యువకుడు ఉద్యోగం లేక, నోటిఫికేషన్ రావడం లేదని ట్రైన్ కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నిరుద్యోగులు ఉద్యోగాలు రావడం లేదని, రైతులు అప్పులు తీర్చలేక ఇలా మన రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మనస్సులో ఎంత క్రుంగిపోక పోతే ఒక వ్యక్తి తనను తాను సజీవ దహనం చేసుకుంటారు. ఎంత మంది ఐతే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారో...తెలంగాణ వచ్చాక కూడా అంతకు మించి ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. పాలకులు ఇంటికో ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు. డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత మంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కేసీఆర్. ప్రభుత్వ ఉపాధ్యాయులు 317జీవోతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ ఎన్నికలప్పుడే పథకాలు వదిలి, ఎన్నికలు ముగిసాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు.

PostedOn: 26 Jan 2022 Total Views: 131




బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్

బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరులోని మాజీ ప్రధాని దేవెగౌడ్ తో భేటీ అయ్యారు. దేవెగౌడతో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో సీఎం సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు.

26 May 2022

నన్ను వదిలేయండి నాన్న

నన్ను వదిలేయండి నాన్న

బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీహార్‌లోని దర్భంగా జిల్లా రతన్‌పుర గ్రామంలో పరువు హత్య జరిగింది. ఈ ఘటన నెలరోజుల క్రితం జరగడంతో ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్‌ అయ్యింది. వైరల్​ అయిన ఆడియోలో..’నన్ను వదిలేయండి నాన్న’..అంటూ తండ్రిని కుమార్తె వేడుకోగా హత్య చేస్తున్న సమయంలో ఆమె లవర్​ రికార్డ్​ చేసిన ఓ ...

26 May 2022

బ్యాట్ తో భర్తను బంతిలా భాదిన భార్య

బ్యాట్ తో భర్తను బంతిలా భాదిన భార్య

ఓ మహిళ తన భర్తను క్రికెట్‌ బ్యాట్‌ తో చితక్కొట్టింది. ఆమె పెడుతున్న టార్చర్‌ భరించేలేని భర్త రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. రాజస్థాన్‌ లోని అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్కూల్‌ ప్రిన్సిపల్‌ అయిన అజిత్ సింగ్ యాదవ్ ఏడేళ్ల కిందట హర్యానాలోని సోనిపట్‌కు చెందిన సుమన్‌ అనే మహిళను ప్రేమ పెళ్లి చేసుక...

26 May 2022

తెలంగాణ అమర వీరులకు ప్రధాని మోదీ శ్రద్ధా...

తెలంగాణ అమర వీరులకు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

తెలంగాణ అమర వీరులకు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు చెప్పారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని అన్నారు. హైదరాబాద్ లోని ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోదీ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. వేల మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరటం...

26 May 2022

లక్నో బ్యాటింగ్ గందరగోళం

లక్నో బ్యాటింగ్ గందరగోళం

టైటిల్ ఫేవరెట్ లలో ఒకటిగా కనిపించిన కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లఖ్ నవూ బ్యాటింగ్ గందరగోళంతో చేజేతులా పోగొట్టుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లోనే ఓడిపోయింది. మార్కస్ స్టాయినిస్, లూయిస్ లాంటి బిగ్ హిట్టర్ లను ఆఖరి వరకు దాచిపెట్టడంతో క్రీజులో కుదురుకునే సరికే ఆడాల్సిన రన్ రేట్ కొండలా పెరిగిపోయి ఒత్తిడికి గురి...

26 May 2022

టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. బూద్గామ్‌ జిల్లాలో టీవీ నటి అమ్రీన్‌ భట్‌ (35) ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌ కు గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న అమ్రీన్‌ భట్‌ పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప...

26 May 2022

మరో దారుణం

మరో దారుణం

కర్ణాటకలోని కలబుర్గి జిల్లా వాడీ ప్రాంతంలో దారుణం జరిగింది. వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వాడీలోని భీమానగర్​ కు చెందిన విజయ కాంబ్లే వేరే మతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుక...

26 May 2022

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఆంజనేయ స్వామి దేవాలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలలో ఆకు పూజలు చేసి ప్రత్యేక అలంకరణలతో భక్తులు కొలిచారు.

26 May 2022