కరువు తీరేలా మేఘా చేతిలో ‘వెలుగొండ’ పరుగులు

కరువు తీరేలా మేఘా చేతిలో ‘వెలుగొండ’ పరుగ...
కరువు తీరేలా మేఘా చేతిలో ‘వెలుగొండ’ పరుగులు వెలిగొండ.. కరువు సీమ కడగండ్లు తీర్చే గొప్ప ప్రాజెక్టు.. దీని పూర్తి పేరు.. ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఇప్పుడు కరువుతో అల్లాడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వడివడిగా పూర్తి అవుతోంది. నీటిని శ్రీశైలం జలాశయం ముందరి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా పంపిస్తారు. ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి నల్లమల కొండలశ్రేణి లో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టీఎంసీ నీటిని నిల్వచేయగలదు. టీడీపీ హయాంలో వెలగొండ ప్రాజెక్టు నత్తనడకనగా సాగింది. రోజుకు ఒక అడుగు చొప్పున మాత్రమే తవ్వారు. ఇప్పుడు రోజుకు 30 అడుగులు( 9.23 మీటర్ల చొప్పున ) తవ్వడం ద్వారా మొదటి సొరంగం పూర్తి చేయడం విశేషం. సీఎం జగన్‌ హామీ మేరకు వచ్చే సీజన్‌ నాటికి ప్రాజెక్ట్‌ తొలి దశను పూర్తి చేసే దిశగా పనులు వేగవంతం సాగుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను మేఘా ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ తో ప్రకాశం, కడప జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ఇక వెలిగొండ సొరంగ మార్గం కోసం ఎంఈఐఎల్ సంస్థ అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ను వినియోగించింది. కరోనా, ఇతర అవరోధాలను ఎదుర్కొని రికార్డు సమయంలో 3.6 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేసింది. ఎంఈఐల్ సంస్థ రాత్రింబవళ్లు కష్టపడి 9.23 మీటర్లు తవ్వడం ద్వారా ఈ పనులు పూర్తి చేసింది. రెండో సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూల సుబ్బయ్య వెలిగొండ మొదటి సొరంగం పూర్తి పొడవు 18 కిలోమీటర్లు. ఒక్కో టన్నెల్ పొడవు 18 కిలోమీటర్లు ఉండగా శ్రీశైలం అభయారణ్య రక్షణ కోసం టిబిఎం - టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా సొరంగాల తవ్వకం చేపట్టారు. అత్యంత అరుదుగా టిబిఎంను వినియోగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా వెలిగొండ ప్రాజెక్ట్ లోనే వినియోగించారు. ఇక ప్రాజెక్ట్ కోసం ఆసియాలో పొడవైన కన్వేయర్ బెల్ట్ వినియోగిస్తోంది, 18 కిలోమీటర్లు టన్నెల్ లోకి కన్వేయర్ బెల్ట్ వెళ్లేందుకు రెండుగంటలు పడుతుంది. టన్నెల్ లో 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలోనూ పనులు చేస్తున్న మేఘా సిబ్బంది. కరోనా, వర్షాలును సైతం తట్టుకొని మేఘా దాదాపు 10 మీటర్ల చొప్పున తవ్వారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండో సొరంగ మార్గం పనులు సైతం ఊపందుకున్నాయి. ఈ సొరంగం మార్గం ద్వారా 3001 క్యూసెక్స్ (85 క్యూసెక్స్) నీటిని తరలించనున్నారు. దేశంలోని పెద్ద గురుత్వాకర్షణ సొరంగాలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.20 లక్షల ఎకరాల ఆయకట్ కు నీటి సరఫరాతో పాటు 4 లక్షల మంది ప్రజల అవసరాలు తీరనున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్‌ మొదటి సొరంగాన్ని టీడీపీ హయాంలో 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే సొరంగాన్ని తవ్వారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక.. 2019 నవంబర్‌ నుంచి జనవరి 13, 2021 వరకూ మొదటి సొరంగంలో 3.6 కి.మీ. తవ్వి పనులను పూర్తి చేశారు. మార్చి 2020 నుంచి జూలై 2020 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగింది. జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురవడంతో సొరంగం తవ్వకానికి ఆటంకం కలిగింది. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున 9.23 మీటర్ల చొప్పున తవ్వుతూ సొరంగాన్ని పూర్తి చేశారు. * వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్1 పూర్తి.. వెలిగొండ ప్రాజెక్ట్లోని టన్నెల్ -1 ను పనులు విజయవంతంగా పూర్తిచేశారు. 7.86 బాహ్యవలయ తవ్వకాలతో ఈ పనులను పూర్తిచేసినట్టు మెయిల్ సంస్థ అధికారులు తెలిపారు. అయితే టన్నెల్-1 ను పూర్తిచేసేందుకు హెరెన్నెక్ట్ అనే కంపెనీకి చెందిన టీబీఎం మెషిన్ను ఉపయోగించారు. ఈ సొరంగం ద్వారా 3001 క్యూసెక్కులను తరలించనున్నారు. ఈ టన్నెల్ ద్వారా దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. అంతేకాక 4 లక్షలమందికి తాగునీటి అవసరాలను తీర్చనున్నది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గ్రావిటీ కెనాల్ అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో టన్నెల్ పాత్ర ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. టీబీఎం యంత్రంతో పాటు, టన్నెల్ -1 పోర్టల్, టన్నెల్ -1 ఎక్స్‌కవేటెడ్ మక్ డిశ్చార్జ్ కూడా ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తాయని అధికారులు చెప్పారు. ప్రాజెక్ట్‌ను 2016 నాటికే పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్ల మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను దోచిపెట్టిన టీడీపీ సర్కారు కమీషన్లు వసూలు చేసుకుంటే.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.61.76 కోట్లను ఆదా చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రికార్డు సమయంలో మొదటి సొరంగాన్ని పూర్తి చేయడం గమనార్హం. * వైసీపీ హయాంలో ‘వెలిగొండ’ వాయువేగం.. ఇదే ప్రాజెక్ట్‌లో భాగమైన రెండో సొరంగం పనులను సైతం వేగవంతం చేశారు. నల్లమల సాగర్‌ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నల్లమల సాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.1,411.56 కోట్లను జూన్‌ 24న మంజూరు చేశారు. పునరావాస కాలనీల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా నల్లమల సాగర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు పనులు వేగం పుంజుకున్నాయి.

PostedOn: 14 Jan 2021 Total Views: 237
కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల ...

కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల నిఘా

చెన్నై: కేరళలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చటంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు జరుపుతున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవ...

04 Sep 2021

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పంద...

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పందం

న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత...

28 Aug 2021

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధ...

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధానం

న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బ...

28 Aug 2021

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక 'సిటాడెల్' సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్‌స్టాగ్...

28 Aug 2021

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అసోం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.భారీవర్షాల వల్ల బిస్వానాథ్, బోనగైగామ్ చిరాంగ్, థీమాజీ, దిబ్రూఘడ్, జోర్హత్, లఖి...

28 Aug 2021

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశ...

28 Aug 2021

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు...

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే 31,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే అందులో ఒక్క కేరళ రాష్టంలో 32,801 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు...

28 Aug 2021

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

న్యూఢిల్లీ: భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ఇంతకీ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..? సీసీ కెమెరాల ఏర్పాటులో. అవును మీరు వింటున్నది నిజమే...

28 Aug 2021