తెలంగాణ వాసులకు కేసీఆర్.. 2 రోజులు బయటకు వెళ్లొద్దు

తెలంగాణ వాసులకు కేసీఆర్.. 2 రోజులు బయటకు...
అరుదుగా మాత్రమే సూచనలు.. హెచ్చరికలు జారీ చేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ .. తాజాగా తెలంగాణ ప్రజలకు ఒక వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలు భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాదు.. గోదావరీ నదీ పరివాహక కేంద్రాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన తాజా వార్నింగ్ ఇచ్చేశారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే నిర్మల్ పట్టణం గోదావరి జలాలతో మునిగిపోయిన పరిస్థితి ఉందన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్.. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవాలంటూ మంత్రి పువ్వాడ జయల్ కుమార్ కు పేర్కొన్నారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలు ఒకవైపు.. మరోవైపు నదీ పరిహాక ప్రాంతంలో ఉంటున్న వారు వరదకు సంబంధించిన ముప్పును ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షపు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్సారెస్పీ ఎగువ నుంచి వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు.. ప్రజా ప్రతినిధులు.. సలహాదారులు ఇలా.. అందరిని బాధిత ప్రాంతాలకు వెళ్లటం.. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కరుసున్నాయని.. తక్షణమే అక్కడకు వెళ్లి బాధితులకు అవసరమైన సహాయ సహాకారాలు అందించాలని కోరుతూ మంత్రి వేముల ప్రశాంత్ తో పాటు.. నిర్మల్ పట్టణం నీట మునిగిందన్న సమాచారంతో అక్కడకు సహాయక టీంలను పంపాలని సోమేశ్ ను ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతాలకు సంబంధించిన జిల్లాల కలెక్టర్ కు సమాచారాన్ని పంపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు.. ఎంతో అవసరమైతే తప్పించి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. సాధారణంగా ఇలాంటి వినతులు ఎప్పుడో కానీ ఇవ్వని కేసీఆర్.. ప్రభుత్వ విభాగాల్ని పెద్ద ఎత్తున సమాయుత్తం చేయటం కనిపిస్తోంది. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్ననేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో.. మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన సీఎం కేసీఆర్.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ మాటల్ని పట్టించుకోవటం చాలా అవసరం. పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్యేలు బాధిత ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఎగువ రాష్ట్రాల వారు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేస్తున్నారని.. తెలంగాణలోకి వరద తీవ్రత పెరుగుతుందని చెప్పారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ అన్ని స్థాయి నేతలు.. కార్యకర్తలు తెలంగాణ భవన్ కు టచ్ లో ఉండాలన్నారు. మరో రెండు రోజుల పాటు అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాను వినిపించిన కేసీఆర్.. ఈ గండం నుంచి తప్పించుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరి..ఆయన మాటల ప్రభావం ఎంతో ఈ రానున్న రెండు రోజుల్ని పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది.

PostedOn: 22 Jul 2021 Total Views: 100
కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల ...

కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల నిఘా

చెన్నై: కేరళలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చటంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు జరుపుతున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవ...

04 Sep 2021

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పంద...

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పందం

న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత...

28 Aug 2021

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధ...

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధానం

న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బ...

28 Aug 2021

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక 'సిటాడెల్' సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్‌స్టాగ్...

28 Aug 2021

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అసోం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.భారీవర్షాల వల్ల బిస్వానాథ్, బోనగైగామ్ చిరాంగ్, థీమాజీ, దిబ్రూఘడ్, జోర్హత్, లఖి...

28 Aug 2021

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశ...

28 Aug 2021

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు...

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే 31,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే అందులో ఒక్క కేరళ రాష్టంలో 32,801 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు...

28 Aug 2021

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

న్యూఢిల్లీ: భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ఇంతకీ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..? సీసీ కెమెరాల ఏర్పాటులో. అవును మీరు వింటున్నది నిజమే...

28 Aug 2021