ఉప ఎన్నికలు కావాలంటున్న ప్రజలు

ఉప ఎన్నికలు కావాలంటున్న ప్రజలు
ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఆడిస్తే ప్రజలు అలా ఆడేవాళ్లు.. వాళ్ల చేతిలో కీలుబొమ్మలుగా మారేవాళ్లు. జనాలను మంచిక చేసుకునేందుకు నేతలు ఎన్నో వ్యూహాలు రచిస్తారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇన్నాళ్లూ రాజకీయ నాయకులు ఏం చేసినా చెల్లింది కానీ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగింది. చదువుకున్న యువత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. దీంతో ఇప్పుడు నేతల నాటకాలు నడిచే అవకాశం లేకుండా పోతోంది. అందుకు తెలంగాణలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలే నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల తమ నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారు. అందుకు బలమైన కారణం లేకపోలేదు. అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలి. వాళ్ల ప్రగతికి అవసరమైన పథకాలు ఎప్పటికప్పుడూ ప్రవేశపెట్టి జనాలను బాగు చేయాలి. కానీ ఎన్నికలు వచ్చినపుడే పథకాలు పెడతాం వరాల జల్లు కురిపిస్తాం అంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు తెలంగాణ సీఏం కేసీఆర్ తీరు కూడా అలాగే ఉందంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని దళిత బంధు పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టాలనే నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణం. అది కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే మొదట ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అందుకు భారీ మొత్తంలో నిధులు కేటాయించనున్నారు. ప్రజలు ఈ పథకం వెనకున్న మర్మాన్ని తెలుసుకోలేనంత పిచ్చోళ్లు కాదు కదా. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అక్కడ ఎలాగైనా మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చి హుజూరాబాద్లోనే మొదట అమలు చేయాలని నిర్ణయించారని జనాలకు అర్థమైపోయింది. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా ఒప్పుకోవడం గమనార్హం. అవును.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చాం. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పేముందు అన్నట్లూ ఆయన వ్యాఖ్యలున్నాయి. దీంతో సీఎం కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని ఆయన ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయని గ్రహించారని ఈటల విమర్శలు చేస్తున్నారు. అవును.. నిజమే ఈ ఉప ఎన్నికలో విజయం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తారని గెలవడమే ఆయన టార్గెట్ అని ప్రతిపక్షాలు ప్రజలు విమర్శిస్తున్నారు. పథకం పేరు చెప్పి డబ్బులు పంచి గెలవాలని అనుకుంటున్నాడని కేసీఆర్పై మండిపడుతున్నారు. దళిత వ్యక్తిని తెలంగాణ సీఏం చేస్తాననే హామీని తుంగలో తొక్కి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్.. కారణం లేకుండానే ఓ దళిత డిప్యూటీ సీఎంనీ అవమానించి కేబినేట్ నుంచి బయటకు పంపినపుడు దళిత బంధు గుర్తకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తమ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నికలు వస్తే బాగుండని జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇదే వైరల్గా మారింది. తమ నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్లు ప్రజలు పోస్టులు పెడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే. . ఎన్నికలు వస్తేనే కదా కేసీఆర్ వరాల వర్షం కురిపించేది కొత్త పథకాలతో తమకు మేలు చేసేది అని జనాలు సమాధానిమిస్తున్నారు. పరిశీలించి చూస్తే అదే నిజమని ఒప్పుకోక తప్పదు. దుబ్బాక సాగర్ ఉప ఎన్నికలపుడు ఆ నియోజకవర్గాలకు వరాల జల్లు కురిపించిన ఆయన.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరద సాయం పేరుతో ప్రజలకు డబ్బులు పంచారు కదా అని విశ్లేషకులు అంటున్నారు. దీంతో తమ నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ తమ వైపు చూస్తారనే ఆశతో ప్రజలున్నారు. అందుకే తమ ఎమ్మెల్యేనో ఎంపీనో తమ పదవికి రాజీనామా చేస్తే బాగుండేదని జనాలు అనుకుంటుండటం విశేషం.

PostedOn: 23 Jul 2021 Total Views: 91
కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల ...

కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల నిఘా

చెన్నై: కేరళలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చటంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు జరుపుతున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవ...

04 Sep 2021

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పంద...

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పందం

న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత...

28 Aug 2021

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధ...

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధానం

న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బ...

28 Aug 2021

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక 'సిటాడెల్' సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్‌స్టాగ్...

28 Aug 2021

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అసోం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.భారీవర్షాల వల్ల బిస్వానాథ్, బోనగైగామ్ చిరాంగ్, థీమాజీ, దిబ్రూఘడ్, జోర్హత్, లఖి...

28 Aug 2021

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశ...

28 Aug 2021

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు...

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే 31,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే అందులో ఒక్క కేరళ రాష్టంలో 32,801 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు...

28 Aug 2021

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

న్యూఢిల్లీ: భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ఇంతకీ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..? సీసీ కెమెరాల ఏర్పాటులో. అవును మీరు వింటున్నది నిజమే...

28 Aug 2021