యడ్యూరప్పకు మూణ్నాళ్ల ముచ్చటే!

యడ్యూరప్పకు మూణ్నాళ్ల ముచ్చటే!
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే దిశగా రంగం సిద్ధమైందనే మాటులు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన గద్దె దిగనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. బీజేపీ అధిష్ఠానం కూడా ఈ నిర్ణయానికే వచ్చిందని యడ్యూరప్పకు పదవి వదులుకోవడం తప్ప మరో మార్గం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అందుకు ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం సాగుతోంది. నిజానికి యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటికే మూడు సార్లు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఒక్కసారి కూడా పూర్తి కాలం పాటు ఆ పదవిలో కొనసాగలేదు. అర్ధాంతరంగా దిగిపోయారు. ఇప్పుడు మరోసారి ఆయన రాజీనామా చేయక తప్పేట్లు లేదు. దీంతో నాలుగో సారి కూడా అధికారాన్ని చేపట్టి ఆ గడువు పూర్తి కాకముందే పదవి నుంచి దిగిపోయిన దురదృష్టవంతుడిగా ఆయన నిలిచిపోనున్నారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకూ పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. కానీ పూర్తి కాలం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంది కొద్దిమంది మాత్రమే. చివరగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగారు. యడ్యూరప్ప మాత్రం పదవి చేపట్టిన ప్రతిసారి ఏదో ఓ కారణంతో మధ్యలోనే దిగిపోతున్నారు. అవినీతి ఆరోపణలు రావడం ఆయన పదవికి రాజీనామా చేయడం పరిపాటి అయిపోయింది. భారతీయ జనతా పార్టీ జెండాను దక్షిణాదిన నిలిపిన నాయకుడిగా యడ్యూరప్పకు గొప్ప పేరుంది. సామాజిక వర్గం పరంగా ఆయన బలమైన నేత కావడంతో బీజేపీ ఇక్కడ ఉనికిని నిలుపుకోగలిగింది. 2007లో బీజేపీ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కొంత కాలాకినే జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోయింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన ఆయన మరోసారి సీఎం అయ్యారు. కానీ అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన అధిష్ఠానం ఒత్తిడితో అప్పుడు పదవితో పాటు బీజేపీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కర్ణాటక జనత పక్ష పేరుతో పార్టీ పెట్టి 2013లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2018 శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీకి 8 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయినప్పటికీ తన బలాన్ని నిరూపించుకోవాలనే షరతుతో మూడోసారి యడ్యూరప్ప సీఎం అయ్యారు. కానీ బలం నిరూపించుకోకపోవడంతో కేవలం రెండున్నర రోజుల్లోనే రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం సంపాదించిన యడ్యూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలతో సొంత పార్టీలోనే అసంతృప్తి పెరిగిపోవడంతో మరోసారి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాన్ని శిరసావహిస్తానని ఆయన ప్రకటించడం వెనక రాజీనామా చేసే ఉద్దేశ్యమే ఉందని స్పష్టమైంది.

PostedOn: 23 Jul 2021 Total Views: 148
కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల ...

కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల నిఘా

చెన్నై: కేరళలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చటంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు జరుపుతున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవ...

04 Sep 2021

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పంద...

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పందం

న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత...

28 Aug 2021

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధ...

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధానం

న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బ...

28 Aug 2021

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక 'సిటాడెల్' సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్‌స్టాగ్...

28 Aug 2021

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అసోం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.భారీవర్షాల వల్ల బిస్వానాథ్, బోనగైగామ్ చిరాంగ్, థీమాజీ, దిబ్రూఘడ్, జోర్హత్, లఖి...

28 Aug 2021

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశ...

28 Aug 2021

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు...

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే 31,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే అందులో ఒక్క కేరళ రాష్టంలో 32,801 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు...

28 Aug 2021

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

న్యూఢిల్లీ: భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ఇంతకీ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..? సీసీ కెమెరాల ఏర్పాటులో. అవును మీరు వింటున్నది నిజమే...

28 Aug 2021