స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి

స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి
స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి త్వరలోనే సాకారం కాబోతోంది. ఏపీ కలల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పట్టుబట్టి పూర్తి చేయిస్తోంది. సీఎం జగన్, మంత్రులు సమీక్షిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పానికి తోడుగా ప్రాజెక్టు పనులు చేపట్టిన ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ’ కూడా రాత్రింబవళ్లు నిరంతరం పనులు చేస్తూ ముందుకు సాగుతోంది. పోలవరం ప్రాజెక్టులోనే అతి క్లిష్టమైన కష్టమైన టాస్క్ ను తాజాగా పూర్తి చేయడం విశేషం. ప్రాజెక్టులో వరద నీటిని వదిలే స్పిల్ వే నిర్మాణం చేపట్టాలంటే 52 మీటర్ల ఎత్తున పిల్లర్లు నిర్మించాల్సి ఉంటుంది. స్పిల్ వే లో 2 వ బ్లాక్ లో ఫిష్ లాడర్ నిర్మాణం చేపట్టడం వల్ల దీని డిజైన్లకు సంబందించి అనుమతులు ఆలస్యం కావడం తో 2వ పిల్లర్ నిర్మాణం ఆలస్యమైంది. కానీ ఇటీవలే డిజైన్లు అన్నీ అనుమతులు వచ్చాక త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసి స్లాబ్ లెవల్ కు అంటే సరాసరిన 52 మీటర్ల ఎత్తుకు అన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసింది ఎంఈఐఎల్ సంస్థ. స్పిల్ వే పిల్లర్లపైన బ్రిడ్జి స్లాబ్ పనులు దాదాపు పూర్తి కావోచ్చాయి. మేఘా సంస్థ 2019 నవంబర్ 21న పోలవరం కాంక్రీట్ పనులు మొదలు పెట్టింది. అప్పటి నుంచి రాత్రింబవళ్లు పనులు చేస్తోంది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ పొడవు 1128 మీటర్లకు గానూ ఇప్పటికే 1095 మీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. స్పిల్ వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాగా 188 గడ్డర్లను ఇప్పటికే పిల్లర్లపై ఏర్పాటు చేశారు. 4 గడ్డర్లు మాత్రమే పిల్లర్లపై పెట్టాల్సి ఉంది. 2019 నవంబర్ లో స్పిల్ వే పిల్లర్ల కాంక్రీట్ నిర్మాణం ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ అనతి కాలంలోనే ఆ పనులను పూర్తి చేసింది. స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబ్ కాంక్రీట్ సెప్టెంబర్, 9 2020 లో మొదలు పెట్టింది. ఇక జులై 2020 లో స్పిల్ వే పిల్లర్లు పై గడ్డర్లు ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే స్పిల్ వే బ్రిడ్జ్ లో పూర్తయిన స్లాబ్ సంఖ్య 45, మిగిలిన 3 స్లాబ్ లు పనులు త్వరలోనే పూర్తి చేయడానికి సంస్థ రెడీ అయ్యింది. మొత్తం 49 ట్రూనియన్ భీమ్ లు పనులు పూర్తి చేయడంతో పాటు స్పిల్ వే బ్రిడ్జి లో మొత్తం 48 గేట్లకు గాను ఇప్పటికే 28 గేట్లను ఏర్పాటు చేసింది. త్వరలోనే గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్ లు అమర్చేందుకు ప్లాట్ ఫాం ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతున్నాయి. దీంతో ఏపీ కలల ప్రాజెక్ట్ త్వరలోనే ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. దశాబ్ధాల కలను నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం, మేఘా సంస్థ కదులుతోంది. జగన్ హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తి కానుంది. అతి త్వరలోనే ప్రజలకు సాగు, తాగునీటిని అందించే బృహత్ ప్రాజెక్ట్ ఆవిష్కృతం కాబోతోంది.

PostedOn: 11 Feb 2021 Total Views: 440
కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల ...

కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల నిఘా

చెన్నై: కేరళలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చటంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు జరుపుతున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవ...

04 Sep 2021

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పంద...

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పందం

న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత...

28 Aug 2021

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధ...

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధానం

న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బ...

28 Aug 2021

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక 'సిటాడెల్' సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్‌స్టాగ్...

28 Aug 2021

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అసోం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.భారీవర్షాల వల్ల బిస్వానాథ్, బోనగైగామ్ చిరాంగ్, థీమాజీ, దిబ్రూఘడ్, జోర్హత్, లఖి...

28 Aug 2021

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశ...

28 Aug 2021

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు...

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే 31,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే అందులో ఒక్క కేరళ రాష్టంలో 32,801 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు...

28 Aug 2021

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

న్యూఢిల్లీ: భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ఇంతకీ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..? సీసీ కెమెరాల ఏర్పాటులో. అవును మీరు వింటున్నది నిజమే...

28 Aug 2021