రూ.18 కోట్ల‌తో ఆంకాల‌జీ వార్డు నిర్మించిన మేఘా

రూ.18 కోట్ల‌తో ఆంకాల‌జీ వార్డు నిర్మించి...
హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 9 : పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్‌తో బాధపడే వారికోసం రూ. 18 కోట్ల‌తో అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్‌ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది. ఈ క్యాన్స‌ర్ వార్డును రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ శ‌నివారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ చైర్మ‌న్ పి.పి.రెడ్డి, డైర‌క్ట‌ర్ పి. సుధారెడ్డిలు హాజ‌రైనారు. ప్రభుత్వ వైద్య సంస్థ అయిన నిమ్స్ కు సాధార‌ణ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల పేషెంట్లే ఎక్కువ‌గా వ‌స్తుంటారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క్యాన్స‌ర్ వ్యాధి అత్యంత ఖ‌ర్చుతో కూడుకున్న‌ది కావ‌డంతో అలాంటి సేవ‌ల‌న్నీ ఇక‌పై నిమ్స్‌లో అతి త‌క్కువ ఖ‌ర్చుతోనే ల‌భించ‌నున్నాయి. మేఘా సేవ‌లు అభినంద‌నీయం- మంత్రి ఈటెల‌ నిజాం కాలం నుంచి ఎంతో పేరు ప్ర‌తిష్ట‌లున్న నిమ్స్‌, దుర్గాబాయి్ దేశ్‌ముఖ్, ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రుల్లో కార్పొరేట్ సోషియ‌ల్ రెస్పాన్స‌బిలిటీ కింద మేఘా సంస్థ సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినంద‌నీయ‌మ‌ని మంత్రి ఈటెల ప్ర‌శంసించారు. కాన్స‌ర్ వార్డు ప్రారంభించిన త‌రువాత మంత్రి వివిధ వార్డుల్లో తిరిగి రోగుల‌తో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సౌక‌ర్యాలు గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ ప్ర‌భుత్వం నిమ్స్ అభివృద్ధికి రూ.450 కోట్ల‌తో ప్రత్యేకంగా అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 11న నిమ్స్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో స‌మీక్ష చేయ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. వైద్య రంగంపై ఏటా 7500 కోట్లు ఖ‌ర్చుపెడుతున్నామ‌ని, రాష్ట్రంలోని ఆసుపత్రులను ఆధునీకరించి వైద్యరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్థోపెడిక్ విభాగాన్నీ ఆధునీక‌రిస్తాం- పి.పి.రెడ్డి మేఘా ఇంజనీరింగ్‌ ఛైర్మన్‌ పిపి రెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యత లో మేఘా ఎప్పుడు ముందుంటుందని, కార్పొరేట్‌ ఆసుపత్రికి ధీటుగా నిమ్స్‌ క్యాన్సర్‌ వార్డును నిర్మించామని తెలిపారు. అలాగే నిమ్స్‌ లోని ఆర్థోపెడిక్‌ విభాగాన్ని కూడా ఆధునీకరిస్తామని, దుర్గాబాయ్‌ దేశముఖ్‌ ఆసుపత్రి రూపురేఖలు మార్చుతామన్నారు. క్యాన్స‌ర్ రోగుల‌కు వ‌రం- డా. మ‌నోహర్‌ నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌మాట్లాడుతూ అడిగిన వెంటనే నిమ్స్‌ ఆసుపత్రికి భారీగా నిధులు కేటాయించి కార్పోరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక టెక్నాలజీని, కాన్సర్‌ వార్డును పునర్‌ నిర్మించిన మేఘా చైర్మన్ పి.పి.రెడ్డి, ఎండీ పి.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్ పి.సుధారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. బ‌య‌ట ఆస్ప‌త్రుల్లో రూ.20 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయ్యే వైద్య సేవ‌లు, నిమ్స్ ఆస్ప‌త్రిలో కేవ‌లం ల‌క్ష రూపాయ‌ల్లోనే అందుతాయ‌ని, ఇది ప్ర‌జ‌ల‌కు ఎంతో ఊరట‌నిస్తుంద‌న్నారు. మేఘా నిర్మించిన క్యాన్స‌ర్ వార్డు ప్ర‌త్యేక‌త‌లివి *రూ. 18 కోట్లతో ఆంకాలజీ బ్లాక్ ఆధునికీకరణ * ఆంకాలజీ విభాగానికి కార్పొరేట్ హంగులు* *20 వేల చదరపు అడుగుల క్యాన్స‌ర్ వార్డు * మహిళలు, పురుషులు, చిన్నారులకు ప్రత్యేక వార్డులు* ప్రతి బెడ్డుకు ఆక్సిజన్, వెంటిలేటర్స్, సెంట్రల్ ఏసీ* రక్త క్యాన్సర్ బాధితులకు ప్రత్యేకంగా లుకేమియా వార్డు* ఆంకాలజీ బ్లాకు మెయింటెనెన్సు ఖర్చును మూడేళ్ళ పాటు భరించనున్న మేఘా సంస్ధ* 50 పడకలతో క్యాన్సర్ పేషెంట్ ల చికిత్స కు ప్రత్యేక వార్దులు* పీడియాట్రిక్ క్యాన్సర్,లుకేమియా బాధితుల చికిత్స కోసం అధునాతన వార్డులు* పేషెంట్లకు అనుక్షణం వార్డుల్లో సేవ‌లందించేందుకు డాక్డ‌ర్ల‌కు, న‌ర్సుల‌కు ప్ర‌త్యేక గ‌దులు* మహిళలు, పురుషులు, చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు* కార్పోరేట్ సోషియల్ రెస్పాన్స్ బులిటి లో‌ భాగంగా (CSR) NIMS లో MEIL సేవలు*

PostedOn: 09 Jan 2021 Total Views: 361
కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల ...

కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో ఆరోగ్యశాఖ అధికారుల నిఘా

చెన్నై: కేరళలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చటంతో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు జరుపుతున్నారు. కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవ...

04 Sep 2021

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పంద...

ఆయుధాల కొనుగోలుకు ర‌ష్యాతో భార‌త్ ఒప్పందం

న్యూఢిల్లీ : రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్‌కు బదులుగా ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్‌ను సమకూర్చుకోబోతోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత...

28 Aug 2021

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధ...

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధానం

న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బ...

28 Aug 2021

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక 'సిటాడెల్' సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్‌స్టాగ్...

28 Aug 2021

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

అసోంలో భారీ వర్షాలు.. వరదలు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 11 జిల్లాల్లో 1.33 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని అసోం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.భారీవర్షాల వల్ల బిస్వానాథ్, బోనగైగామ్ చిరాంగ్, థీమాజీ, దిబ్రూఘడ్, జోర్హత్, లఖి...

28 Aug 2021

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

వ్యాక్సినేషన్‌లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశ...

28 Aug 2021

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు...

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే 31,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే అందులో ఒక్క కేరళ రాష్టంలో 32,801 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు...

28 Aug 2021

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీ టాప్

న్యూఢిల్లీ: భారత్‌కు గర్వకారణమైన విషయం ఇది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్, చైనాలను కూడా భారత్ అధిగమించిన అంశం ఇది. ఆయా దేశాల్లోని టాప్ నగరాలకంటే భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం ముందంజలో నిలిచింది. ఇంతకీ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..? సీసీ కెమెరాల ఏర్పాటులో. అవును మీరు వింటున్నది నిజమే...

28 Aug 2021