కరోనా కరాళ నృత్యం, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనా కరాళ నృత్యం, కరోనా వైద్యాన్ని ఆరోగ...
కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. జన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. దేశంలోను ఇటు తెలంగాణ రాష్ట్రంలోను కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం అందరి బాధ్యత. దీనికి సర్కార్ తోడ్పాటు చాలా అవసరం. పేదలు కరోనా వ్యాధి తీవ్రరూపందాలిస్తే వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వ దవాఖానలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడం, జనం ప్రాణాలు నిలపడం కనీస బాధ్యత. సర్కార్ దవాఖానల్లో సరైన సదుపాయాలు లేవు. ఈ పరిస్థితిలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చారు. దీనివల్ల కార్పొరేట్ వైద్యం చేయించుకునే వీలుంటుందని... ఆక్సిజన్ అందక, వైద్యం అందక చనిపోయే పరిస్థితిని అరికట్టవచ్చు అనేది షర్మిల గారి ఆలోచన. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. కోటి మందికి పైగా లబ్ది పొందారు. ఇలా చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత కూడా. తెలంగాణ సర్కార్ మాత్రం ఈ విషయాలేవీ చెవిన పెట్టడం లేదు. ప్రజలు శవాల కుప్పలుగా మారుతుంటే చూస్తూ కంటితుడుపు చర్యలు చేపడుతూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. 2, 500కోట్లు ఖర్చు చేసైనా వాక్సిన్ తెప్పించి అందరికి మే 1వ తారీఖున ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆ విషయాన్నీ దాటవేసి మరి కొన్ని రోజులు పడుతుందని చెప్పడం బాధాకరం. ప్రజల ప్రాణాలపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధమవుతుంది. కరోనా మహమ్మారి కోరలు చాచింది. రాష్ట్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఒక్క నెల రోజుల్లోనే లక్షా ముప్పై వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిమిషానికి కనీసం ముగ్గురికి మహమ్మారి సోకుతోందని వైద్యారోగ్య శాఖ నివేదికలు చెప్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరాన్ని మహమ్మారి చుట్టేస్తోంది. పాజిటీవ్‌ రేటు 10 శాతానికి చేరిందనే ఆరోగ్యశాఖ లెక్కలు భయాందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రతిరోజు వందలాది మందికి కరోనా సోకుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 3లక్షల 9వేల 741మంది కొవిడ్‌ భారిన పడగా.. ఏప్రిల్ చివరి నాటికి అది కాస్తా.. 4లక్షల 43 వేల 360కి చేరింది. అంటే ఒక్క ఏప్రిల్ నెలలోనే లక్షా 33వేల 619మందికి కరోనా నిర్ధరణ అయింది. రోజుకి సరాసరిన 4వేల 453 మందికి వైరస్‌ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అంటే గడచిన నెల రోజుల్లో ప్రతి గంటకి 185 మంది చొప్పున... నిమిషానికి కనీసం ముగ్గురికి పైగా కరోనా భారినపడటం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసులు సైతం మార్చ్ చివరి నాటికి కేవలం 6వేల 159 ఉండగా... ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 78వేల 888కి పెరిగింది. కరోనా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్ వేగంగా విస్తరిస్తోందని అధికారిక లెక్కలు చెబుతుండగా మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో 606 మందిని వైరస్ బలితీసుకుంది. అంటే రోజుకి సగటున కనీసం 20 మంది మహమ్మారితో మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు సైతం నెలరోజుల్లోనే సుమారు 16శాతం తగ్గటం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. మార్చి చివరి నాటికి రాష్ట్రంలో 97.5 శాతానికి పైగా వైరస్ భారిన పడినవారు కోలుకుంటుండగా.. ప్రస్తుతం అది 81.68 కి పడిపోయింది. మరీ ముఖ్యంగా GHMCపై కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. గడిచిన నెలరోజుల్లో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 17.3 శాతం కేసులు ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే నమోదయ్యాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ వంటి ప్రాంతాలపైనా కరోనా తీవ్రత అధికంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో గతేడాది మార్చ్‌లో మొదటి కరోనా కేసులు నమోదయ్యాయి.. ఏడాది కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏప్రిల్‌లో వైరస్ శరవేగంగా విస్తరించటంతో పాటు... వందల మందిని మృత్యువు వడిలోకి లాక్కుంది. ప్రాణాలను బలితీసుకుంది. రానున్న 4 వారాలు సైతం పరిస్థితి తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, సరైన జాగ్రత్తలు పాటిస్తూ, వైరస్‌ భారినపడకుండా రక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో పట్టించుకోని కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ రేటు 11 శాతానికి పెరిగింది. తాజాగా 77, 903మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా...7, 754మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. మరో 5,186మందికి చెందిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వైరస్ భారిన పడిన వారి సంఖ్య 4,43,360కి చేరింది. మరో 6,542మంది కోలుకోగా మొత్తం 3,62,160 మంది ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా 51మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా మరణాలు.. 2,312కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 మంది కరోనాతో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి భారినపడుతున్న వారు 81.8శాతం మంది రికవర్ అవుతుండగా రాష్ట్రంలో మాత్రం కొంత స్వల్పంగా 81.68శాతం మంది కోలుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇక తాజాగా వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఆదిలాబాద్ 109, భద్రాద్రి కొత్తగూడెం 108, జీహెచ్ ఎంసీ 1,507, జగిత్యాల 255, జనగామ 74, జయశంకర్ భూపాలపల్లి 73, జోగులాంబగద్వాల 100, కామారెడ్డి 143, కరీంనగర్ 281, ఖమ్మం 230, కొమరంభీం ఆసిఫాబాద్ 101, మహబూబ్ నగర్ 279, మహబూబాబాద్ 125, మంచిర్యాల 216, మెదక్ 106, మేడ్చల్ మల్కాజ్ గిరి 630, ములుగు 41, నాగర్ కర్నూల్ 203, నల్గొండ 231, నారాయణ్ పేట 44, నిర్మల్ 86, నిజామాబాద్ 267, పెద్దపల్లి 162, రాజన్న సిరిసిల్ల 102, రంగారెడ్డి 544, సంగారెడ్డి 325, సిద్దిపేట 279, సూర్యాపేట 242, వికారాబాద్ 242, వనపర్తి 103, వరంగల్ రూరల్ 165, వరంగల్ అర్బన్ 208, యాదాద్రి భువనగిరి 173మందికి కరోనా సోకింది. ఇంత మంది ప్రాణాలు పోతుంటే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా తెలంగాణ సర్కార్... ఏం పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం. ఏది ఏమైనా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాల్సిన అవసరం వుంది. దీని వల్ల ప్రాణాలు నిలుపుకునే వీలుంటుంది. కరోనా బారిన పడకుండా ఉండే అవకాశం కలుగుతుంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుంటే మంచిది. కరోనా వచ్చిన వారికి చేతనైన సాయం చేయడం కూడా మన బాధ్యతగా భావించాలి. వారికి బతుకు భరోసా ఇవ్వాలి. కరోనాను ప్రారద్రోలాలి. తెలంగాణ సర్కార్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి. పేదలకు బతుకు భరోసా ఇవ్వాలి.

PostedOn: 04 May 2021 Total Views: 160
స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి

స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి

స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి త్వరలోనే సాకారం కాబోతోంది. ఏపీ కలల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పట్టుబట్టి పూర్తి చేయిస్తోంది. సీఎం జగన్, మంత్రులు సమీక్షిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ...

11 Feb 2021

ఒలెక్ట్రా నుంచి పుణె నగరానికి మరో 350 ఎల...

ఒలెక్ట్రా నుంచి పుణె నగరానికి మరో 350 ఎలక్ట్రిక్ బ...

•బెంగళూరు బీఎంటీసీ బిడ్డింగ్ లో ఎల్-1 గా నిలిచిన ఒలెక్ట్రా హైదరాబాద్ : ఎలక్ట్రిక్ బస్సుల (ఈవి) తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మర...

29 Jan 2021

కరువు తీరేలా మేఘా చేతిలో ‘వెలుగొండ’ పరుగ...

కరువు తీరేలా మేఘా చేతిలో ‘వెలుగొండ’ పరుగులు

కరువు తీరేలా మేఘా చేతిలో ‘వెలుగొండ’ పరుగులు వెలిగొండ.. కరువు సీమ కడగండ్లు తీర్చే గొప్ప ప్రాజెక్టు.. దీని పూర్తి పేరు.. ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఇప్పుడు కరువుతో అల్లాడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసే...

14 Jan 2021

రూ.18 కోట్ల‌తో ఆంకాల‌జీ వార్డు నిర్మించి...

రూ.18 కోట్ల‌తో ఆంకాల‌జీ వార్డు నిర్మించిన మేఘా

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 9 : పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్‌తో బాధపడే వారికోసం రూ. 18 కోట్ల‌తో అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్‌ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీ...

09 Jan 2021

రామతీర్థంలో చంద్రబాబు ప్రమేయం ఉంటే రాముడ...

రామతీర్థంలో చంద్రబాబు ప్రమేయం ఉంటే రాముడే ఆయన్ను శ...

రామతీర్థంలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి చంద్రబాబు నీతికబుర్లు చెబుతున్నారని వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శలు చంద్రబాబుకు ఇవాళ జై శ్రీరామ్ గుర్తొచ్చిందంటూ వ్యంగ్యం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో ర...

03 Jan 2021

బాలు నడక, మాట చూస్తే అచ్చం మా నాన్నను చూ...

బాలు నడక, మాట చూస్తే అచ్చం మా నాన్నను చూసినట్టే ఉం...

బాలు గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించిన శంకర్ మహాదేవన్ తమది తండ్రీకొడుకుల అనుబంధం అని వెల్లడి తన సంగీతాన్ని ఎంతో ప్రశంసించేవారని వ్యాఖ్యలు ఆయన సంగీతంలో జీవించే ఉంటారని ఉద్ఘాటన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల ఈ లోకాన్ని విడిచివెళ్లడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ గాయకుడు శంకర్ మహాదేవన్ ఓ...

03 Jan 2021

ఎంజీఆర్ కు ఇస్తారు కానీ, ఎన్టీఆర్ కు ఎంద...

ఎంజీఆర్ కు ఇస్తారు కానీ, ఎన్టీఆర్ కు ఎందుకివ్వరు?:...

ఓ మీడియా చానల్ కు నారాయణమూర్తి ఇంటర్వ్యూ దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తారని వెల్లడి మొదటి నుంచి వివక్ష ఉందని వ్యాఖ్యలు వివక్ష పోవాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాలని స్పష్టీకరణ కేసీఆర్ నాయకత్వంలో పార్టీలు ఏకం కావాలని పిలుపు సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు తీసే అభ్యుదయవాది, నటుడు ఆర్.నారాయణమూర్తి ఓ మీడియ...

20 Dec 2020