కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!!

కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!!

కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!!

సీఎస్ విషయంలో సీఎం జగన్ పై విరుచుకుపడుతున్నదల్లా బీజేపీ, టీడీపీ నాయకులే. నిజానికి పరిపాలనా సంబంధమైన నిర్ణయాల్లో జాప్యం ఒక్కటే సీఎస్ బదిలీకి కారణం కాకపోవచ్చని కొందరు ఉన్నత స్థాయి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు సీఎస్ గా ఎల్వీ గార్ని నియమించింది ఈసీయే అయినా అప్పటినుంచే పావులు కదుపుతున్నది బీజేపీయే అన్నది స్పష్టం అవుతోంది.


అధికారుల మీద కన్నెర్ర చేస్తూ మాట్లాడే చంద్రబాబు పాలనకు విరుద్ధంగా అన్నా అంటూ అందరినీ పిలిచే సీఎం జగన్ తీరు ఐఎఎస్, ఐపీఎస్ల మెప్పు పొందింది. సీఎస్వీ బదిలి వార్త రాగానే ముందుగా స్పందించింది బీజేపీ నేతలే. దాంతోపాటే ఆయనకు కేంద్ర సర్వీసులకు పిలుపు ఉంటోందని లీకులు ఇచ్చారు. ఐదునెలల పదవీ కాలం ఉన్న ఎల్వీకి కేంద్రంలో బాధ్యతలు అప్పగించడం ద్వారా సర్వీసు పొడిగింపు అవకాశాలున్నాయి. బీజేపీ నాయకులతో ఎల్వీ సాన్నిహిత్యం గురించి వస్తున్న వార్తల్లో నిజానిజాలు తేలాల్సి ఉంది. అదే నిజమైతే రాష్ట్రానికి ఆయన చేసింది తీరని ద్రోహమే అవుతుంది.


సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న సమయంలో చంద్రబాబు ఎల్వీపై ఎంతటి వ్యతిరేకత ప్రదర్శించాడో మర్చిపోలేం. నేడు సీఎస్ బదిలీకి కుల, మతాల రంగు పూస్తున్న ఐవైఆర్ కృష్ణారావు గారిని చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి ఎంతో బాధాకరంగా తప్పించిన తీరు కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఎల్వీ గారి విషయంలో అలాంటి అవమానకర అంశాలేవీ జరగలేదు. కానీ ఈ అంశాన్ని వైయస్ జగన్ ని బ్రాహ్మణ ద్వేషి చిత్రించేందుకు బీజేపీ, టీడీపీ తెగ ఉబలాటపడుతున్నాయి. అందుకు ఆర్ఎస్ఎస్ భావసామీప్యులు, బీజేపీ ఆశ్రితులైన కొందరు సాయం కూడా చేస్తున్నారు.


ఇదే సీఎం జగన్ తిరుమలలో అన్యమతస్తులు ఉద్యోగం చేయకూడదని నిర్ణయం చేసాడు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసాడు. చంద్రబాబు కూల్చిన ఆలయాలు తిరిగి నిర్మించేందుకు పూనుకున్నాడు. పూజారుల వేతనాల పెంపు చేసాడు. ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు బడ్జెట్ కేటాయించాడు. అర్చకుల వంశపారంపర్య హక్కును కాపాడాడు. తాజాగా రమణదీక్షితులు గారిని ఆగమ సలహాదారుగా నియమించారు. త్వరలో ఆయన ప్రధానార్చక బాధ్యతలను తిరిగి పొందుతారని కూడా అంటున్నారు. అలాంటి వ్యక్తిపై బురద చల్లాలని కమలనాథులు ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఇక రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న సీనియర్ ఉన్నతాధికారులకు కేంద్ర సర్వీసులు, సర్వీసు పెంపుల ఆశ చూపడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ పెద్దలు నడుపుతున్న కుట్రలనే భావించాలి. ఇంటిలిజెన్స్ ద్వారా ఈ విషయాలపై నివేదిక అందుకునే సీఎం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. పాచిక పారకపోవడంతో బీజేపీ నేతల అసహనం, ఆక్రోశం వారి తీరులో బయటపడుతోంది.


PostedOn: 08 Nov 2019 Total Views: 180
'ట్రంప్‌...కుక్క మలమూత్రాలు పూసుకుంటాడు'

'ట్రంప్‌...కుక్క మలమూత్రాలు పూసుకుంటాడు'

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పీకర్‌ నాన్సీ పెలోసీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా పెలోసీ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌.. కుక్క మలమూత్రాలు పూసుకు తిరిగే పిల్లాడు లాంటి వాడని వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్‌ ఎంఎస్‌ఎన్‌బిసి టెలివిజన్‌ హోస్ట్‌ జియో స్కార్‌బరో ...

21 May 2020

కరెంట్‌ ఛార్జీలు పెంచే సమయమా ఇది: చంద్రబ...

కరెంట్‌ ఛార్జీలు పెంచే సమయమా ఇది: చంద్రబాబు ధ్వజం

హైదరాబాద్‌: ప్రజలు కరోనా తెచ్చిన కష్టాలతో అల్లాడుతుంటే వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కరెంట్‌ బిల్లులు పెంచడం దారుణమని ప్రతిపక్ష నేత ఎన్‌.చంద్రాబు నాయుడు ధ్వజమెత్తారు. దేశంలో డిస్కమ్‌లకు కేంద్రం 90 వేల కోట్ల రాయితీలిస్తే వైస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం కరెంట్‌ ఛార్జీలు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ప్రజల...

19 May 2020

దేవినేని అతి తెలివి చూపిస్తున్నాడా ?

దేవినేని అతి తెలివి చూపిస్తున్నాడా ?

ఇరిగేషన్ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అతి తెలివి చూపిస్తున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. దేవినేని వైఖరి ఎలాగుందంటే కిందపడ్డా తమదే పై చేయి అన్నట్లుగా ఉంది ఆయన మాటలు. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు అనే అంశంపై మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు దేవినేని కి మధ్య వివాదం జరుగుతున్న విషయం అం...

18 May 2020

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం మహారాష్ట్ర శాసనమండలి సెంట్రల్‌హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మండలి ఛైర్మన్‌ ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉద్ధవ్‌ థాక్రే సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్య థాక్రే కూడా హాజరయ్యారు. ఎమ్మెల్...

18 May 2020

మాట నిలకడ - రాజకీయాల్లో కొందరికే సాధ్యం.

మాట నిలకడ - రాజకీయాల్లో కొందరికే సాధ్యం.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కి ట్రేడ్ మార్క్ గా నిలిచిన "మాట తప్పను మడమ తిప్పను" అనే మాటనే, తన మాటగా కూడా మలుచుకొని రాజకీయ బరిలో దిగిన జగన్, దశాబ్ద కాల పోరాటం తర్వాత అధికారాన్ని చేపట్టి ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి హామీ అమలు చేస్తూ తన తండ్రి విశ్వసనీయతని కూడా వారసత్వంగా కొనసాగిస్తున్నాడని చెప్పొచ్చు....

15 May 2020

పోతిరెడ్డిపాడు మీద జగన్ కు మద్దతుగా ఆంధ్...

పోతిరెడ్డిపాడు మీద జగన్ కు మద్దతుగా ఆంధ్రా ప్రతిపక...

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్కీమ్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీరివ్వాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిసైడ్ అయ్యింది. ఇందుకోసం జీవో 203 జారీ కూడా చేసింది. ఎప్పుడైతే జీవో జారీ అయ్యిందో వెంటనే తెలంగాణా సిఎం కేసీయార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణ...

14 May 2020

విజయ సాయిరెడ్డి పై వక్రభాష్యమేలా..

విజయ సాయిరెడ్డి పై వక్రభాష్యమేలా..

విజయసాయిరెడ్డి ఏమయ్యారు.. ఎందుకు మౌనంగా ఉన్నారు..అసలు ఎటు పోయారు..జగన్ కి సాయిరెడ్డికి చెడిందా.. అందుకే ఆయన్ని హెలికాప్టర్ ఎక్కకుండా అడ్డుకున్నారా.. ప్రమాదం జరిగిన పరిశ్రమలో సాయిరెడ్డి మనుషులున్నారా.. భారతీ పాలిమర్స్ కి, ఎల్జీ సంస్థకు ఉన్న బంధమేమిటి.. ఇలా ఒక్కటి కాదు..అనేక ఆరోపణలు చంద్రబాబు & కో చేయ...

12 May 2020

ఎల్జీ పాలిమర్స్ తో బాబు అనుబంధం ఈనాటిది ...

ఎల్జీ పాలిమర్స్ తో బాబు అనుబంధం ఈనాటిది కాదు!

ఒకనాడు తాను ముఖ్యమంత్రిగా కన్నా సీఈవో అని చెప్పుకోవడానికే ఇష్టపడతానని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో వివిధ కార్పోరేట్ కంపెనీలకు అన్నీ అడ్డంకులు తొలగించేలా మార్పులు తీసుకొచ్చారు. చివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో నిబంధనలు సడలించి వివిధ ప్రమాకర పరిశ్రమలకు కూడా అనుమతిచ్చిన ఘనత దక్కించుకున్నారు. ఇప్...

09 May 2020