ఒకే వేదికపై రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి!

ఒకే వేదికపై రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి ...
హైదరాబాద్ సిటీ : ఆ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. ఇద్దరూ ఎంపీలే, కీలక నేతలు కూడా.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఒక్కటంటే ఒక్కటీ లేవు.. అంతేకాదు చివరికి ఒకే పదవి కోసం ఇద్దరూ శాయశక్తులా యత్నించారు. వారిలో ఒకరు సక్సెస్ కాగా.. ఇంకొకరు ఫెయిల్ అయ్యారు. అయితే అప్పట్లో ఫెయిల్ అయిన ఆయన ఇక కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేస్తారేమో అని అభిమానులు, అధిష్టానం కూడా అనుకున్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదండోయ్.. ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న వీరు ఇప్పుడు కలిసిపోయారు.. ఈ సన్నివేశం చూసిన జనాలు, కాంగ్రెస్ అధిష్టానం సైతం ఒకింత ఆశ్చర్యపోయింది. అసలు ఈ సందర్భమేంటి..? వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.. కాంగ్రెస్‌లో నూతనోత్సాహం..! వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ, రేపు ధర్నాచౌక్‌లో ‘వరి దీక్ష’ చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. అయితే.. ఈ దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ ఒకరంటే ఒకరికి పడని.. ఒక్కసారీ మాట్లాడుకోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు... కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది. ఫలించిన వీహెచ్ మంత్రాంగం.. వాస్తవానికి టీపీసీసీ చీఫ్‌ కోసం విశ్వప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి.. ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎడమొహం.. పెడమొహంగా ఉన్న ఈ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఒకే తాటిపైకి తీసుకురావడానికి సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకట్రెండు సందర్భాల్లో వీహెచ్ ఫెయిల్ అయినప్పటికీ.. ఇవాళ వరి దీక్షతో కోమటిరెడ్డి-రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. దీంతో వీహెచ్ మంత్రాంగం ఫలించినట్లయ్యింది. అయితే ఇద్దరూ కలిసిపోయినట్టేనా..? లేకుంటే దీక్ష ముగిసే వరకు మాత్రమే ఇలా కలిసుంటారా..? అనేది ప్రశ్నార్థకమే. ఇకపై ఇలాగే ఉంటారా..!? పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ నియామకం పట్ల అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి.. సందర్భం దొరికినప్పుడలా దానిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి రేవంత్‌తో కలిసి ఆయన వేదికను పంచుకోవడం.. ఇద్దరూ కలిసి అభివాదం చేయడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే ఇవాళ దీక్ష కాబట్టి ఇలా మాట్లాడుకున్నారు సరే..? మున్ముందు పార్టీ కార్యక్రమాల్లో ఇలాగే పాల్గొంటారో లేదో..? ఈ దీక్ష అయ్యాక ఎవరి దారిన వాళ్లుంటారా.. లేదా ఇలాగే కలిసుంటారా..? అనేది వేచి చూడాల్సిందే మరి.

PostedOn: 27 Nov 2021 Total Views: 116
గ్రేటర్ హైదరాబాద్ రూపశిల్పి వైఎస్ రాజశేఖ...

గ్రేటర్ హైదరాబాద్ రూపశిల్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ రాజాశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లాల పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న 12 మున్సిపాలిటీలను పాత ఎంసీహెచ్ లో విలినం చేసి గ్రేటర్ హైదరాబాద్ ను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుంది. జ...

25 Jan 2022

YSR తెలంగాణ పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ల...

YSR తెలంగాణ పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ల ఎంపిక

YSR తెలంగాణ పార్టీలో భారీగా మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను YSR తెలంగాణ పార్టీ రద్దు చేసింది. అయితే కొత్తగా ఎన్నుకున్న వారిలో ఎక్కువగా బీసీలనే నియమించడంపై ఆ పార్టీ నాయకుల్లో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు సరైన అవకాశం లేక ఇప్పటికీ వెనుకబడే ఉన్నారని పలువురు నాయకుల...

25 Jan 2022

2024లో బీజేపీని ఓడించ‌వ‌చ్చు : ప్ర‌శాంత్...

2024లో బీజేపీని ఓడించ‌వ‌చ్చు : ప్ర‌శాంత్ కిషోర్‌

కేంద్రంలో బీజేపీని 2024 ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని, అందుకు తగిన ప్రతిపక్షం ఏర్పాటుకు తాను సహాయపడతానని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా రాకపోయినా ఇది సాధ్యమేనన్నారు. సోమవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న ...

25 Jan 2022

YSR తెలంగాణ పార్టీలో భారీ మార్పులు

YSR తెలంగాణ పార్టీలో భారీ మార్పులు

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని కమిటీలను రద్దు చేసినట్టు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగా YSR తెలంగాణ పార్టీ జిల్లా కో ఆర్డినేటర్లను ప్రకటించారు. దీంతో ఆ పార్టీలో భారీగా మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా కో-ఆర్డినేటర్ల వివరాల...

24 Jan 2022

ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ షాకింగ్ నిర్ణ‌యం

ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ షాకింగ్ నిర్ణ‌యం

ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) భారీ షాక్ ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించింది. ఈసీ శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, నిపుణులు, ఎన్నికలు జరిగే ఐదు రాష...

22 Jan 2022

ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ షాకింగ్ నిర్ణ‌యం

ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ షాకింగ్ నిర్ణ‌యం

ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) భారీ షాక్ ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించింది. ఈసీ శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, నిపుణులు, ఎన్నికలు జరిగే ఐదు రాష...

22 Jan 2022

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి భారీ జరిమానా...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి భారీ జరిమానా..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దంపతులకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని విజయవాడ కోర్టు తీర్పు నిచ్చింది. లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీ లక్ష్మీ గతంలో గృహ హింస కేసు పెట్టారు. విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు గృహ హింస కేసు రుజువైనట్టు ఆదేశాల...

21 Jan 2022

ముందస్తు ఎన్నికలు..?

ముందస్తు ఎన్నికలు..?

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీకి రానున్న ఎన్నికలు కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ 8నెలలు ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ లోనే ఎన్నికలకు సిద్ధమౌతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో...

21 Jan 2022