గ్రేటర్ హైదరాబాద్ రూపశిల్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ రూపశిల్పి వైఎస్ రాజశేఖ...
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో వైఎస్ రాజాశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లాల పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న 12 మున్సిపాలిటీలను పాత ఎంసీహెచ్ లో విలినం చేసి గ్రేటర్ హైదరాబాద్ ను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించిన గొప్ప నాయకుడు వైఎస్సార్. దేశంలో ఎక్కడా లేని విధంగా శంషాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు నిర్మించింది వైఎస్సార్ గారే. జంట నగరాల్లోని మంచి నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం.. లగ్జరీ జర్నీ కోసం మెట్రో రైలు తీసుకువచ్చింది వైఎస్సార్. వైఎస్సార్ సిఎంగా ఉన్న సమయంలో ఐటీ కంపెనీలు హైదరాబాద్ వచ్చాయి. యువతకు ఐటీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఓల్డ్ సిటీ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసి పాతబస్తీ అభివృద్ది కోసం కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన ఘనత వైఎస్సార్ గారికే దక్కుతుంది. పేద విద్యార్థులకు పెద్ద చదువులు చదివేందుకు డబ్బు ఇబ్బంది కావద్దని ఫీజు రియంబర్స్ మెంట్ కల్పించిన ఘటన వైయస్ఆర్ గారికే దక్కుతుంది. మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ గారిదే. అన్ని వర్గాలకు వైయస్ఆర్ గారి పాలనలో న్యాయం జరిగింది. ఇలా చెప్పుకుంటు పోతే హైదరాబాద్ అభివృద్దిలో వైఎస్సార్ పాత్ర ఎంతో ఉంది. శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం, ఐదు జిల్లాలతో హెచ్ఎండీఏ ఏర్పాటు, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే, కృష్ణా రెండవ దశ మంచినీటితో పాటు మూసీనది శుద్ధీ, హైదరాబాద్ లో ఐటీని విశ్వవ్యాప్తం చేసింది వైయస్ఆర్ గారే. 2008లో ఐటీ ఎగుమతులు 32,509 కోట్ల రూపాయలకు చేరటం విశేషం. హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న 4 జిల్లాలలోని 849 గ్రామాల్లో హెచ్ ఎండీఏ మాస్టర్ ప్లాన్ ను వైయస్ఆర్ గారు నిర్ధేశించడంతోనే ఈ రోజు నగరమంతటా భూములకు విలువ పెరిగింది. సాగర్ ప్రక్షాళనకు వైయస్ఆర్ గారు రూ.370 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టగా ఆయన మరణాంతరం పనులు ముందుకు సాగలేదు. ఆ రోజుల్లోనే వైయస్ఆర్ గారు చూపిన శ్రద్ధ వల్లే 8లక్షల నీటి కనెక్షన్లకు తాగునీరు సరఫరా అయ్యింది. వైయస్ఆర్ హయాంలోనే మెట్రోకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 72 కిలో మీటర్ల మేర పనులు చేపట్టేందుకు వైయస్సార్ హయాంలోనే 2008లో పునాదులు పడ్డాయి. దీంతో గ్రేటర్ లో ప్రజలకు కొంతమేర ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.

PostedOn: 25 Jan 2022 Total Views: 137
దళిత కుటుంబానికి YSR తెలంగాణ పార్టీ మదిర...

దళిత కుటుంబానికి YSR తెలంగాణ పార్టీ మదిర నాయకులు క...

కేసీఆర్ సర్కారులో ఇబ్బందులు పడుతున్న దళితులకు YSR తెలంగాణ పార్టీ నాయకులు భరోసాను కల్పిస్తున్నారు. మదిర నియోజకవర్గంలో 18 ఏండ్లుగా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి YSR తెలంగాణ పార్టీ నాయకులు కేకేడీ గారు సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఇంటికి కరెంటు సౌకర్యార్థం మీటరు, రెండు లైట్లు, ఒక ఫ్యాన్ ను ఏర...

20 May 2022

ప్ర‌ధాని మోదీపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌...

ప్ర‌ధాని మోదీపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విమర్శలు గుప్పించే కేటీఆర్.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు....

02 May 2022

ఇక పీకేకు టీఆర్ఎస్‌కు సంబంధం ఉండ‌దు : రే...

ఇక పీకేకు టీఆర్ఎస్‌కు సంబంధం ఉండ‌దు : రేవంత్ రెడ్డ...

టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కేసీఆర్‌ను కలిశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌తో పీకే భేటీపై సోమవారం మీడియతో మాట్లాడుతూ.. ఇక ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. ఐప్యాక్‌కు పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని తెలి...

25 Apr 2022

గ‌వ‌ర్న‌ర్‌పై మంత్రి త‌ల‌సాని సంచ‌ల‌న వ్...

గ‌వ‌ర్న‌ర్‌పై మంత్రి త‌ల‌సాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

గవర్నర్‌ తమిళిసై రాజకీయాలు మాట్లాడుతున్నారని.. ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావని.. మేము నామినేటెడ్‌ వ్యక్తులం కాదని మంత్రి ...

20 Apr 2022

కొలువుదీరిన ఏపీ కొత్త మంత్రివ‌ర్గం

కొలువుదీరిన ఏపీ కొత్త మంత్రివ‌ర్గం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్...

11 Apr 2022

ఖ‌మ్మంలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన వైయ...

ఖ‌మ్మంలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన వైయ‌స్ ష‌ర్మి...

ఖమ్మం జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఖమ్మం జిల్లా, తిరుమలయపాలెం మండలం, కాకరవాయి సభలో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాదని, బాధల తెలంగాణ అని, బార్లు, బీర్లు, ఆత్మహత్యల తెలంగాణగా మారిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ...

04 Apr 2022

స‌భ్య‌త్వ న‌మోదులో రాజ‌కీయ పార్టీల జోరు

స‌భ్య‌త్వ న‌మోదులో రాజ‌కీయ పార్టీల జోరు

రాష్ట్రంలో దాదాపు సగం మంది ఓటర్లు ఏదో ఒక రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. కొందరు ఇష్టంగా, మరికొందరు సన్నిహితుల ఒత్తిడితో ఏదో ఒక పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. రాజకీయ చైతన్యం ఉరకలు వేయడం, పార్టీలు పోటాపోటీగా సభ్యత్వాలను నమోదు చేయిస్తుండటమే ఇందుకు కారణం. తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా వర...

01 Apr 2022

ట్విట్ట‌ర్‌లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వ...

ట్విట్ట‌ర్‌లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు రేవం...

తెలంగాణ రాజకీయాల్లో ట్వీట్ల వార్‌ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ నేతలు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్ప...

29 Mar 2022