దేవినేని అతి తెలివి చూపిస్తున్నాడా ?

దేవినేని అతి తెలివి చూపిస్తున్నాడా ?
ఇరిగేషన్ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అతి తెలివి చూపిస్తున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. దేవినేని వైఖరి ఎలాగుందంటే కిందపడ్డా తమదే పై చేయి అన్నట్లుగా ఉంది ఆయన మాటలు. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు అనే అంశంపై మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు దేవినేని కి మధ్య వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు 70 శాతం పనులు కాకుండానే అయిపోయినట్లు టిడిపి చెప్పుకుంటోందంటూ అనీల్ ఆరోపించారు. 70 శాతం పనులు పూర్తయినట్లు నిరూపిస్తే తాను మీసాలు తీసేస్తానంటూ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. దేవినేని చెప్పుకుంటున్నట్లు 70 శాతం పనులు చేయలేదని నిరూపిస్తే మాజీ మంత్రి మీసాలు తీసేస్తాడా ? అంటూ సవాలు విసిరారు. దానికి దేవినేని సమాధానమిస్తు సాగునీటి సమీక్షలో పోలవరంలో 71.43 శాతం పనులు పూర్తియినట్లు గుర్తించలేదా ? అంటూ నిలదీశాడు. అలాగే టిడిపి ఎంపి కేశినేని నాని అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో సమాధానమిస్తు పోలవరంలో 69.54 పనులు పూర్తయినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పిన సమాధానాన్ని గుర్తుచేశాడు. ఇక్కడే దేవినేని అతితెలిలవి బయటపడుతోంది. పోలవరంలో 70 శాతం పనులు పూర్తవ్వలేదని మంత్రి కూడా అనలేదు. కాకపోతే పూర్తియిన 70 శాతం పనుల్లో టిడిపి చేసిందెంత అనేదే ఇక్కడ ప్రశ్న. 2014లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చేనాటికే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అంటే 2014కు ముందు పోలవరంలో అయిన పనులెంత ? 2014-19లో చంద్రబాబు హయాంలో జరిగిన పనులెంత ? అన్నదే ప్రధాన ప్రశ్న. గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు హయాంలో జరిగిన పనులే టిడిపి చేసినట్లు లెక్క. పార్లమెంటులో మంత్రి చెప్పినా, సాగునీటి సమీక్షలో అధికారులు చెప్పినా 70 శాతం పనులు అయ్యాయని చెప్పారంటే అయిన పనులు ఎంత అన్నపుడు వచ్చిన లెక్కది. అంతేకానీ జరిగిన 70 శాతం పనులు కేవలం 2014-19 మధ్యే జరిగినట్లు కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇతరులు చేపట్టిన పనులు కూడా తన ఖాతాలో వేసేసుకోవటం చంద్రబాబుకున్న అలవాటు. రాష్ట్ర విభజనకు ముందే ఉద్యోగులకు 43 శాతం పిఆర్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. విభజన జరిగిన తర్వాత ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించిన చంద్రబాబు 43 శాతం పిఆర్సీ ఇచ్చినట్లు ప్రకటించుకున్నాడు. నిజానికి 2014కు ముందే 2009లో సిఎం అయిన రోశయ్య 14 శాతం ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మరో 15 శాతం ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సిఎం అయిన చంద్రబాబు మిగిలిన 14 శాతం ప్రకటించారు.తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మరో 15 శాతం ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సిఎం అయిన చంద్రబాబు మిగిలిన 14 శాతం ప్రకటించారు. అంటే చంద్రబాబు 14 శాతం మాత్రమే ఇచ్చి మొత్తం 43 శాతం తానే ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకున్నారు. ఇపుడు పోలవరంలో అయిన పనులు కూడా ఇలాగే క్లైం చేసుకుంటున్నారు.

PostedOn: 18 May 2020 Total Views: 69




పబ్లిసిటీ ఆపి..ఉద్యోగాలు కల్పించండి

పబ్లిసిటీ ఆపి..ఉద్యోగాలు కల్పించండి

యోగి సర్కార్‌పై ప్రియాంక సూచన న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగాలు కోల్నోయిన కారణంగా ఒక జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె యుపిలోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రచారం కోసం పబ్లిసిటీ స్టంట్‌లు ఆపి ప్రజల స...

23 Jun 2020

జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రులు ఆ ఇద్దర...

జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రులు ఆ ఇద్దరేనా..?

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంలో పని చేస్తున్న పిల్లి సుభాస్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఎంపికవ్వడంతో ఆ రెండు స్థానాలను భర్తీ చేయాలని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి భావిస్తున్నారు. ఈనెలాఖరులోగా కొత్త మంత్రుల ఎంపిక ఉంటుందంటూ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు సమాచారమిచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి ఎంపి...

23 Jun 2020

చంద్రబాబుకు అనుమతివ్వని జైళ్ల శాఖ

చంద్రబాబుకు అనుమతివ్వని జైళ్ల శాఖ

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయి అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. కరోనా నిబంధనల ప్రకారం అచ్చెన్నాయుడిని పరామర్శి...

13 Jun 2020

ఖైదీ నెంబర్ 1573 కేటాయించిన జైలు అధికారు...

ఖైదీ నెంబర్ 1573 కేటాయించిన జైలు అధికారులు

పైల్స్ తో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని హాస్పిటల్ తరలించిన పోలీసులు . పరామర్శించటానికి వస్తున్న బాబు . ESI కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిర్ధారించి నిన్న ఉదయం అరెస్ట్ చేసిన మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుని రాత్రికి విజయవాడ ఏసీబీ ఆఫీసుకి తరలించడం తెలిసిందే . అయితే పైల్స్ తో బాధపడుతూ ఇటీవలే ఆపరేషన్ ...

13 Jun 2020

ఇవి అక్రమ అరెస్టులైతే...మీ పాలనలో జరిగిన...

ఇవి అక్రమ అరెస్టులైతే...మీ పాలనలో జరిగినవేంటీ చంద్...

అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు చేసిన తమ నేతలను పార్టీ నేతలను వెనకేసుకురావడంలో టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు‌ దేశంలో మరెవ్వరూ సాటిరారు. ఎంత అవినీతి చేసినా...ఎన్ని అక్రమాలు చేసినా ఫర్వాలేదు. ప్రజలను ఎలా దోచుకున్నా ఫర్వాలేదు. కాని పార్టీతోనే ఉండాలి. అవినీతి అక్రమాలు చేసైనా పార్టీని నిలబెట్టాల...

13 Jun 2020

మరోసారి జైలుకు చింతమనేని ప్రభాకర్‌

మరోసారి జైలుకు చింతమనేని ప్రభాకర్‌

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ మరోసారి జైలుపాలయ్యారు. నిన్న టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టను నిరసిస్తూ చింతమనేని ప్రభాకర్‌ ధర్నాకు దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. అనుమతి లేకుండా ధర్నా చేసిన చింతమనేని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు...

13 Jun 2020

150 కోట్ల అక్రమాలు.. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చ...

150 కోట్ల అక్రమాలు.. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ...

అమరావతి : ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిమ్మాడలో ఇవాళ ఉదయం 7:30 గంటలకు ఏసీబీ అధికారులు.. ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ఈ కేసులు అచ్చెన్నాయుడితో పాటు ఆరుగురిని అరెస్టు చేశామని తె...

12 Jun 2020

ఆరని ఆగ్రహజ్వాల అమెరికావ్యాప్తంగా కొనసాగ...

ఆరని ఆగ్రహజ్వాల అమెరికావ్యాప్తంగా కొనసాగిన విధ్వంస...

అధ్యక్ష భవనానికీ తాకిన సెగ ప్రధాన నగరాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ 1669 మంది అరెస్టు మిన్నెపొలిస్‌, మే 31: అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఆదివారం దేశంలోని మరిన్ని రాష్ర్టాలు, నగరాలకు హింసాకాండ విస్తరించింది. పోలీసులకు తోడు నేషనల్‌ గార్డ్స్‌ కూడా రంగంలోకి దిగినప్పటికీ ఆందోళనలు ఏమాత్...

01 Jun 2020