శాస‌న‌స‌భ‌ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

శాస‌న‌స‌భ‌ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 3 నియోజకవర్గాలకు, ఒడిశాలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలను నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరుగుతుందని, ఓట్ల లెక్కింపు అక్టోబరు 3న జరుగుతుందని ఈసీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవవలసిన అవసరం ఉంది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. పశ్చిమ బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలకు; ఒడిశాలోని పిప్లీ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఈ నెల 30న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు అక్టోబరు 3న జరుగుతుంది. సెప్టెంబర్ 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13. ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా 32 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. ఉప ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, అస్సాం, బిహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు; దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ అడ్వయిజర్ తమ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. పండుగలు, వరదలు, కోవిడ్-19 మహమ్మారిని కారణాలుగా చూపారు. పండుగ సమయం దాటిన తర్వాత ఉప ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లోని బద్వేలు, తెలంగాణాలోని హుజూరాబాద్ శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. తమ రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి అదుపులో ఉందని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈసీకి లేఖలు శారు. వరదల వల్ల ఉప ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు.

PostedOn: 04 Sep 2021 Total Views: 76
మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ ...

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ : మంత్రి స...

హైదరాబాద్: మహిళల రక్షణలో తెలంగాణ నంబర్ వన్‌ స్థానంలో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజారాహిల్స్ మిథాలి నగర్లో సఖీ సెంటర్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇతర రా...

22 Oct 2021

ప్ర‌జా వ్య‌తిరేక‌త‌లో దేశంలోనే నెంబ‌ర్‌ ...

ప్ర‌జా వ్య‌తిరేక‌త‌లో దేశంలోనే నెంబ‌ర్‌ వ‌న్‌ కేసీ...

న్యూఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని ఐఏఎన్‌ఎస్ (ఇండో-ఏసియన్‌ న్యూస్‌ సర్వీస్‌), సీ-ఓటర్‌ సర్వే వెల్లడించింది. అన్ని రాష్ట్రాల సీఎంలలో.. ప్రజాగ్రహం అధికంగా ఉన్న సీఎం ఆయనేనని ‘పరిపాలన సూచీ’ పేరిట తాజా సర్వేలో తేలిందని ...

20 Oct 2021

త్వ‌ర‌లో ఈట‌ల‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస...

త్వ‌ర‌లో ఈట‌ల‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారు : కే...

హైదరాబాద్: హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్...

19 Oct 2021

హుజూరాబాద్ ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కు ద‌ళి...

హుజూరాబాద్ ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కు ద‌ళితబంధుకు బ్...

హైదరాబాద్‌/కరీంనగర్‌: ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఉప ఎన్నిక ముగిసేదాకా ఈ నియోజకవర్గ పరిధిలో అన్ని రూపాల్లోనూ దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం ఆదేశించింది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమల...

19 Oct 2021

రేపు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల !

రేపు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల !

వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయ రానున్నారు. చేవెళ్ల నుంచి ప్రారంభించే పాదయాత్రకు ఆమె తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సుల కోసం ఇడుపులపాయ రానున్నారు. వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రకటన చేసి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20...

18 Oct 2021

టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి మోత్కుపల్లి...

టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహుల...

హైదరాబాద్: మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మోత్కుపల్లిపై ప్రశంసలు కురిపించారు. మోత్కుపల్లికి రాజకీయ అనుభవం ఎంతో ఉందని కొనియాడారు. మోత్కుపల్లి తనతో కలిసి ఎన్నో ఏళ్లు పనిచేశారని గుర్తు...

18 Oct 2021

హుజూరాబాద్‌లో ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ...

హుజూరాబాద్‌లో ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువ...

హైదరాబాద్‌/హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. జమునతో సహా మొత్తం 12 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిప...

14 Oct 2021