8 ఏళ్ళలో పోలవరంకు ఇచ్చింది 11182 కోట్లు

8 ఏళ్ళలో పోలవరంకు ఇచ్చింది 11182 కోట్లు
పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం 11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్‌ పనులకు మాత్రమే ఈ నిధుల విడుదల జరిగినట్లు ఆయన తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునఃనిర్మాణం పనులతోపాటు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మొత్తం 55 వేల 657 కోట్లు ఖర్చవుతుందని సవరించిన అంచనాలు చెబుతుంటే ఎనిమిదేళ్ళ వ్యవధిలో కేంద్రం ఇచ్చింది కేవలం 11,182 కోట్ల రూపాయలు మాత్రమేనని మంత్రి తెలిపిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. రాజధాని నగరం(అమరావతి)లో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం 2014 నుంచి 2017 మధ్య కాలంలో కేంద్ర సహాయం కింద 2,500 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర గ్రాంట్‌ కింద 2014 నుంచి ఇప్పటి వరకు 1750 కోట్లు విడుదల అయ్యాయి. వనరుల మధ్య ఏర్పడిన వ్యత్యాసాన్ని పూడ్చేందుకు 2014 నుంచి 2017 మధ్య కాలంలో ప్రత్యేక సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3979 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం కింద ఇచ్చిన హామీలలో భాగంగా నెరవేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల వివరాలను కూడా మంత్రి సవివరంగా తన జవాబులో పొందుపరచారు. ఏప్రిల్‌ 2018 నుంచి మార్చి 2019 వరకు రాష్ట్రంలో 88 కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల అమలు కోసం 10,632 కోట్ల రూపాయలు విడదలైనట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు రాష్ట్రంలో 84 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం 11,112 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2021 వరకు 79 కేంద్ర పథకాల అమలు నిమిత్తం 12,904 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఏప్రిల్‌ 2021 నుంచి జూలై 2021 వరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న 31 కేంద్ర పథకాల కోసం 1,794 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

PostedOn: 23 Jul 2021 Total Views: 87
శాస‌న‌స‌భ‌ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

శాస‌న‌స‌భ‌ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 3 నియోజకవర్గాలకు, ఒడిశాలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలను నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరుగుతుందని, ఓట్ల లెక్కిం...

04 Sep 2021

ద‌ళితుల‌పై కేసీఆర్ ప్రేమ హుజూరాబాద్ ఎన్న...

ద‌ళితుల‌పై కేసీఆర్ ప్రేమ హుజూరాబాద్ ఎన్నిక‌ల మ‌హిమ...

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. ఏడెళ్ళలో అంబెడ్కర్ విగ్రహానికి కేసీఆర్ ఎప్పుడు దండ కూడా వేయలేదని... దొర ఇప్పుడు ఎందుకో పొర్లు దండాలు పెడుతున్నారని అన్నారు. సీఎంవోలో ఇప్పుడు దళిత ఆఫీసర్స్‌ను నెత్తిన పెట్టుకుంటున్నారన్నారు. ఎ...

04 Sep 2021

పోలవరం ప్రాజెక్ట్ లో కీలక ఘట్టం

పోలవరం ప్రాజెక్ట్ లో కీలక ఘట్టం

పోలవరం బహుళార్దక సాధక ప్రాజెక్టులో అత్యంతకీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులు వేగవంతం చేసింది ఎపి జెన్కో. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ పూర్తి చేసేలా పక్కాప్రణాళికతో పోలవరం ప్రాజెక్టు ఫలితాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు వడివడిగా అడుగులుపడుతున్నాయి. ప్రతి ఏడాది గోదావరి నది నుంచి మూడు వేల ట...

06 Aug 2021

అమరావతి భూముల కేసులో జగన్ సర్కార్ కీలక న...

అమరావతి భూముల కేసులో జగన్ సర్కార్ కీలక నిర్ణయం!

కొన్ని అంశాల్లో ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోవటం.. చకచకా ఆదేశాలు జారీ కావటం.. అనంతరం దాని మీద వెనక్కి తగ్గటం లాంటివి ఏపీలోని జగన్ సర్కారులో ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చే...

22 Jul 2021

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు గ్...

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్న...

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు ఎస్ ఈసీ గ్రీన్ సిగ్నల్ అందించింది. ఈనెల 25న ఉ.8 నుంచి కౌంటింగ్ ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించుకోవచ్చన్న డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఎస్ ఈసీ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వైరస్ నిబంధనలతో కౌంటింగ్ ప్రక్ర...

22 Jul 2021

విశాఖ, విజయనగరం తహసీల్దార్ కార్యాలయాల్లో...

విశాఖ, విజయనగరం తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడ...

పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ప్రతిపనికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖ, విజయనగరం జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో దాడులు చేసింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసింది ఏసీబీ. పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ప్రతిపనికి డబ్బులు వసూల...

21 Jul 2021

తెలంగాణ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం; ప్రపంచ...

తెలంగాణ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం; ప్రపంచ వ్యాప్తంగ...

తెలంగాణకు మణిహారంగా కాళేశ్వరంగా ప్రాజెక్టు నిలుస్తోంది. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టింది. ప్రపంచంలో కనివిని ఎరుగని రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే తెలంగాణ సర్కార్ నిర్మించింది. ప్రపంచ ప్రఖ్యాత కలిగిన మేఘా ఇంజనీరింగ్ లాంటి సం...

22 Jun 2021