తండ్రికి త‌గ్గ త‌న‌యుడు భ‌ద్రారెడ్డి

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు భ‌ద్రారెడ్డి
మాన‌వ‌త్వం లేని వైద్యం వ్యాపారంతో స‌మానం.. ఇదీ మంత్రి మ‌ల్లారెడ్డి త‌న కొడుకు భ‌ద్రారెడ్డికి త‌ర‌చూ చెప్పే మాట‌.. తండ్రి మాట‌ల‌కు అర్ధం తెలుసుకున్న కొడుకు- డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డి.. అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌ల‌య్యి చాలా కాల‌మే అయ్యింది.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రైనా పేద‌లు వైద్య సాయం కోసం వ‌స్తే.. మొద‌ట ఆయ‌న వారి ప‌ర్సు చూడ‌రు- ప‌ల్స్ చూస్తారు.. వారి గురించి వాక‌బు చేసి.. అందుకు త‌గిన ఉచిత వైద్య సాయ‌మందిస్తారు.. 2021 ఏప్రిల్ 17న మేడ్చ‌ల్ నివాసి.. మున్సిప‌ల్ సిబ్బంది అయిన డ‌బిల్ పుర ల‌క్ష్మి ప్ర‌మాద స‌మ‌యంలో ఇదే నిరూపిత‌మైంది. ల‌క్ష్మి విధులు నిర్వ‌హిస్తుండ‌గా.. ఆమెను ఒక టిప్ప‌ర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె ప్రాణాపాయ ప‌రిస్థితిని ఎదుర్కుంది.. ఆ వెంట‌నే ఆమెను ద‌గ్గ‌ర్లోని మ‌ల్లారెడ్డి ఆస్ప‌త్రికి చేర్చారు. అక్క‌డ ఆమె ప్రాణాల‌తో పోరాడుతుండ‌గా.. త‌గిన వైద్య సాయం అందాల్సి ఉంది. అప్ప‌టికే ఆమె ఆర్ధిక ప‌రిస్థితి అంతంత మాత్రం. ఈ విష‌యం గుర్తించిన మేడ్చ‌ల్ మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ దీపికా రెడ్డి.. ల‌క్ష్మి గురించి డాక్టర్ భ‌ద్రారెడ్డికి చెప్పారు. స‌మ‌స్య‌ను గుర్తించిన భ‌ద్రారెడ్డి- ఆమెకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. డ‌బ్బుక‌న్నా ప్రాణాలు మిన్న‌గా భావించి భ‌ద్రారెడ్డి అందించిన వైద్య సాయంతో కోలుకుంది డ‌బిల్ పుర ల‌క్ష్మి. అలా మ‌ల్లారెడ్డి ఆస్ప‌త్రిలో ఉచిత వైద్య సాయంతో కోలుకున్న ల‌క్ష్మి డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు. ఆమె కుటుంబ స‌భ్యులు కూడా భ‌ద్రారెడ్డికి త‌మ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వీరొక్క‌రే కాదు ఈ ప్రాంతంలోని చాలా మందికి భ‌ద్రారెడ్డి ఉదార‌త గురించి బాగా తెలుసు. మ‌రీ ముఖ్యంగా పేద‌లు ప్రాణాపాయం ఎదుర్కుంటే ఆయ‌న చూస్తూ ఊరుకోర‌ని అంటారు మేడ్చ‌ల్ నాలుగో వార్డు కౌన్సిల‌ర్ గ‌ణేష్. ఇలాంటి అనుభ‌వాలు త‌న‌కు చాలానే ఉన్నాయ‌ని అంటారు గ‌ణేష్. అన్నా క‌ష్టంలో ఉన్నా ఆదుకో అంటే భ‌ద్రారెడ్డి వెంట‌నే సాయం చేస్తార‌ని చెబుతారు స్థానిక టీఆర్ఎస్ నాయ‌కులు మ‌ర్రి న‌ర‌సింహారెడ్డి. గ‌తం గ‌తః భ‌ద్రారెడ్డి వ‌ర్త‌మాన సేవ‌ల గురించి చెప్పండీ అంటే అందుకు ఇదిగో మ‌ల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంట‌రే అతిపెద్ద ఉదాహ‌ర‌ణ‌. మ‌ల్లారెడ్డి ఆస్ప‌త్రి అనుబంధ విభాగంగా మ‌ల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంట‌ర్ ను ఏర్పాటు చేశారు భ‌ద్రారెడ్డి..ఈ సెంట‌ర్లో కోవిడ్ పేషెంట్ల‌కు గానూ 300 ప‌డ‌క‌ల‌తో ఉచిత వైద్య సాయం అందిస్తున్నారు.. భ‌ద్రారెడ్డి. ఇక్క‌డ చేరాలంటే పెద్ద క‌ష్టమేం కాదు. ఐసీఎంఆర్ ఆమోదం గ‌ల టెస్టుల‌తో ఇక్క‌డి హెల్ప్ సెంట‌ర్ కు కాల్ చేస్తే చాలు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ.. ఓట‌ర్- ఆధార్ వంటి గుర్తింపు కార్డుల‌తో ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్ లో నేరుగా చేరిపోవ‌చ్చు. 19- 60 ఏళ్ల మ‌ధ్య‌గ‌ల స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో కూడిన కోవిడ్ పాజిటివ్ గ‌ల రోగుల‌కు మ‌ల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంట‌ర్ ఓ సంజీవినిగా మారింది. మేడ్చ‌ల్ ప్రాంత వాసుల‌కు ఈ కేర్ సెంట‌ర్ ఒక వ‌రంగా చెప్పాలి. ఇక్క‌డ చేరిన వారికి ఇర‌వై నాలుగు గంట‌ల పాటు ఉచిత వైద్య సేవ‌ల‌ను అందిస్తున్నారు. రోజూ ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌న స‌దుపాయం క‌ల్పిస్తున్నారు. వీటితో పాటు ప్రైమ‌రీ మెడిసిన్ ఫ్రీగా అంద‌జేస్తున్నారు. అంతేనా ఆక్సిమీట‌ర్, ధ‌ర్మామీట‌ర్- శానిటైజ‌ర్- మాస్క్- స్టీమ్ ఇన్హెల‌ర్ వంటి వాటితో మెడికల్ కిట్లను సైతం అంద‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంత వాసుల‌కు మ‌ల్లారెడ్డి కోవిడ్ కేర్ సెంట‌ర్ అందిస్తున్న ఉచిత వైద్య స‌దుపాయాలు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతున్నాయి. ఇందుకు తాము మ‌ల్లారెడ్డి కుటుంబానికి ఎంత‌గానో రుణ‌ప‌డి ఉంటామ‌ని అంటారు స్థానికులు. కేవ‌లం ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో మాత్ర‌మే కాదు.. ఆర్ధిక అత్య‌యిక ప‌రిస్థితిలోనూ మ‌ల్లారెడ్డి కొడుకు భ‌ద్రారెడ్డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడ‌నిపిస్తాడు. పేద‌ల ఆక‌లి గుర్తించి వారికి ఆర్ధికంగా అండ‌దండ‌గా నిలుస్తున్నారు. ఇలా ఈ ప్రాంత వాసుల్లో మంత్రి మ‌ల్లారెడ్డి కొడుకు డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డి ప‌ట్ల ఎంతో గౌర‌వ భావం నెల‌కొని ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ ప్రాంతంలో మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యుల వైద్య ఆర్ధిక సేవ‌లు త‌మ‌కెంత‌గానో ఆదుకుంటున్నాయ‌ని ప్ర‌శంసిస్తున్నారు స్థానికులు. అందుకు భ‌ద్రారెడ్డి అధ్వ‌ర్యంలో త‌మ‌కు అందుతున్న ఉచిత కోవిడ్ వైద్య సేవ‌లే సాక్ష్య‌మ‌ని అంటున్నారు.

PostedOn: 12 May 2021 Total Views: 95
పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాసన పుత్రిక ‘పోలవరం’. ఆయన హయాంలో రూపుదాల్చుకున్న ఈ ప్రాజెక్టు సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో పరుగులు పెడుతోంది. ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం వచ్చింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదలకు శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. దీనిలో భాగంగా ఈసీఆర్ఎఫ...

11 Jun 2021

ఏపీకి ప్రభుత్వానికి 3 ఆక్సిజన్ ట్యాంకులు...

ఏపీకి ప్రభుత్వానికి 3 ఆక్సిజన్ ట్యాంకులు ఉచితంగా అ...

సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం • దుర్...

01 Jun 2021

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే ...

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే కదలుతున్న ...

గురివింద గింజ నలుపెరుగని‌ చందంగా నిమ్స్‌లో లో అధికారుల తీరుమారిపోయింది. మొత్తం 22వేల వ్యాక్సిన్ లలో 7 వేల వ్యాక్సిన్ లు అనర్హులకు వేసారనే అంశం లో నిజానిజాలు ఒక్కొక్కటి‌బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వున్న నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే అంశం లో విస్తుపోయే నిజాలు‌కూ...

29 May 2021

తమిళ ప్రజల కష్టాలకు మేఘా చెక్.. 3వేల ఆక్...

తమిళ ప్రజల కష్టాలకు మేఘా చెక్.. 3వేల ఆక్సిజన్ బెడ్...

• తమిళనాడు వ్యాప్తంగా 3000 పైగా కోవిడ్ పడకల ఆసుపత్రులు • గ్రేటర్ చెన్నైలోనే 1070 బెడ్లు • కేవలోం 72 గంటల్లోనే 500 బెడ్స్ ఆసుపత్రి ఏర్పాటు • తమిళనాడు ప్రభుత్వం, క్రెడాయ్, జి స్క్వేర్ రియల్టర్స్ సహాకారం దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తోంది. దేశంలో వివిధ రాష్ర్టాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వి...

27 May 2021

తొలిసారిగా మేఘా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట...

తొలిసారిగా మేఘా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల ది...

• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి • దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి • తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం దేశం...

22 May 2021

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం స...

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం...

కరోనా నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. కరోనా కట్టడికి తీసుకుం...

19 May 2021

పరుగులు పెడుతోన్న ఆంధ్ర జీవనాడి పోలవరం ప...

పరుగులు పెడుతోన్న ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు ...

యజ్ఞంలా సాగుతోన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనులు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలు, లోపాలు, అక్రమాలు-అవకతవకలు సరిచేస్తూనే సీఎం వైఎస్ జగన్ సర్కారు ముందుకు దూసుకెళ్తోంది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞం చేప...

11 May 2021