మేఘా సంస్థ దాతృత్వం.. ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్..

మేఘా సంస్థ దాతృత్వం.. ఆస్పత్రులకు ఉచితంగ...
రోజుకు 500 సిలిండర్లు కోరుతున్న ఆసుపత్రులు  డి.ఆర్.డి.వోతో కలిసి 40 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం  ఒక్కొక్క ప్లాంటు నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం  భద్రాచలం ఐ.టి.సి నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతి  స్పెయిన్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతికి ఎంఈఐఎల్ అంగీకారం  క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల తయారీకి సంసిద్ధత కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ‌కు ఆక్సిజ‌న్ అందించ‌మ‌ని అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి.. వ‌చ్చిందే త‌డ‌వుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆక్సిజ‌న్ సేక‌ర‌ణ కోసం భ‌ద్రాచ‌లంలోని ఐటిసి, హైద‌రాబాద్‌లోని డిఆర్‌డివోతో ఆఘ‌మేఘాల మీద ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రోగులు ఆక్సిజన్ సమస్యతో సతమతమవుతున్నారు. ఆక్సిజన్ అందక రోజుకు కొన్ని వందల మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఆక్సిజన్ అవసరమయ్యే అన్ని హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం సహకారంతో వివిధ హాస్పిటల్స్ కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనుంది. కోవిడ్ రోగుల అవసరాలకు అనుగుణంగా నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ బెడ్లను పెంచుతూ పోతోంది. ప్రస్తుతం 180 నుంచి 500 బెడ్లకు పెంచారు. పెంచిన బెడ్లకు అనుగుణంగా నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే సరోజిని దేవి కంటి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను అందించబోతుంది మేఘా సంస్థ. ఇక అపోలో హాస్పిటల్స్ కు ప్రతి రోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లను సరఫరా చేయనుంది. ఇక భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. డి.ఆర్.డి.వో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మొత్తాన్ని డి.ఆర్.డి.వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. మొత్తానికి డి.ఆర్.డి.వో సహకారంతో మేఘా ఇంజనీరింగ్ 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయనుంది. ఈ మేరకు ఆయా హాస్పిటల్ నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వీటికి అనుగుణంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది మేఘా సంస్థ. ఇక భద్రాచలం ఐ.టి.సి నుంచి రోజుకు 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ ను తీసుకొని ఎంఈఐఎల్ సంస్థ లిక్విడ్ ఆక్సిజన్ గా మార్చనుంది. ఇందుకు అనుగుణంగా భద్రాచలం ఐ.టి.సి దగ్గర ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ క్రయోజనిక్ ఆక్సిజన్ లభ్యమవుతోంది. స్పెయిన్ లో ఉన్న ఎంఈఐఎల్ కు సంబంధించి కర్మాగారం నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను దిగుమతి చేసేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అక్కడి ఫ్యాక్టరీ నుంచి 2 నుంచి 3 ట్యాంకులను ఇక్కడి ఆక్సిజన్ నిల్వ, సరఫరా అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపాదికన తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే సమయంలో ఎంఈఐఎల్ కు సంబంధించిన నగర శివారులోని పరిశ్రమల్లో 10 నుంచి 15 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన తయారు చేసి అందించేందుకు కూడా సంసిద్ధత తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్ లతో పాటు డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ పరిశీలన, అనుమతి అనంతరం వాటి తయారీకి వెంటనే రంగంలోకి దిగుతుంది.

PostedOn: 08 May 2021 Total Views: 78
పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాసన పుత్రిక ‘పోలవరం’. ఆయన హయాంలో రూపుదాల్చుకున్న ఈ ప్రాజెక్టు సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో పరుగులు పెడుతోంది. ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం వచ్చింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదలకు శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. దీనిలో భాగంగా ఈసీఆర్ఎఫ...

11 Jun 2021

ఏపీకి ప్రభుత్వానికి 3 ఆక్సిజన్ ట్యాంకులు...

ఏపీకి ప్రభుత్వానికి 3 ఆక్సిజన్ ట్యాంకులు ఉచితంగా అ...

సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం • దుర్...

01 Jun 2021

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే ...

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే కదలుతున్న ...

గురివింద గింజ నలుపెరుగని‌ చందంగా నిమ్స్‌లో లో అధికారుల తీరుమారిపోయింది. మొత్తం 22వేల వ్యాక్సిన్ లలో 7 వేల వ్యాక్సిన్ లు అనర్హులకు వేసారనే అంశం లో నిజానిజాలు ఒక్కొక్కటి‌బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వున్న నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే అంశం లో విస్తుపోయే నిజాలు‌కూ...

29 May 2021

తమిళ ప్రజల కష్టాలకు మేఘా చెక్.. 3వేల ఆక్...

తమిళ ప్రజల కష్టాలకు మేఘా చెక్.. 3వేల ఆక్సిజన్ బెడ్...

• తమిళనాడు వ్యాప్తంగా 3000 పైగా కోవిడ్ పడకల ఆసుపత్రులు • గ్రేటర్ చెన్నైలోనే 1070 బెడ్లు • కేవలోం 72 గంటల్లోనే 500 బెడ్స్ ఆసుపత్రి ఏర్పాటు • తమిళనాడు ప్రభుత్వం, క్రెడాయ్, జి స్క్వేర్ రియల్టర్స్ సహాకారం దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తోంది. దేశంలో వివిధ రాష్ర్టాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వి...

27 May 2021

తొలిసారిగా మేఘా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట...

తొలిసారిగా మేఘా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల ది...

• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి • దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి • తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం దేశం...

22 May 2021

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం స...

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం...

కరోనా నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. కరోనా కట్టడికి తీసుకుం...

19 May 2021

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు భ‌ద్రారెడ్డి

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు భ‌ద్రారెడ్డి

మాన‌వ‌త్వం లేని వైద్యం వ్యాపారంతో స‌మానం.. ఇదీ మంత్రి మ‌ల్లారెడ్డి త‌న కొడుకు భ‌ద్రారెడ్డికి త‌ర‌చూ చెప్పే మాట‌.. తండ్రి మాట‌ల‌కు అర్ధం తెలుసుకున్న కొడుకు- డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డి.. అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌ల‌య్యి చాలా కాల‌మే అయ్యింది.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రైనా పేద‌లు వైద్య సాయం కోస...

12 May 2021

పరుగులు పెడుతోన్న ఆంధ్ర జీవనాడి పోలవరం ప...

పరుగులు పెడుతోన్న ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు ...

యజ్ఞంలా సాగుతోన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనులు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలు, లోపాలు, అక్రమాలు-అవకతవకలు సరిచేస్తూనే సీఎం వైఎస్ జగన్ సర్కారు ముందుకు దూసుకెళ్తోంది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞం చేప...

11 May 2021