పోల‌వ‌రంపై ఆగ‌ని క‌ర‌క‌ట్ట క‌ట్ట‌ప్ప కుట్ర‌లు

పోల‌వ‌రంపై ఆగ‌ని క‌ర‌క‌ట్ట క‌ట్ట‌ప్ప కుట...
ఐదేళ్ల‌లో చంద్రబాబు కట్టలేక‌పోయిన‌ పోలవరం ప్రాజెక్ట్ ను ఏపీ సీఎం జగన్ శ‌ర‌వేగంగా పూర్తి చేస్తుండే సరికే క‌ర‌క‌ట్ట క‌ట్ట‌ప్ప చంద్ర‌బాబునాయుడుకు నిద్ర క‌రువైంది. తన‌కు ద‌క్క‌ని ఖ్యాతి ఇంకెవ‌రికీ ద‌క్క‌కూడ‌ద‌న్న‌సిద్ధాంతాన్ని వంట‌ప‌ట్టిచ్చుకున్న ప‌చ్చ‌పార్టీ నేత‌లు అందుకే పోల‌వ‌రంపై రోజూ విషం క‌క్కుతున్నారు. చ‌చ్చు ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌చ్చ‌నేత‌లు...పుచ్చు రాత‌లు రాస్తూ ప‌చ్చ మీడియా రెచ్చిపోతున్నారు. 14 శాతం లెస్ టెండ‌ర్‌కు ప‌నులు చేస్తుంటే కూడా ఏడుపేనా? చంద్ర‌బాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ను గ్రాఫిక్స్‌కే ప‌రిమితం చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. వైఎస్ జ‌గ‌న్ సీఎంగా వ‌చ్చాక 14 శాతం లెస్ టెండ‌ర్ల‌కే పోల‌వ‌రం ప‌నుల‌ను అప్ప‌గించారు. మామూలుగా అయితే ఏడాదికి ఏడాదికి ప్రాజెక్టు ప‌నుల అంచ‌నాల‌ రేట్లు పెరుగుతుంటాయి. ఎందుకంటే కూలీల రేట్లు, సిమెంటు, ఇసుక‌, ఐర‌న్ ధ‌ర‌లు ఏడాదికేడాది పెరుగుతాయి కాబ‌ట్టి. కానీ ఐదేళ్ల కింద ఖ‌రారు చేసిన పోల‌వ‌రం అంచ‌నాల‌తోనే 14 శాతం త‌గ్గించి జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత కొత్త కాంట్రాక్టు సంస్థ‌కు ప‌నులు అప్ప‌గించిన వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌చ్చ‌నేత‌లు చ‌చ్చు ఆరోప‌ణ‌లు చేస్తుంటే జ‌నం న‌వ్విపోతున్నారు. ఆ చ‌చ్చు ఆరోప‌ణ‌ల‌కు ప‌చ్చమీడియా పుచ్చురాత‌లు రాస్తుంటే ఈస‌డించుకుంటున్నారు. ప‌నుల వేగం ప‌చ్చ‌నేత‌ల ప్రాణ‌మీద‌కు వ‌చ్చింది! జగన్ ప్రభుత్వం వ‌చ్చాక పోల‌వ‌రం పనులను శరవేగంగా చేయడం చూసి ప‌చ్చ‌నేత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. పోలవరం అంచనాలను భారీగా పెంచి అవినీతి పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ కు లబ్ది చేకూర్చడానికి అదనంగా పెంచారని గోబెల్స్ ప్ర‌చారానికి దిగుతున్నారు. తాను దొంగైతే ప‌రాయివారిని న‌మ్మ‌ర‌న్న చందంగా ఉంది టిడిపి నేత‌ల వ్య‌వ‌హారం. అంచ‌నాలు పెంచ‌డం అంటే గ్రాఫిక్స్ కాదూ బాబూ! పోలవరం ప్రాజెక్ట్ లో ఏదైనా అంచనాలను పెంచాలన్నా, సవరించాలన్నా కేంద్ర జలసంఘం ఆమోదం తప్పక తీసుకోవాలి. ప్రాజెక్ట్ నిర్మాణం మొత్తం కేంద్ర జలసంఘం ఆధీనంలోని ప్రత్యేక అథారిటి పర్యవేక్షణలో జరుగుతోంది. నిర్మాణంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, సవరించాలన్నా ఈ అథారిటీ ఫైనల్. ఎందుకంటే పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు కాబ‌ట్టి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్మాణ పనిని మాత్రమే పర్యవేక్షిస్తోంది. కానీ ప‌చ్చ‌నేత‌ల‌కు ఈ అంచ‌నాలు పెంచ‌డం వారు గ్రాఫిక్స్ త‌యారు చేసినంత ఈజీగా మాట్లాడుతున్నారు. బాబు హ‌యాంలో జ‌రిగిన ప‌నుల్లో అవినీతి వ‌ర‌ద‌! పోల‌వ‌రం ప్రాజెక్టులో బాబు త‌న హ‌యాంలో చేసిన ప‌నుల్లో అవినీతి వ‌ర‌ద పారింది. గత రెండేళ్లుగా సంభంవించిన భారీ వరదలకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ పలుచోట్ల దెబ్బతింది. ముఖ్యంగా డయాఫ్రం వాల్, అప్పర్ కాఫర్ డ్యాంలతో పాటు మట్టి కట్టలు కోతకు గురయ్యాయి. వీటిని అప్పటి ప్రభుత్వం ఇంజనీరింగ్ నియమాలకు విరుద్ధంగా చేయడం వల్ల దెబ్బతిన్నాయి. బాబు పాపాల‌ను క‌డిగే ప‌నిలో భాగంగానే అంచ‌నాలు పెంపు గ‌త ప్ర‌భుత్వ అవినీతి కార‌ణంగా ఏర్ప‌డిన ఇబ్బందుల‌ను, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోల‌వ‌రం ప్రాజెక్టులో మార్పులు, చేర్పులు చేయాల్సి వ‌చ్చింది. 50 లక్షల క్యుసెక్కుల వదర వచ్చినా జలాశయం తట్టుకొని స్పిల్ వే మీదుగా వరద సులభంగా పారేందుకు నిర్మాణ పనుల్లో, డిజైన్లలో తరచూ కేంద్ర జలసంఘం మార్పులు చేస్తోంది. ఈ మార్పుల ఆధారంగా నిర్మాణ పనుల్లో వ్యత్యాసం ముఖ్యంగా పని పరిమాణం పెరుగుతోంది. ఒక్క అప్రోచ్ ఛానెల్ లోనే దాదాపు కోటి ఇరవై లక్షల ఘనపు మీటర్ల మట్టిని తవ్వాల్సి వస్తోంది. తొలుత వేసిన అంచనా కన్నా ఇది నాలుగు రెట్లు అధికం. ఈ విధంగా డిజైన్లలో, పనుల్లో మార్పులు చేర్పులు కేంద్రం చేస్తోంది. ప్ర‌తిదీ కేంద్ర ప్ర‌భుత్వ అధీనంలోని సంస్థ‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే... పోల‌వ‌రం అతిపెద్ద వరద డిశ్చార్జ్ కలిగిన ప్రాజెక్ట్ కావడంతో డిజైన్లు కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలే పర్యవేక్షిస్తున్నాయి. నిన్నటి వరకూ పోలవరం ప్రాజెక్టులో తట్టమట్టి తీయలేదు. బొచ్చెడు కాంక్రీట్ వేయలేదు. ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి అంటూ ముసలి కన్నీరు కార్చిన పచ్చపార్టీ నేతలు ప్రాజెక్టు పనులు వర్క్ ప్రోగ్రెస్ చూసి కుళ్ళుకునే పరిస్దితికి వచ్చారు. దీంతో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ప్రాజెక్టు మీద దుమ్మెత్తిపోద్దామా అంటూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. నిజానికి ఇవి అన్ని పచ్చ మీడియా సృష్టిస్తోన్న అబద్దాలే. జ‌ల‌సంఘం సూచ‌న‌మేర‌కే 683 కోట్ల అద‌న‌పు ప‌నులు పోలవరం ప్రాజెక్ట్ లో అదనపు పనులను కేంద్ర జలసంఘం సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చింది. అందుకు అనుగుణంగా 683 కోట్ల పనులకు జగన్ సర్కార్ ఇటీవల జ్యూడిషియల్ అప్రూవల్ తీసుకుని టెండర్లను పిలిచింది. ఐతే ఇటీవల డిడిఆర్పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టు భద్రతకోసం మరి కొన్ని కొత్త డిజైన్లు సూచించారు.. దీని ప్రకారం పాత అగ్రిమెంట్ కు అదనంగా కొత్త పనులు జత అవ్వడంతో ప్రాజెక్టు అంచనాలు కూడా పెరిగాయి. ఇవన్నీ కూడా సిడబ్ల్యూసీ సూచనలకు అనుగుణంగానే.. వీటిని అదనంగా చేర్చారు. అద‌నపు ప‌నులు ఇవీ.... 1. స్పిల్ ఛానెల్ ఎండ్ కటాఫ్ డయా ఫ్రంవాల్ ; స్పిల్ ఛానెల్ చివరన 12 మీటర్ల లోతు నుండి 1354 మీటర్ల పొడవున కటాఫ్ వాల్ ను నిర్మించనున్నారు. స్పిల్ ఛానెల్లో నిర్మించే కాంక్రీట్ బ్లాకులు, మట్టి స్పిల్ వే నుండి వచ్చే భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. ఒక వేళ స్పిల్ వే నుండి విడుదల చేసే భారీ వరద ప్రవాహ వేగానికి కాంక్రీట్ బ్లాకులు, మట్టి కొట్టుకుపోయినా ఈ డయా ఫ్రం వాల్ అడ్డుకుంటుంది. దీనిని 83.17కోట్లతో నిర్మించనున్నారు. 2. గ్యాప్-2లో నేలను గట్టిపరిచే పనుల్లో ఇసుక‌తోపాటు కంక‌ర కూడా... ప్రాజెక్టులో అతికీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మించాలంటే ముందుగా నదీగర్భంలోని ఇసుకను దాదాపు 100 అడుగుల లోతునుండి గట్టిపరచుకుంటూ నేలను రాయిలాగా మార్చాలి. దీనినే వైబ్రోకాంపాక్షన్ అంటారు. ఇలా నేలను గట్టి పరుస్తూ ఆ గ్యాప్ లో ఇసుక ను నింపుతారు. ఇప్పుడు దీంట్లో మారిన డిజైన్ల ప్రకారం ఇటుకతో పాటు కంకరను నింపాలి. దీనినే స్టోన్ కాలమ్స్ గా పిలుస్తారు. అలాగే భూమిని లోతు నుండి గట్టిపరచుకుంటూ చేసే పనులనే డీప్ సాయిల్ మిక్సింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల భూమిలోపల ఖాళీ ప్రదేశం లేకుండా రాయిలాగా గట్టిగా మారుతుంది. దీనిపైనే ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం నిర్మిస్తారు. ఇలా చేయడం వల్ల ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం కట్టిన తరువాత బొట్టు నీరు కూడా నదీగర్భంలోనుండి దిగువకు లీకు అవ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పటిష్టతకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పనులకు కేంద్రజలసంఘం సూచనల మేరకు 211.12కోట్లతో కొత్తగా టెండర్ పిలవడం జరిగింది. గ్యాప్-1,మరియు గ్యాప్-3 లలో ఢ్యాంల నిర్మాణం ; గతంలో ఎపి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లో పోలవరం హెడ్ వర్క్స్ పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరంగ్ తో చేసుకున్న ఒప్పందంలో గ్యాప్-1లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించేలా అగ్రిమెంట్ లో ఉంది. ఐతే కేంద్రజలసంఘం నిపుణుల సూచనలకు అనుగుణంగా 586 మీటర్ల పొడవున ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం భూమిలోపల నుండి ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం నిర్మించడంతో పాటు, స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది. ఈ పనులకు సైతం 242.87 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది. ఇలా ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం, మరియు స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు చేయడం వల్ల నీరు ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా అడ్డుకుంటుంది. ఇలా చేయడంతో పక్కనే ఏర్పాటు చేస్తున్న జల విద్యుత్ ప్రాజెక్ట్ కు కూడా రక్షణగా ఉంటుంది. ఇంక గ్యాప్-3లో కూడా ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించాలని ఉంది. అయితే ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ఎర్త్ డ్యాం బదులు 140 మీటర్ల పొడవున, స్పిల్ వే లెవల్ కు కాంక్రీట్ డ్యాం నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం 11.64 కోట్లతో టెండర్లు పిలిచారు. స్పిల్ వే కుడి,ఎడమ కొండలకు రక్షణ చర్యలు ; స్పిల్ వే బ్రిడ్జికి కుడి, ఎడమ పక్కన ఉన్న కొండలకు రక్షణ చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా వర్షాలకు కొండ చర్యలు విరిగి పడిపోకుండా గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు, కేంద్రజలసంఘం సూచనల మేరకు 134.21 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు.. ఈ పనులన్నీ కూడా హెడ్ వర్క్స్ లో భాగంగా కేంద్ర జలసంఘం ఇటీవల అదనంగా సూచించడంతో అదనంగా 683 కోట్ల రూపాయల ఖర్చుఅవుతుందని అంచనాతో ఇటీవలే జ్యూడీషియల్ ప్రివ్యూ పూర్తి అయిన తరువాత టెండర్లు ఆహ్వానించారు. వీటితో పాటు మరికొన్ని అదనపు పనులు కూడా కేంద్ర జలసంఘం సూచించింది. గతంలో కాంట్రాక్ట్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ వాల్యూకు కొత్తపనులు చేరడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది. ఈ పెరిగిన అంచనాలను కేంద్రజలసంఘం ఆమోదం పొందిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. క్రెడిట్ పోకూడ‌ద‌నే అక్క‌సుతో ఆరోప‌ణ‌లు ప్రాజెక్టు అనుకున్నసమయానికే పూర్తి అవుతోంది. దీంతో క్రెడిట్ అంతా వైసీపీ ప్రభుత్వంకు వెళ్ళిపోతుందనే అక్కసుతో పచ్చపార్టీ నేతలు మొదటి నుంచి దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతటి దుష్ప్రచారం చేసినా ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేసి ఆంధ్రుల చిరకాల వాంచను నెరవేర్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది.

PostedOn: 27 Apr 2021 Total Views: 112
పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాసన పుత్రిక ‘పోలవరం’. ఆయన హయాంలో రూపుదాల్చుకున్న ఈ ప్రాజెక్టు సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో పరుగులు పెడుతోంది. ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం వచ్చింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదలకు శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. దీనిలో భాగంగా ఈసీఆర్ఎఫ...

11 Jun 2021

ఏపీకి ప్రభుత్వానికి 3 ఆక్సిజన్ ట్యాంకులు...

ఏపీకి ప్రభుత్వానికి 3 ఆక్సిజన్ ట్యాంకులు ఉచితంగా అ...

సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం • దుర్...

01 Jun 2021

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే ...

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే కదలుతున్న ...

గురివింద గింజ నలుపెరుగని‌ చందంగా నిమ్స్‌లో లో అధికారుల తీరుమారిపోయింది. మొత్తం 22వేల వ్యాక్సిన్ లలో 7 వేల వ్యాక్సిన్ లు అనర్హులకు వేసారనే అంశం లో నిజానిజాలు ఒక్కొక్కటి‌బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వున్న నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే అంశం లో విస్తుపోయే నిజాలు‌కూ...

29 May 2021

తమిళ ప్రజల కష్టాలకు మేఘా చెక్.. 3వేల ఆక్...

తమిళ ప్రజల కష్టాలకు మేఘా చెక్.. 3వేల ఆక్సిజన్ బెడ్...

• తమిళనాడు వ్యాప్తంగా 3000 పైగా కోవిడ్ పడకల ఆసుపత్రులు • గ్రేటర్ చెన్నైలోనే 1070 బెడ్లు • కేవలోం 72 గంటల్లోనే 500 బెడ్స్ ఆసుపత్రి ఏర్పాటు • తమిళనాడు ప్రభుత్వం, క్రెడాయ్, జి స్క్వేర్ రియల్టర్స్ సహాకారం దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తోంది. దేశంలో వివిధ రాష్ర్టాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వి...

27 May 2021

తొలిసారిగా మేఘా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట...

తొలిసారిగా మేఘా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల ది...

• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి • దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి • తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం దేశం...

22 May 2021

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం స...

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం...

కరోనా నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. కరోనా కట్టడికి తీసుకుం...

19 May 2021

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు భ‌ద్రారెడ్డి

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు భ‌ద్రారెడ్డి

మాన‌వ‌త్వం లేని వైద్యం వ్యాపారంతో స‌మానం.. ఇదీ మంత్రి మ‌ల్లారెడ్డి త‌న కొడుకు భ‌ద్రారెడ్డికి త‌ర‌చూ చెప్పే మాట‌.. తండ్రి మాట‌ల‌కు అర్ధం తెలుసుకున్న కొడుకు- డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డి.. అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌ల‌య్యి చాలా కాల‌మే అయ్యింది.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రైనా పేద‌లు వైద్య సాయం కోస...

12 May 2021

పరుగులు పెడుతోన్న ఆంధ్ర జీవనాడి పోలవరం ప...

పరుగులు పెడుతోన్న ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు ...

యజ్ఞంలా సాగుతోన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనులు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలు, లోపాలు, అక్రమాలు-అవకతవకలు సరిచేస్తూనే సీఎం వైఎస్ జగన్ సర్కారు ముందుకు దూసుకెళ్తోంది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞం చేప...

11 May 2021