ఆరని ఆగ్రహజ్వాల అమెరికావ్యాప్తంగా కొనసాగిన విధ్వంసకాండ

ఆరని ఆగ్రహజ్వాల అమెరికావ్యాప్తంగా కొనసాగ...
అధ్యక్ష భవనానికీ తాకిన సెగ ప్రధాన నగరాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ 1669 మంది అరెస్టు మిన్నెపొలిస్‌, మే 31: అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఆదివారం దేశంలోని మరిన్ని రాష్ర్టాలు, నగరాలకు హింసాకాండ విస్తరించింది. పోలీసులకు తోడు నేషనల్‌ గార్డ్స్‌ కూడా రంగంలోకి దిగినప్పటికీ ఆందోళనలు ఏమాత్రం తగ్గటంలేదు. వేలమంది నిరసకారులు రోడ్లు, పబ్లిక్‌ పార్కుల్లో గుమికూడి న్యాయం కావాలంటూ నినదిస్తున్నారు. ‘నాకు ఊపిరి ఆడటంలేదు’, మీ చర్యలతో మేం విసిగిపోయాం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. అల్లర్లను అదుపుచేసేందుకు న్యూయార్క్‌, మిన్నెపొలిస్‌ వంటి డజనుకుపైగా నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. నిరసనలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేలమంది నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించారు. వైట్‌హౌస్‌కు తాకిన నిరసనలు నల్లజాతి యువకుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ గత సోమవారం తెల్లజాతి పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన తర్వాత మొదలైన నిరసనలు ఆదివారం దేశ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు తాకాయి. ఆందోళనకారులు దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ గేటు వద్ద డస్ట్‌బిన్‌కు నిప్పు పెట్టారు. నిరసనలకు కేంద్రమైన మిన్నెపొలిస్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు నగరంలో పదివేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దించారు. ఫిలడేల్ఫియాలో ఆదివారం నాలుగు పోలీస్‌ వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది పోలీసులు గాయపడ్డారు. న్యూయార్క్‌, అట్లాంటా, డెనోవర్‌, లాస్‌ఎంజిల్స్‌, మిన్నెపొలిస్‌, ఆన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్‌ వంటి నగరాల్లో రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ విధించారు. 22 నగరాల్లో గురువారం నుంచి ఇప్పటివరకు 1669 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకవైపు దేశమంతా భగ్గుమంటున్నా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం శనివారం ఫ్లోరిడాలో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ప్రయోగాన్ని తిలకించటంలోనే గడిపారు. హింసాత్మక నిరసనలను డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ ఖండించారు. మీ హత్యలతో అలసిపోయాం నిరసనలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారినప్పటికీ చాలా ప్రాంతాల్లో వేలమంది శాంతియుతంగా ర్యాలీలు తీశారు. వాషింగ్టన్‌ డీసీలో దాదాపు వెయ్యిమంది నల్లజాతీయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల హింసకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. ‘ఈ చర్యలతో (పోలీసుల హత్యలు) మే విసిగిపోయాం. పోలీసుల దాష్టీకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది’ అని నిరసనలో పాల్గొన్న ఓల్గాహాల్‌ అనే మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. ‘జరుగుతున్న పొరపాట్లు నిజానికి పొరపాట్లు కావు. వారు (పోలీసులు) పదేపదే ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. నల్లజాతీయుల హత్యలను ఇప్పటికైనా ఆపాలని అన్నివర్గాల ప్రజలు నినదిస్తున్నారు’ అని బ్రూక్లిన్‌లో నిరసనల్లో పాల్గొన్న మెరిల్‌ మకిల్‌స్కీ అన్నారు. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న అలస్కా రాష్ట్రంలో ఆదివారం నిరసన ప్రదర్శనల్లో పోలీసులు కూడా పాల్గొన్నారు. పోలీసుల అతి హింసను అనుమతించేదిలేదని జునావ్‌ నగర పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఎడ్‌ మెర్సెర్‌ స్పష్టంచేశారు. అమెరికన్‌ ఉక్కు మహిళ! రొమ్మువిరుచుకొని పోలీసుల తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఈ యువతి.. అమెరికాలో నల్లజాతీయుల పోరాటానికి ప్రతిరూపం. మమల్ని కాల్చిచంపడం మీకు అలవాటేకదా.? అన్న సూటి ప్రశ్న, ఈ విద్వేషం ఇంకెన్నాళ్లు అన్న ఆవేదన, ప్రాణాలు అర్పించైనా మా హక్కులు సాధించుకుంటాం.. అన్న ధిక్కార స్వరం ఇలా ఎన్నో భావాలు పలికిస్తున్న ఈ ఫొటోపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఆ యువతిని ఉక్కుమహిళ అంటూ కొనియాడుతున్నారు. నిరసనకారులపైకి ట్రక్కు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఆదివారం నిరసనకారులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లటం కలకలం రేపింది. రోడ్డును దిగ్బంధించి వందలమంది నిరసన తెలుపుతుండగా సమీపంలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న ట్రక్కు ఉన్నట్టుండి వారిపైకి దూసుకెళ్లింది. నిరసనకారులు బాటిల్‌ విసరటంతో డ్రైవర్‌ ఆవేశంతో ఈచర్యకు పాల్పడినట్టు వీడియోలో కనిపించింది. దాడిలో పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డారు. ఒబామా తీవ్ర భావోద్వేగం జార్జ్‌ ఫ్లాయిడ్‌ దారుణ హత్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ‘ఫ్లాయిడ్‌ హత్య వీడియో చూసి నాకు ఏడుపు ఆగలేదు. సహాయంకోసం అరుస్తున్నా కనికరించక ఊపిరాడకుండా మెడపై మోకాలితో నొక్కిపెట్టడం నల్లజాతీయులపట్ల మన వ్యవస్థ తీరుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

PostedOn: 01 Jun 2020 Total Views: 147
మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్ను...

మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత!

మాజీ మంత్రి వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకి సేవలు అందించారు. అలాగే రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఎనిమిది సార్ల...

10 Aug 2020

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ ...

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ = 175

ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు వ్యవహారశైలిపై సొంత పార్టీలోని సీనియర్లు - కొత్త నేతల్లోనూ భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఢిల్లీ వెళ్లి వచ్చి రావడంతో ఆయన రాష్ట్రంలోని బీజేపీ సీనియర్లు - ఇతరులను కలిసి ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమాలోచనలు చేయకుండా.. ఇక్కడి వారిని ఎవ...

09 Aug 2020

వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డె...

వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డెత్ సర్టిఫి...

ఇవ్వలేదంట ఆ మండల ఎమ్మార్వో . ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సామాజికవర్గం.. సాక్షాత్తూ సీఎం సామాజికవర్గానికి సదురు ఏఎంసీ వైస్ చైర్మన్ సామాజికవర్గం పూర్తి వ్యతిరేకం అని ఇలా చేశాడట.. అందుకే తిప్పుతున్నాం అని ఆఫీస్ వాళ్లు చెప్పారట.. అయితే ఆ మండలం వైసీపీ నాయకులు పోయి దీనిపై నిలదీస్తే ఎమ్మెల్యే ఆపమన్నాడ...

09 Aug 2020

సీనియర్ కమెడియన్ ఎమ్మెల్సీ పదవి కోసం తిర...

సీనియర్ కమెడియన్ ఎమ్మెల్సీ పదవి కోసం తిరుగుతున్నాడ...

కరోనా దెబ్బకు సినిమాల దుకాణం బంద్ అయిపోయింది. ఇక ఇప్పటికే ఆ సీనియర్ కమెడియన్ కు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నెట్టుకొచ్చేస్తున్నాడు. సినిమాల్లో భవిష్యత్ అడుగంటడంతో రాజకీయాల బాట పట్టారు. పోయినసారే టికెట్ రావాల్సి ఉన్నా తృటిలో తప్పింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం వీరలెవల్...

08 Aug 2020

ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా...

ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా?

కరోనాకు మందు లేదు.. ఇంకా కనిపెట్టలేదు. వ్యాక్సిన్ వస్తేనే బతికిపోతాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొందరి భయాల్ని డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ కషాయాలు తాగితే కరోనా ఖతం అంటూ ఊదరగొడుతున్నారు. ఈ గోలీలు వాడితే కరోనా రాదంటూ రొజుకొక మందు మార్కెట్లోకి వస్తోంది. హోమియోపతి అల్లోపతి ఇలా లెక్కలేనన్న ఆయు...

08 Aug 2020

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

ఒకప్పుడు దేశాన్ని ఏలిన సోనియాకు.. ఇప్పుడు ఏలుతున్న సోనియాకు శాన్ దాన్ పరఖ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియాను పార్టీ సీనియర్లే తప్పు దోవ పట్టిస్తున్నారని.. వారిని నమ్మి పార్టీని అధినేత్రి నాశనం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు అసంబద్ద నిర్ణయాలతో బీజేపీ కొంచెం బలహీన ప...

07 Aug 2020

మోడీకి వైసీపీ టీడీపీ ఇద్దరూ దండాలో దండాల...

మోడీకి వైసీపీ టీడీపీ ఇద్దరూ దండాలో దండాలు?

ఇంతటి కరోనా లాక్ డౌన్ తో దేశంలోని ప్రజలంతా ఉద్యోగ ఉపాధి కోల్పోతే వారికే ఏమీ ఇవ్వని మోడీజీ.. రాజధాని కూడా లేని ఏపీకి ఏం ఇస్తాడని ఇక్కడి నేతలు భజన చేస్తున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ ఎవరికీ విదిల్చే రకం కాదని.. ఏపీలోని రెండు పార్టీలు ఎందుకు ఆయనకు భయపడుతున్నాయని ...

06 Aug 2020

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్

‘అమరావతి వర్సెస్ 3 రాజధానుల’ విషయంలో 48 గంటల డెడ్ లైన్ విధించి ఆ తర్వాత పీచేముడ్ అన్న చంద్రబాబుపై ఏపీ ప్రజలు నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు అంతటా చంద్రబాబు పేరు మారుమోగిపోతోంది. బుధవారం సాయంత్రం ‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’ హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది. నెటిజన్లు ఏపీ ప్రజ...

06 Aug 2020