150 కోట్ల అక్రమాలు.. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌

150 కోట్ల అక్రమాలు.. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చ...
అమరావతి : ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిమ్మాడలో ఇవాళ ఉదయం 7:30 గంటలకు ఏసీబీ అధికారులు.. ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ఈ కేసులు అచ్చెన్నాయుడితో పాటు ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో రమేశ్‌ కుమార్‌, విజయ్‌ కుమార్‌, జనార్ధన్‌రావు, రమేశ్‌ బాబు, ఎంకేపీ చక్రవర్తి ఉన్నారు. వీరందరిని విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి వద్ద శుక్రవారం సాయంత్రం హాజరుపరుస్తామన్నారు. సుమారు రూ. 150 కోట్ల అక్రమాలు జరిగాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు నిధులు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఫేక్‌ ఇన్వాయిస్‌తో మందుల కొనుగోలుకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. కనీసం ప్రిన్సిపల్‌ సెక్రటరీకి తెలియకుండా కొన్ని ప్రక్రియలు చేశారని తెలిపారు. విజిలెన్స్‌ రిపోర్టుపై ఏసీబీ విచారణ చేస్తూ అరెస్టు చేశామన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు మాజీ మంత్రిపై అభియోగాలు ఉన్నాయి. ఈ అవినీతి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు అభియోగాలు ఉండటంతో.. ఇప్పటికే విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో దర్యాప్తు కొనసాగుతోంది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు ఉన్నాయి.

PostedOn: 12 Jun 2020 Total Views: 90




మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్ను...

మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత!

మాజీ మంత్రి వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకి సేవలు అందించారు. అలాగే రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఎనిమిది సార్ల...

10 Aug 2020

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ ...

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ = 175

ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు వ్యవహారశైలిపై సొంత పార్టీలోని సీనియర్లు - కొత్త నేతల్లోనూ భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఢిల్లీ వెళ్లి వచ్చి రావడంతో ఆయన రాష్ట్రంలోని బీజేపీ సీనియర్లు - ఇతరులను కలిసి ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమాలోచనలు చేయకుండా.. ఇక్కడి వారిని ఎవ...

09 Aug 2020

వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డె...

వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డెత్ సర్టిఫి...

ఇవ్వలేదంట ఆ మండల ఎమ్మార్వో . ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సామాజికవర్గం.. సాక్షాత్తూ సీఎం సామాజికవర్గానికి సదురు ఏఎంసీ వైస్ చైర్మన్ సామాజికవర్గం పూర్తి వ్యతిరేకం అని ఇలా చేశాడట.. అందుకే తిప్పుతున్నాం అని ఆఫీస్ వాళ్లు చెప్పారట.. అయితే ఆ మండలం వైసీపీ నాయకులు పోయి దీనిపై నిలదీస్తే ఎమ్మెల్యే ఆపమన్నాడ...

09 Aug 2020

సీనియర్ కమెడియన్ ఎమ్మెల్సీ పదవి కోసం తిర...

సీనియర్ కమెడియన్ ఎమ్మెల్సీ పదవి కోసం తిరుగుతున్నాడ...

కరోనా దెబ్బకు సినిమాల దుకాణం బంద్ అయిపోయింది. ఇక ఇప్పటికే ఆ సీనియర్ కమెడియన్ కు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నెట్టుకొచ్చేస్తున్నాడు. సినిమాల్లో భవిష్యత్ అడుగంటడంతో రాజకీయాల బాట పట్టారు. పోయినసారే టికెట్ రావాల్సి ఉన్నా తృటిలో తప్పింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం వీరలెవల్...

08 Aug 2020

ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా...

ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా?

కరోనాకు మందు లేదు.. ఇంకా కనిపెట్టలేదు. వ్యాక్సిన్ వస్తేనే బతికిపోతాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొందరి భయాల్ని డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ కషాయాలు తాగితే కరోనా ఖతం అంటూ ఊదరగొడుతున్నారు. ఈ గోలీలు వాడితే కరోనా రాదంటూ రొజుకొక మందు మార్కెట్లోకి వస్తోంది. హోమియోపతి అల్లోపతి ఇలా లెక్కలేనన్న ఆయు...

08 Aug 2020

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

ఒకప్పుడు దేశాన్ని ఏలిన సోనియాకు.. ఇప్పుడు ఏలుతున్న సోనియాకు శాన్ దాన్ పరఖ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియాను పార్టీ సీనియర్లే తప్పు దోవ పట్టిస్తున్నారని.. వారిని నమ్మి పార్టీని అధినేత్రి నాశనం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు అసంబద్ద నిర్ణయాలతో బీజేపీ కొంచెం బలహీన ప...

07 Aug 2020

మోడీకి వైసీపీ టీడీపీ ఇద్దరూ దండాలో దండాల...

మోడీకి వైసీపీ టీడీపీ ఇద్దరూ దండాలో దండాలు?

ఇంతటి కరోనా లాక్ డౌన్ తో దేశంలోని ప్రజలంతా ఉద్యోగ ఉపాధి కోల్పోతే వారికే ఏమీ ఇవ్వని మోడీజీ.. రాజధాని కూడా లేని ఏపీకి ఏం ఇస్తాడని ఇక్కడి నేతలు భజన చేస్తున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ ఎవరికీ విదిల్చే రకం కాదని.. ఏపీలోని రెండు పార్టీలు ఎందుకు ఆయనకు భయపడుతున్నాయని ...

06 Aug 2020

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్

‘అమరావతి వర్సెస్ 3 రాజధానుల’ విషయంలో 48 గంటల డెడ్ లైన్ విధించి ఆ తర్వాత పీచేముడ్ అన్న చంద్రబాబుపై ఏపీ ప్రజలు నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు అంతటా చంద్రబాబు పేరు మారుమోగిపోతోంది. బుధవారం సాయంత్రం ‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’ హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది. నెటిజన్లు ఏపీ ప్రజ...

06 Aug 2020