ఇవి అక్రమ అరెస్టులైతే...మీ పాలనలో జరిగినవేంటీ చంద్రబాబూ..?

ఇవి అక్రమ అరెస్టులైతే...మీ పాలనలో జరిగిన...
అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు చేసిన తమ నేతలను పార్టీ నేతలను వెనకేసుకురావడంలో టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు‌ దేశంలో మరెవ్వరూ సాటిరారు. ఎంత అవినీతి చేసినా...ఎన్ని అక్రమాలు చేసినా ఫర్వాలేదు. ప్రజలను ఎలా దోచుకున్నా ఫర్వాలేదు. కాని పార్టీతోనే ఉండాలి. అవినీతి అక్రమాలు చేసైనా పార్టీని నిలబెట్టాలి అని చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తాడు. ఈ క్రమంలోనే ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడును పక్కా ఆధారాలతో ఎసిబి అరెస్టు చేసింది. తప్పు చేసిన వాడిని అరెస్టు చేయడం, విచారించడం అది చట్టబద్ధంగానే జరిగే ప్రక్రియ. ఇదే ఏపిలో జరిగింది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి. అయితే అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం అన్యాయమంటా..చంద్రబాబుగారు అంటున్నారు. ఇది అన్యాయమైతే చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ప్రజల పక్షాన నిలబడిన ప్రతిపక్షాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నేతలను అరెస్టు చేయడాన్ని ఏమంటారో చంద్రబాబే చెప్పాలి. రాష్ట్రంలో టిడిపి నేతలు గత ఐదేళ్లలో దొరికింది దొరికినట్లు తిన్నారు. ప్రజల సొమ్మును దోచుకిన్నారు. అందుకు అనుగుణంగా వారికి నచ్చినట్లు ఉత్తర్వులు ఇచ్చుకున్నారు. ఆనాడు తిన్నదల్లా కక్కించే ప్రక్రియ ప్రారంభం అయ్యేసరికి చంద్రబాబుకు భయం పట్టుకుంది. దీంతో ఏవేవో ప్రకటనలు‌ చేస్తున్నారు. తనకు‌ సూటుకాని మాటలు ఆడుతున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ప్రజల మన్ననలతో అధికారాన్ని చేపట్టిన సిఎం వైఎస్ జగన్ గత పాలన అవినీతి బూజును దుపుతున్నారు. అలాగే మరోవైపు ప్రస్తుత ప్రభుత్ పాలనలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఈ సందర్భంలో గత పాలనలో కార్మిక మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను ఎసిబి అరెస్టు చేసింది. వీటిని అక్రమ అరెస్టులంటూ చంద్రబాబు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు. ఇవి అక్రమ అరెస్టులైతే చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో జరిగిన అరెస్టులు ఏంటీ..? ఆనాడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థులను, యువకులను అక్రమంగా అరెస్టు చేయించింది ఎవరు..? ఆనాడు ఆ అమాయక విద్యార్థులపైన, యువకులపైన అక్రమ కేసులు పెట్చిందెవరూ..? ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్యపైనైనా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసినా అమాయకులను అక్రమ అరెస్టులకు పాల్పడటం, అక్రమ కేసులు బనాయించడం‌ జరిగేవి. కొన్ని సందర్భాలలో అయితే ఏకంగా జైలుకు పంపించారు. ఆనాడు అమాయకులను అరెస్టులు చేయించడం, కేసులు బనాయించడం, జైల్ కు పంపించడం చేసిన చంద్రబాబే...ఈ రోజు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే దాన్ని అక్రమ అరెస్టులని ప్రకటనలు చేయడం ఎలాగుందంటే...దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంది.

PostedOn: 13 Jun 2020 Total Views: 118
మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్ను...

మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత!

మాజీ మంత్రి వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకి సేవలు అందించారు. అలాగే రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఎనిమిది సార్ల...

10 Aug 2020

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ ...

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ = 175

ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు వ్యవహారశైలిపై సొంత పార్టీలోని సీనియర్లు - కొత్త నేతల్లోనూ భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఢిల్లీ వెళ్లి వచ్చి రావడంతో ఆయన రాష్ట్రంలోని బీజేపీ సీనియర్లు - ఇతరులను కలిసి ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమాలోచనలు చేయకుండా.. ఇక్కడి వారిని ఎవ...

09 Aug 2020

వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డె...

వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డెత్ సర్టిఫి...

ఇవ్వలేదంట ఆ మండల ఎమ్మార్వో . ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సామాజికవర్గం.. సాక్షాత్తూ సీఎం సామాజికవర్గానికి సదురు ఏఎంసీ వైస్ చైర్మన్ సామాజికవర్గం పూర్తి వ్యతిరేకం అని ఇలా చేశాడట.. అందుకే తిప్పుతున్నాం అని ఆఫీస్ వాళ్లు చెప్పారట.. అయితే ఆ మండలం వైసీపీ నాయకులు పోయి దీనిపై నిలదీస్తే ఎమ్మెల్యే ఆపమన్నాడ...

09 Aug 2020

సీనియర్ కమెడియన్ ఎమ్మెల్సీ పదవి కోసం తిర...

సీనియర్ కమెడియన్ ఎమ్మెల్సీ పదవి కోసం తిరుగుతున్నాడ...

కరోనా దెబ్బకు సినిమాల దుకాణం బంద్ అయిపోయింది. ఇక ఇప్పటికే ఆ సీనియర్ కమెడియన్ కు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నెట్టుకొచ్చేస్తున్నాడు. సినిమాల్లో భవిష్యత్ అడుగంటడంతో రాజకీయాల బాట పట్టారు. పోయినసారే టికెట్ రావాల్సి ఉన్నా తృటిలో తప్పింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం వీరలెవల్...

08 Aug 2020

ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా...

ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా?

కరోనాకు మందు లేదు.. ఇంకా కనిపెట్టలేదు. వ్యాక్సిన్ వస్తేనే బతికిపోతాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొందరి భయాల్ని డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ కషాయాలు తాగితే కరోనా ఖతం అంటూ ఊదరగొడుతున్నారు. ఈ గోలీలు వాడితే కరోనా రాదంటూ రొజుకొక మందు మార్కెట్లోకి వస్తోంది. హోమియోపతి అల్లోపతి ఇలా లెక్కలేనన్న ఆయు...

08 Aug 2020

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

ఒకప్పుడు దేశాన్ని ఏలిన సోనియాకు.. ఇప్పుడు ఏలుతున్న సోనియాకు శాన్ దాన్ పరఖ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియాను పార్టీ సీనియర్లే తప్పు దోవ పట్టిస్తున్నారని.. వారిని నమ్మి పార్టీని అధినేత్రి నాశనం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు అసంబద్ద నిర్ణయాలతో బీజేపీ కొంచెం బలహీన ప...

07 Aug 2020

మోడీకి వైసీపీ టీడీపీ ఇద్దరూ దండాలో దండాల...

మోడీకి వైసీపీ టీడీపీ ఇద్దరూ దండాలో దండాలు?

ఇంతటి కరోనా లాక్ డౌన్ తో దేశంలోని ప్రజలంతా ఉద్యోగ ఉపాధి కోల్పోతే వారికే ఏమీ ఇవ్వని మోడీజీ.. రాజధాని కూడా లేని ఏపీకి ఏం ఇస్తాడని ఇక్కడి నేతలు భజన చేస్తున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ ఎవరికీ విదిల్చే రకం కాదని.. ఏపీలోని రెండు పార్టీలు ఎందుకు ఆయనకు భయపడుతున్నాయని ...

06 Aug 2020

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్

‘అమరావతి వర్సెస్ 3 రాజధానుల’ విషయంలో 48 గంటల డెడ్ లైన్ విధించి ఆ తర్వాత పీచేముడ్ అన్న చంద్రబాబుపై ఏపీ ప్రజలు నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు అంతటా చంద్రబాబు పేరు మారుమోగిపోతోంది. బుధవారం సాయంత్రం ‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’ హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది. నెటిజన్లు ఏపీ ప్రజ...

06 Aug 2020