జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రులు ఆ ఇద్దరేనా..?

జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రులు ఆ ఇద్దర...
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంలో పని చేస్తున్న పిల్లి సుభాస్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఎంపికవ్వడంతో ఆ రెండు స్థానాలను భర్తీ చేయాలని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి భావిస్తున్నారు. ఈనెలాఖరులోగా కొత్త మంత్రుల ఎంపిక ఉంటుందంటూ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు సమాచారమిచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కాగా రాజ్యసభకు ఎంపికయిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ బిసిలే. వీరి స్థానంలోనూ బిసిలనే తిరిగి మంత్రులుగా ఎంపిక చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లూ టిడిపికి ఓటు బ్యాంక్‌గా ఉన్న బిసిలను ఆకర్షించి తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్‌ భావిస్తున్నారు. అందులో భాగంగానే బీసీలకు కీలక పదవులను కట్టబెట్టారు. బిసిలకు సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టి నేరుగా నగదు అందజేస్తున్నారు. రాజ్యసభకు ఇద్దరు బిసిలను పంపించి తమగల చిత్తశుద్దిని బిసిలకు చూపించారు. ఇప్పుడు ఈ రెండు మంత్రిపదవులను కూడా బిసిలకే కేటాయించి ఆ వర్గాల ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీలోని కొందరు సీనియర్లు మాత్రం ఇప్పటికే రెండు రాజ్యసభ సీట్లను బిసిలకు ఇచ్చి గౌరవించామని, మంత్రి పదవులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, కొత్త వర్గాలకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఒత్తిడి తెస్తున్నారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శెట్టి బలిజ కులానికి చెందినవాడు కాగా, వెంకటరమణ మత్సుకారుల కులానికి చెందినవారు. వీరి స్థానాల్లో బిసిలకు ఇస్తే కులాల వారికి ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. కేబినెట్‌లోగానీ, అటు రాజ్యసభ సీట్లలోగానీ ప్రాతినిధ్యం దొరకని బిసి నేతలకు మంత్రిపదవులు ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వస్తోంది. ఇందులో ప్రధానంగా గౌడ కులానికి చెందిన కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇదే జిల్లా నుంచి మాజీ మంత్రి పార్ధసారధి కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నప్పటికీ ఇప్పటికే యాదవ కులానికి చెందిన అనిల్‌ కుమార్‌ మంత్రిపదవిలో ఉన్నందున పార్ధసారధికి అవకాశం లభించే పరిస్థితిలేదని వినిపిస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నుంచి గెలిచిన మత్సకార సామాజికవర్గానికి చెందిన పొన్నాడ సతీష్‌ కుమార్‌కు ఈసారి అవకాశం కచ్చితంగా లభించనుందని సమాచారం. ఈసారి మంత్రి పదవి తనకు కచ్చితంగా వస్తుందని, ఈమేరకు తనకు సిఎం నుండి హామీ లభించిందని సతీష్‌ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు కూడా సమాచారం. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి గెలిచిన సీదిరి అప్పలరాజు కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఇంకా చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందకు సిద్దంగా ఉన్నారు. కానీ జోగి రమేష్‌, పొన్నాడ సతీష్‌కే మంత్రి పదవులు లభించే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.

PostedOn: 23 Jun 2020 Total Views: 98
మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్ను...

మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత!

మాజీ మంత్రి వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకి సేవలు అందించారు. అలాగే రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఎనిమిది సార్ల...

10 Aug 2020

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ ...

సోము వీర్రాజు + చిరంజీవి + పవన్ కళ్యాణ్ = 175

ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు వ్యవహారశైలిపై సొంత పార్టీలోని సీనియర్లు - కొత్త నేతల్లోనూ భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఢిల్లీ వెళ్లి వచ్చి రావడంతో ఆయన రాష్ట్రంలోని బీజేపీ సీనియర్లు - ఇతరులను కలిసి ఎలా ముందుకెళ్లాలనేదానిపై సమాలోచనలు చేయకుండా.. ఇక్కడి వారిని ఎవ...

09 Aug 2020

వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డె...

వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డెత్ సర్టిఫి...

ఇవ్వలేదంట ఆ మండల ఎమ్మార్వో . ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సామాజికవర్గం.. సాక్షాత్తూ సీఎం సామాజికవర్గానికి సదురు ఏఎంసీ వైస్ చైర్మన్ సామాజికవర్గం పూర్తి వ్యతిరేకం అని ఇలా చేశాడట.. అందుకే తిప్పుతున్నాం అని ఆఫీస్ వాళ్లు చెప్పారట.. అయితే ఆ మండలం వైసీపీ నాయకులు పోయి దీనిపై నిలదీస్తే ఎమ్మెల్యే ఆపమన్నాడ...

09 Aug 2020

సీనియర్ కమెడియన్ ఎమ్మెల్సీ పదవి కోసం తిర...

సీనియర్ కమెడియన్ ఎమ్మెల్సీ పదవి కోసం తిరుగుతున్నాడ...

కరోనా దెబ్బకు సినిమాల దుకాణం బంద్ అయిపోయింది. ఇక ఇప్పటికే ఆ సీనియర్ కమెడియన్ కు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నెట్టుకొచ్చేస్తున్నాడు. సినిమాల్లో భవిష్యత్ అడుగంటడంతో రాజకీయాల బాట పట్టారు. పోయినసారే టికెట్ రావాల్సి ఉన్నా తృటిలో తప్పింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం వీరలెవల్...

08 Aug 2020

ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా...

ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా?

కరోనాకు మందు లేదు.. ఇంకా కనిపెట్టలేదు. వ్యాక్సిన్ వస్తేనే బతికిపోతాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొందరి భయాల్ని డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ కషాయాలు తాగితే కరోనా ఖతం అంటూ ఊదరగొడుతున్నారు. ఈ గోలీలు వాడితే కరోనా రాదంటూ రొజుకొక మందు మార్కెట్లోకి వస్తోంది. హోమియోపతి అల్లోపతి ఇలా లెక్కలేనన్న ఆయు...

08 Aug 2020

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

ఒకప్పుడు దేశాన్ని ఏలిన సోనియాకు.. ఇప్పుడు ఏలుతున్న సోనియాకు శాన్ దాన్ పరఖ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియాను పార్టీ సీనియర్లే తప్పు దోవ పట్టిస్తున్నారని.. వారిని నమ్మి పార్టీని అధినేత్రి నాశనం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు అసంబద్ద నిర్ణయాలతో బీజేపీ కొంచెం బలహీన ప...

07 Aug 2020

మోడీకి వైసీపీ టీడీపీ ఇద్దరూ దండాలో దండాల...

మోడీకి వైసీపీ టీడీపీ ఇద్దరూ దండాలో దండాలు?

ఇంతటి కరోనా లాక్ డౌన్ తో దేశంలోని ప్రజలంతా ఉద్యోగ ఉపాధి కోల్పోతే వారికే ఏమీ ఇవ్వని మోడీజీ.. రాజధాని కూడా లేని ఏపీకి ఏం ఇస్తాడని ఇక్కడి నేతలు భజన చేస్తున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ ఎవరికీ విదిల్చే రకం కాదని.. ఏపీలోని రెండు పార్టీలు ఎందుకు ఆయనకు భయపడుతున్నాయని ...

06 Aug 2020

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్

‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్

‘అమరావతి వర్సెస్ 3 రాజధానుల’ విషయంలో 48 గంటల డెడ్ లైన్ విధించి ఆ తర్వాత పీచేముడ్ అన్న చంద్రబాబుపై ఏపీ ప్రజలు నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు అంతటా చంద్రబాబు పేరు మారుమోగిపోతోంది. బుధవారం సాయంత్రం ‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’ హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది. నెటిజన్లు ఏపీ ప్రజ...

06 Aug 2020